నేను యోగిని… పొలిటిషియన్ కాదు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం సహనం వందే, లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు…

Read More

14 అంకెల సంఖ్యతో ఆరోగ్య ఖాతా

  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో విప్లవాత్మక మార్పులు – కాగిత రహిత ఆరోగ్య సంరక్షణకు నాంది సహనం వందే, ఢిల్లీ: భారతదేశ ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. ఈ మేరకు 14 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ప్రభుత్వం అందుబాటులోకి…

Read More

ఢిల్లీ బీసీ గర్జనకు రాహుల్ గాంధీ

   రేపు ఢిల్లీలో బీసీల మహాధర్నా – 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం – తెలంగాణ నుంచి చారిత్రక పోరాటం సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం నిర్వహించే బీసీల మహాగర్జనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మహా ధర్నాకు రాహుల్ గాంధీ హాజరవడం దానికి రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర…

Read More

అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు…

   వాటిని 153కి పెంచాలి… పార్లమెంటు స్థానాలను యథాతథంగా కొనసాగించాలి – కేంద్రానికి విన్నవిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం – పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర అభ్యంతరం – దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ – కేంద్ర ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని హెచ్చరిక సహనం వందే, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను యధాతధంగా ఉంచాలని… అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు…

Read More

మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన సహనం వందే, చెన్నై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ…

Read More

సంతోషానికి సంకెళ్లు

  కులం, మతం, అవినీతి, ఆర్థిక అసమానతలే అడ్డంకులు – ఒక శాతం ధనవంతుల చేతుల్లో 58 శాతం సంపద – సంతోష కొలమానాలను చేరుకోలేకపోతున్న భారతదేశం – ప్రపంచ సంతోష సూచికలో 118వ దేశంగా భారత్ – పాకిస్తాన్, నేపాల్ దేశాల కంటే మనమే మరింత వెనుకబాటు సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో సంతోషం కరువైంది. హాయిగా బతకడానికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోతుంది. కుల, మతాల కల్లోలాలు, సామాజిక-ఆర్థిక అసమానతలు భారతదేశాన్ని సంతోష సూచికలో…

Read More

రెండు భాషలు చాలు: స్టాలిన్

– తమిళనాడులో తమిళం, ఇంగ్లీషే అధికార భాషలని స్పష్టీకరణ సహనం వందే, చెన్నై: “తమిళనాడుకు రెండు భాషలే చాలు” అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండించిన ఆయన, తమ రాష్ట్రం ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తమిళ సంస్కృతి, భాషా హక్కులను కాపాడేందుకు త్వరలో కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. ద్విభాషా విధానమే కొనసాగుతుంది… శాసనసభలో భాషా విధానంపై జరిగిన చర్చలో స్టాలిన్…

Read More

అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే

– మహిళల ‘ఛాతీని పట్టుకోవడం రేప్ కాద’న్న తీర్పు అమానవీయమంటూ వ్యాఖ్య సహనం వందే, ఢిల్లీ: మహిళల ఛాతీని పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “నాలుగు నెలలు ఆలోచించి వెలువరించిన…

Read More

డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం

– లక్షల సిమ్‌లు, వాట్సప్ ఖాతాలు నిషేధం – పార్లమెంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు, 3,962 స్కైప్ గుర్తింపులు, 83,668 వాట్సప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో తెలిపారు. సైబర్ నేరస్థుల చేతుల్లోకి డబ్బు చేరకుండా నిరోధించేందుకు…

Read More

జస్టిస్ వర్మ తీర్పులపై అనుమానాలు

– న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సవాల్ – కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో తీర్పు వర్మదే సహనం వందే, ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు లభ్యం కావడం, ఆయన గత తీర్పులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో నూతన సందేహాలను రేకెత్తిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు ఇప్పటికే వర్మ తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, దేశవ్యాప్తంగా మరిన్ని కీలక కేసుల…

Read More