డాక్టర్ల డిమాండ్లపై కి’రణ్’ మాదల – వైద్య ఆరోగ్యశాఖ తీరుపై మండిపాటు
సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లు తమ డిమాండ్లపై రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. బకాయిల కోసం విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వైద్యుల గోడును పట్టించుకోని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందని ఎరియర్స్తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. యూజీసీ పీఆర్సీ బకాయిలు 2016 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం 2024లో జీవో…