మతం ముసుగులో మారణహోమం

సహనం వందే, జమ్ము కాశ్మీర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు… వారి మతం తెలుసుకొని మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు మరింత కలచి వేస్తున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు… మతోన్మాదం విషం ఎంతగా పాతుకుపోయిందో చెప్పే భయానక సత్యం. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ లౌకికవాద స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. మతాల మధ్య గొడవలు చెలరేగేలా……

Read More

అదానీ గ్రూప్ ‘ఆపరేషన్ జెప్పెలిన్’

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై 2023లో హిండెన్‌బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ…

Read More

మహారాష్ట్రలో హిందీకి బ్రేక్

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…

Read More

హిందువులే లక్ష్యంగా రక్తపుటేరు

సహనం వందే, జమ్ము కాశ్మీర్‌: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూమతమే లక్ష్యంగా ఆ మత ప్రజలను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్ రక్తంతో తడిసిపోయింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ ప్రశాంతమైన లోయలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్‌ రంజన్‌తో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. 2019లో పుల్వామాలో జరిగిన…

Read More

‘రక్త’ సంబంధాలు

సహనం వందే, క్రైమ్ బ్యూరో, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. నేటి సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు మరింత ఊతమిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ.. తమ వికృత చేష్టలకు చట్టపరమైన అనుమతి లభించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వివాహ బంధాలు తెగిపోతున్నాయి. రక్తపుటేరులు పారుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో…భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. జన్మజన్మల…

Read More

‘న్యాయమూర్తికి అంత హక్కుందా?’

సహనం వందే, ఢిల్లీదేశంలో న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక పాత వీడియోను తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యాచారాల విచారణ కోసం ఏర్పాటు చేసిన షా కమిషన్‌ను తప్పుబడుతున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న…

Read More

పొలిటికల్ ‘జనరేషన్ Z’

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. మరీ ముఖ్యంగా 1997-2012 మధ్య జన్మించిన ‘జనరేషన్ జెడ్’ జీవితాల్లో ఇది ఒక అంతర్భాగమైపోయింది. ఈ తరం రాజకీయంగా అత్యంత అవగాహన కలిగినదిగా పేరు తెచ్చుకుంది. ఆన్‌లైన్ రాజకీయ చర్చల్లో వీరు మునిగిపోతున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలు జనరేషన్ జెడ్ యువతకు రాజకీయాలపై జ్ఞానాన్ని అందిస్తున్నాయని అధ్యయన నివేదిక తెలుపుతుంది. ఎక్కడ ఏం జరిగినా…

Read More

హిందీ వర్సెస్ మరాఠీ వర్సెస్ కన్నడ

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. హిందీకి వ్యతిరేకంగా రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే వంటి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. హిందీని తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటం చేసేందుకు రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరేలు సంసిద్ధత వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం భాషాభిమానమా? లేక రాజకీయ ఎత్తుగడా? మరాఠీ ఓట్ల ఏకీకరణకు అవకాశం? కేంద్ర…

Read More

భారతీయ విద్యార్థులే బలిపశువులా?

సహనం వందే, వాషింగ్టన్: ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం మాత్రం భారతీయ విద్యార్థులను గెంటేస్తుంది. అమెరికా టారిఫ్ లపై అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. చైనా వంటి దేశాలు బహిరంగంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంటే… మనం మాత్రం సమర్థిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం చైనా విద్యార్థులకు అనుకూలంగా… మనవాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం ఎఫ్-1 వీసాలను రద్దు చేసే కార్యక్రమం…

Read More

‘ముంబై మరాఠీల అడ్డా’

సహనం వందే, ముంబై: ‘ముంబై మరాఠీల అడ్డా. ఇక్కడ ఉంటూ మమ్మల్ని అవమానిస్తే సహించం’ అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించింది. ముంబైలో మరాఠీలపై గుజరాతీల ఆగడాలపై మండిపడింది. మహారాష్ట్రలో మరోసారి ప్రాంతీయ వివాదం తలెత్తింది. ఘాట్కోపర్‌లోని శ్రీ సంభవ్ దర్శన్ సొసైటీలో మాంసాహారం తినే మరాఠీ కుటుంబాలను శుక్రవారం గుజరాతీలు దూషించడం తీవ్ర వివాదానికి దారితీసింది. మరాఠీలను అవమానించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గుజరాతీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ ఘటన రాజకీయ…

Read More