బీ’హోర్’లో తేజస్వీ(ప్) – ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమికే మెజారిటీ

సహనం వందే, న్యూఢిల్లీ:బీహార్ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు తాజాగా వెలువడిన లోక్ పోల్ సర్వే ఫలితాలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ సర్వే తీవ్ర హెచ్చరికగా మారింది. బీహార్‌లో రాజకీయం వేగంగా మారుతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి 118 నుండి 126 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని అంచనా. మరోవైపు…

Read More

రక్తంతో తడుస్తున్న అభిమానం – విజయ్ ర్యాలీ ఘటనలో 38 మంది మృతి

సహనం వందే, తమిళనాడు:అభిమానుల పట్ల సినిమా తారల తీరు అత్యంత దారుణంగా ఉంటుంది. ఫ్యాన్స్ అమాయకత్వాన్ని తమ సినిమా రాజకీయ, అవసరాల కోసం ఉపయోగించుకుంటూ వందల కోట్లు గడిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన అభిమానాన్ని రాజకీయాల వైపు మళ్ళించుకుని పదవులు పొందుతున్నారు. తమ స్వార్థం కోసం అభిమానుల రక్తం కళ్ళచూస్తున్నారు. పదవీకాంక్ష కోసం ఇష్టారాజ్యంగా ర్యాలీలు నిర్వహిస్తూ జనాన్ని తొక్కి చంపేస్తున్న ఈ ధోరణిని అభిమాన ఉగ్రవాదం అనకుండా ఎలా ఉండగలం? కరూరు జిల్లాలో నటుడు విజయ్…

Read More

హిందువుల ఎమోషన్… ఐఫోన్ ప్రమోషన్! – కాషాయ రంగులో ప్రత్యేకంగా ఐఫోన్ 17

సహనం వందే, న్యూఢిల్లీ:కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు…

Read More

సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ:పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా…

Read More

బ్యాంకు ‘బీమా’కింకరులు – మాయమాటలతో బీమా ఉచ్చులోకి పేదలు

సహనం వందే, హైదరాబాద్:బీమా అనేది ప్రజలకు రక్షణ కవచంలా ఉండాలి. కానీ ఇప్పుడు బ్యాంకు అధికారులకు అది దోపిడీకి మార్గంలా మారింది. ఒకప్పుడు భరోసాగా ఉన్న ఈ రంగం, ఇప్పుడు నిస్సహాయ ప్రజల జేబులకు చిల్లు పెడుతోంది. భారీ కమీషన్లు, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం… ఇవన్నీ కలిసి ఒక విషవలయం సృష్టించాయి. బీమా అనేది ఇప్పుడు మోసాల క్రీడగా, అమాయకుల సొమ్మును కొల్లగొట్టే కుట్రగా పరిణమించింది. ఈ మోసాలకు సంబంధించి కేవలం ఒక సంవత్సరంలో లక్షలాది ఫిర్యాదులు…

Read More

లోటెక్ పోస్టులకు బీటెక్ డిమాండ్ – ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది పోటీ

సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడటం విస్మయం కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. కేవలం పదో తరగతి అర్హతతో కూడిన ఈ పోస్టులకు 90 శాతం మంది డిగ్రీలు, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా యువత ఆకాంక్షలను అవమానపరిచేదిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల…

Read More

ఫ్లిప్‌కార్ట్‌లో ‘బుల్లెట్’ ఆర్డర్ – ఆన్‌లైన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయం

సహనం వందే, ముంబై:మోటార్ సైకిల్ ప్రేమికులను ఆకర్షిస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ తో జతకట్టి తమ 350సీసీ బైక్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించనుంది. సోమవారం నుంచి బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. క్లాసిక్ లుక్, గంభీరమైన ఇంజన్ సౌండ్‌తో ప్రసిద్ధి చెందిన ఈ బైక్‌లను ఇకపై మొబైల్ స్క్రీన్‌పై నుంచే కొనుగోలు చేసుకోవచ్చు. యువత ఆన్‌లైన్ షాపింగ్‌పై చూపుతున్న…

Read More

రాహుల్ జెన్ జెడ్ ప్రకంపనలు – నేపాల్ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ట్వీట్

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది. నేపాల్ తరహా జెన్ జెడ్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉండటంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన ప్రత్యేకంగా జెన్ జెడ్ అని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇటీవల నేపాల్‌లో జెన్ జెడ్ యువత భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారి 50 మందికి పైగా ప్రాణాలు…

Read More

యాపిల్ ‘ఎయిర్’… క్వాలిటీ ఫెయిల్ – అందమైన ఐఫోన్… కొన్నారో పరేషాన్

సహనం వందే, హైదరాబాద్:యాపిల్ సంస్థ ప్రతీ ఏటా కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. అంతకుముందు వెర్షన్లలో కొన్ని మార్పులు, కెమెరా అప్డేట్స్ వంటి వాటితోనే చాలావరకు సరిపెడుతుంది. కానీ ఈసారి అలా కాకుండా అత్యంత సన్నని డిజైన్‌తో కూడిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఇంత సన్నగా ఉండడం వల్లే ఎయిర్ మోడల్ గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతున్నారు. మెరిసే టైటానియం ఫ్రేమ్,…

Read More