తాగుబోతు కార్లు రోడ్లపై తూలు – వాహనాలకు మందు… రోడ్లపై చిందు
సహనం వందే, హైదరాబాద్: పెట్రోలు బంకుల్లో ఇకపై వాహనాలకు మందు పార్టీ జరగబోతోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ట్యాంకు ఫుల్ చేస్తే కారు తూలుతుందో లేదో తెలియదు కానీ మీ జేబుకు మాత్రం ఉపశమనం లభిస్తుంది. అరబ్ దేశాల యుద్ధాల మధ్య భారత్ తన సొంత దారిని వెతుక్కుంటూ మద్యం వైపు అడుగులేస్తోంది. కారుకు మత్తు కిక్కుభారత ప్రభుత్వం త్వరలోనే ఈ85 ఇంధనాన్ని తీసుకురాబోతోంది. ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోలు…