‘సుప్రీం’పై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా… దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. ఈ చేదు నిజాన్ని చాటిచెప్పేలా ఇటీవలి కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఇది కేవలం సామాన్యుల సమస్య కాదని, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ కులం పేరుతో అవమానాలు తప్పడం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. భారత సమాజంలో కుల వివక్ష ఎంత…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More

మ్యాచ్ టాప్… మ్యాథ్స్ వీక్

సహనం వందే, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, కొన్నేళ్ల క్రితం నాటి విరాట్ కోహ్లీ పదో తరగతి మార్కుల జాబితా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మార్కుల జాబితాను ఐఏఎస్ అధికారి జితిన్ యాదవ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మార్కుల జాబితాలో…

Read More

ట్రంప్‌పై కంగనా ఫైర్

సోషల్ మీడియాలో పోస్ట్… తొలగింపు సహనం వందే, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చేసిన సోషల్ మీడియా పోస్ట్ గురువారం రాత్రి హఠాత్తుగా మాయమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఫోన్ కాల్ తర్వాతే ఆమె ఈ పోస్ట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. ట్రంప్‌పై కంగనా చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించడంతో, నడ్డా స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కంగనా పోస్ట్‌లో ఏముంది?కంగనా రనౌత్ తన…

Read More

‘మరాఠీ మాట్లాడితేనే డబ్బులు ఇస్తాం’

సహనం వందే, ముంబై: ముంబైలోని భాండుప్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన భాషా అభిమానానికి అద్దం పడుతోంది. సాయి రాధే అపార్ట్‌మెంట్‌లో ఒక జంట, తమ ఇంటికి పిజ్జా డెలివరీ చేసిన వ్యక్తి మరాఠీ మాట్లాడలేదనే కారణంతో డబ్బులు చెల్లించడానికి నిరాకరించారు. హిందీ మాట్లాడకూడదని వాళ్ళు హుకుం జారీ చేశారు. ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నీకు మరాఠీ రాదు.. డబ్బులు ఇవ్వం!’డొమినోస్ డెలివరీ ఏజెంట్ రోహిత్ లవారే పిజ్జా ఆర్డర్‌తో వెళ్లినప్పుడు,…

Read More

సోఫియాపై బీజేపీ మంత్రి మత వ్యాఖ్యలు

కాంగ్రెస్ భగ్గు… దేశవ్యాప్తంగా ఆగ్రహం! సహనం వందే, ఢిల్లీ: భారత సైన్యానికి గర్వకారణమైన మహిళా అధికారి, కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా చేసిన నీచమైన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేశాయి. ఆపరేషన్ సింధూర్ పత్రికా సమావేశంలో సోఫియా ఖురేషీని ఉద్దేశించి విజయ్ షా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విజయ్ షాను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వివాదం సోషల్ మీడియాలో…

Read More

పాక్‌కు వేల కోట్ల ఐఎంఎఫ్ రుణం

సహనం వందే, హైదరాబాద్: భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, సరిహద్దుల్లో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధమవడం విమర్శలకు దారితీస్తోంది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం రుణాన్ని మంజూరు చేసింది. ఆర్థిక స్థిరత్వమే ప్రధాన కర్తవ్యం…ఐఎంఎఫ్ అనేది 191 దేశాలు సభ్యులుగా ఉన్న ఒక…

Read More

పాకిస్తాన్ కాదు మోసగిస్తాన్

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, భారత సైన్యం తగిన రీతిలో స్పందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్నం అంగీకారం… సాయంత్రం ఉల్లంఘనవిక్రమ్ మిస్రీ తెలిపిన వివరాల ప్రకారం… శనివారం…

Read More

ఆపరేషన్ ‘సినీ’దూర్

సహనం వందే, హైదరాబాద్: ఆయన ఒకానొక పెద్ద సినిమా స్టార్… అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. చిటికేస్తే అభిమానులు తరలివస్తారు. తన కోసం ప్రాణం ఇస్తారు. అలాంటి స్టార్ మన దేశ సైన్యానికి మద్దతు కోసం ర్యాలీ నిర్వహించాలని ఒక ప్రముఖ వ్యక్తి కోరగా, డబ్బులు ఇస్తే చేస్తానని అన్నాడట. ఇంతకంటే నీచత్వం ఇంకేమైనా ఉంటుందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా సినిమా విడుదలవుతుందంటే చాలు, వేల మంది అభిమానులను తరలించి ప్రచార హోరు సృష్టిస్తారు….

Read More