డాక్టర్లకు సీబీఐ బేడీలు – మెడికల్ కాలేజీల అనైతిక చర్య

సహనం వందే, హైదరాబాద్:ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వైద్య కళాశాలకు గుర్తింపు ఇచ్చేందుకు ఏకంగా రూ. 55 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ ముగ్గురు వైద్యులతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పేరుకుపోయిన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. సీబీఐ అధికారులు ఈ కేసులో కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ…

Read More

ప్రతీ కులానికి గ్రేడింగ్‌ … 242 కులాలకు…

సహనం వందే, హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్‌ ఇచ్చింది. సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స‍్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర…

Read More

పారాక్వాట్ తో పొలాలు వల్లకాడు -రైతుల్లో పార్కిన్సన్స్ వ్యాధి

సహనం వందే, హైదరాబాద్:భారత్, అమెరికా దేశాల్లో విస్తృతంగా ఉపయోగించే ప్రమాదకరమైన పారాక్వాట్ హెర్బిసైడ్‌ (గడ్డి మందు) వల్ల పార్కిన్సన్స్ వ్యాధి సంభవిస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీనివల్ల రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైన కథనం ప్రకారం… పారాక్వాట్ వాడకం వల్ల అమెరికన్ రైతులు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇదే సమస్య భారత దేశంలోనూ తీవ్రంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో పారాక్వాట్ విష ప్రభావం…పారాక్వాట్ కలుపు నివారణకు…

Read More

హిందీకి ‘మహా’దెబ్బ – త్రిభాషా విధానంపై వెనక్కు తగ్గిన మహారాష్ట్ర

సహనం వందే, ముంబై:బాలీవుడ్ కు కేంద్ర బిందువైన మహారాష్ట్రలో హిందీ భాషకు ఎదురుగాలి వీస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానంపై ఇంతకాలం కొనసాగిన వివాదాలకు తెరదించుతూ వివాదాస్పదమైన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానాన్ని…

Read More

బిజీ భ్రమల్లో ఐఏఎస్‌ – 80% అనవసర పనులపైనే కేంద్రీకరణ

సహనం వందే, హైదరాబాద్: ఆయన తెలంగాణలో కీలకమైన హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్‌ అధికారి. ఆయన చేతిలో అత్యంత కీలక శాఖ ఉంది. కానీ ఆ సీనియర్ అధికారి మాత్రం రొటీన్ మీటింగ్స్, రిపోర్ట్స్ తదితర పనుల వైపే మొగ్గు చూపుతుంటారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెట్టడం ద్వారానే పని చేయించాలన్న దృక్పథంతో ఉంటారు. దానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో ఎంతో బిజీగా కనిపిస్తారు. కానీ కీలకమైన పనులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక…

Read More

‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

సహనం వందే, ముంబై:బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు. ‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని…

Read More

సైకిల్ పై 94 ఏళ్ల తాత పరుగులు – ఈ వయసులోనూ పత్రికల పంపిణీ

సహనం వందే, చెన్నై:వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, నిజమైన ఉత్సాహం గుండెల్లోనే ఉంటుందని చెన్నైలోని గోపాలపురం వాసి షణ్ముగసుందరం నిరూపిస్తున్నారు. ఈ 94 ఏళ్ల తాత తన సైకిల్‌పై వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రతి రోజూ అలుపెరగని కృషికి, సమాజంతో మమేకమైన జీవన విధానానికి ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. అందరూ ముద్దుగా ‘పేపర్ తాత’ అని పిలుచుకునే ఈయన జీవితగాథ, యువతరానికి సైతం స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప పాఠం. ఉదయం…

Read More

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ రాజకీయ కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎంలను బలహీనపరిచేందుకు బీజేపీ స్థానిక నాయకత్వం, పొత్తులు, సినీ తారలను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు…

Read More

కోడిగుడ్ల కుంభకోణం? – అంగన్‌వాడీ పిల్లల ఆకలితో ఆటలు

సహనం వందే, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. నెలల తరబడి సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అంగన్‌వాడీ పిల్లల పోషకాహారాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా నాలుగోసారి దరఖాస్తు గడువు పొడిగింపుతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువును పొడిగించింది. కానీ టెండర్లు ఎప్పుడు తెరుస్తారో మాత్రం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది. అంతులేని…

Read More

ఓం బదులు ఇస్లామిక్ పదం బిస్మిల్లాతో రామాయణం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం…

Read More