బీహార్ లో జర్నలిస్టులకు 15 వేల పెన్షన్

సహనం వందే, హైదరాబాద్:జర్నలిస్టుల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. ఉద్యోగ భద్రత కరువైంది. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నిస్సహాయ స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పత్రికా యాజమాన్యాలు వీరిని పట్టించుకోకపోగా, చాలీచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తుంటే, తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ విషయంలో జర్నలిస్టులను విస్మరించాయి. ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి కీలకమైన విషయాల్లో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోంది. బీహార్‌లో పెరిగిన పెన్షన్…తాజాగా…

Read More

ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ – వధూవరులే ఉండని ఫేక్ మ్యారేజెస్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లంటే పంతులు లేని… పీటలు లేని… పన్నీరు చిలకరించని పసందైన విందు అని ఈ తరం యువత కొత్త భాష్యం చెబుతోంది. బంధువుల చుట్టూ తిరగడం… వారి యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం… వధూవరుల మొహాలు చూడటం వంటివేవీ లేకుండా కేవలం రుచికరమైన భోజనం, మ్యూజిక్, డాన్స్ మాత్రమే కావాలనుకునే వారి కోసం ఉత్తుత్తి పెళ్లిళ్ల కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ వింత పార్టీలలో వధూవరులే ఉండరు! అవును మీరు విన్నది నిజమే. అసలు…

Read More

రాహుల్ కుల జ్ఞానోదయం – కాంగ్రెస్ నేత ఆత్మ విమర్శ వెనుక రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ:మూడోసారి కూడా అధికారం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి, దాని అధినేత రాహుల్ గాంధీకి ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. దేశంలో కులగణన జరగకపోవడం తన తప్పేనని, అది పార్టీ తప్పు కాదని రాహుల్ శుక్రవారం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పును ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కుల గణన ఆవశ్యకతపై వ్యాఖ్యలు…కుల గణన ఆవశ్యకతపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ… సమాజంలోని వివిధ వర్గాల…

Read More

ఎన్ఎంసీ స్కాన్… మెడికల్ స్కామ్ – తనిఖీల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల బండారం

సహనం వందే, హైదరాబాద్:ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతోంది. డబ్బుల కోసం కాలేజీలు పెట్టిన కొందరు బడా బాబులు నాసిరకం వైద్య విద్య అందిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప మరో ఆలోచన లేకపోవడంతో ఆయా కాలేజీలు కునారిల్లిపోతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించక… బోధన సిబ్బంది పూర్తిస్థాయిలో లేక వైద్య విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కాలేజీల్లో ఉండాల్సిన సంఖ్యలో…

Read More

మోడీ గుండెల్లో ధన్‌ఖడ్‌ దడ -నరేంద్రుడికి ఉపరాష్ట్రపతి ఝలక్

సహనం వందే, న్యూఢిల్లీ:ఎవరి మాటా వినని… తన మాటే శాసనం అన్న తీరుగా దేశ రాజకీయాలను శాసిస్తున్న నరేంద్ర మోడీ శకానికి తెరపడుతోందా? ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం వెనుక ప్రధాని మోడీతో పెరిగిన విభేదాలే కారణమని స్పష్టమవుతోంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వివాదం పతాక స్థాయికి చేరడం, మోడీ అవిశ్వాస హెచ్చరికలకు ధన్‌ఖడ్‌ రాజీనామాతోనే బదులివ్వడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మోడీ నాయకత్వానికి ధన్‌ఖడ్‌ ఉదంతం బ్లడ్‌ ఆన్‌…

Read More

డాక్టర్ల ఫేక్(స్) రికగ్నేషన్ – మెడికల్ కాలేజీలకు కొత్త సమస్య

సహనం వందే, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చెబుతోంది. అయితే ఈ చర్యలను ఛేదించే విధంగా కొన్ని కంపెనీలు కొత్త యాప్‌లతో ముందుకొచ్చాయి. ఇంటి నుంచే ముఖ గుర్తింపు ద్వారా హాజరు వేసుకునే సౌలభ్యాన్ని కేవలం రూ.7000కే అందిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొటనవేలు నుంచి ముఖ గుర్తింపు వరకువైద్య కళాశాలల్లో అధ్యాపకుల హాజరు కోసం గతంలో…

Read More

ముంచి ముంచి కొడతాం..బీజేపీ ఎంపీకి రాజ్ థాకరే స్ట్రాంగ్ వార్నింగ్

సహనం వందే, ముంబై: మరాఠీ మాట్లాడే వారిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మరాఠీ ప్రజలపై దాడులు చేస్తామంటూ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే తీవ్రంగా స్పందించారు. దూబే మరాఠీ సమాజాన్ని అగౌరవపరిచారని ఆయన మండిపడ్డారు. తమను రెచ్చగొడితే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. ‘ఎక్కడికి వెళ్లినా మరాఠీ మాట్లాడండి’మరాఠీ ప్రజలను మేమిక్కడ పటక్ పటక్ కే…

Read More

కుసుమ్ రాణి: ఢిల్లీ డ్రగ్ కోటకు మహా’రాణి’

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సుల్తాన్‌పురి గల్లీల్లో దాగిన ఓ రహస్య మాదకద్రవ్యాల సామ్రాజ్యం గుట్టు రట్టయింది. 52 ఏళ్ల కుసుమ్ రాణి అనే మహిళ హెరాయిన్ అక్రమ రవాణాను నడిపిన ఈ భారీ వ్యవస్థను పోలీసులు ఛేదించారు. ఆమె తెలివితేటలు, గూఢచర్య పద్ధతులు, గండికోటలా మార్చిన ఇల్లు పోలీసులను సైతం విస్మయపరిచాయి. మార్చిలో ఆమె కొడుకు అమిత్ అరెస్టు తర్వాత కుసుమ్ పరారీ కాగా, దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన ఆమె ఆస్తులను పోలీసులు…

Read More

విదేశీ ఎంబీబీఎస్ …దేశీ పరీక్ష ఫెయిల్…డాక్టర్ల ప్రైవేట్ దందా

సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతారు… కొన్ని దేశాల్లో ఎంబీబీఎస్ నే ఎండీ అంటారు. అలా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ డాక్టర్లుగా చలామణి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇటువంటి వారిని డాక్టర్లుగా నియమించుకుంటున్నాయి. నెలకు పాతిక వేలు జీతం ఇస్తే చాలని విదేశీ ఎంబీబీఎస్ అభ్యర్థులు భావిస్తుండటంతో, తక్కువ వేతనాలతోనే ఆసుపత్రులు…

Read More

శుభాంశు శుక్లా : అంతరిక్షంలో హెయిర్ కటింగ్

సహనం వందే, ఫ్లోరిడా:భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నేతృత్వంలోని బృందం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60 శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన ఈ బృందం… 18 రోజుల్లో దాదాపు 1.22 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి, 288 భూ ప్రదక్షిణలు పూర్తి చేసింది. శుభాంశు ఒక్కరే ఇస్రో…

Read More