Doctors met CM

ముఖ్యమంత్రికి డాక్టర్ల మొర – వైద్యుల సమస్యలు పరిష్కరించాలని విన్నపం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి మొరప్రభుత్వ వైద్యుల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అప్రమత్తమైంది….

Read More
Venezuela President Madura

ట్రంప్ హంటింగ్… గ్లోబల్ షాకింగ్ – అధునాతన టెక్నాలజీతో అధ్యక్షుడి అంతం

సహనం వందే, హైదరాబాద్: ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం అంటే అది కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకున్నారంతా. కానీ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా రాజధాని కరాకాస్‌లో జరిగిన ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాలు ఎలా జొరబడ్డాయి? వేల సంఖ్యలో ఉన్న వెనిజులా సైన్యం ఏమైంది? మదురో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అత్యంత…

Read More
Haridwar

హిందువులకే హరి’ద్వారం – హరిద్వార్ లో అన్యమతస్థులపై ఆంక్షలు

సహనం వందే, ఉత్తరాఖండ్: హరిద్వార్ అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. గంగా నది తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోకి అన్యమతస్థులు రాకుండా ఆంక్షలు విధించనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ధార్మిక సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. పవిత్రత కోసం సాహసంహరిద్వార్ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది….

Read More
Psychiatrist shortage

పిచ్చోడంటారు… పట్టించుకోరు – 85 శాతం మందికి అందని మానసిక వైద్యం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో మానసిక సమస్యలు ముదురుతున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది ఒత్తిడి, ఆందోళనలతో నలిగిపోతున్నారు. అయితే వీరికి వైద్యం అందించే వ్యవస్థ మాత్రం కుంటుపడుతోంది. చికిత్స పొందాల్సిన వారు కొండంత ఉంటే… సాయం చేసే చేతులు గోరంతే ఉన్నాయి. ఈ అంతరం భయంకరమైన పరిణామాలకు దారితీస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సమాజం మానసిక కుంగుబాటులోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది. చికిత్సలో భారీ అంతరం…భారతదేశంలో మానసిక వైద్యం అందని ద్రాక్షలా మారింది….

Read More
Venezuela President Maduro

వెనిజులా దేశాధ్యక్షుడి కోట బద్దలు – అర్ధరాత్రి ఇంట్లోకి జొరబడిన అమెరికా ఫోర్స్

సహనం వందే, వెనిజులా: అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. వెనిజులా దేశంపై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా పట్టుకుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఆపరేషన్ తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా చేస్తున్న ఈ సాహసం చమురు రాజకీయం వైపు మలుపు తిరుగుతోంది. అర్ధరాత్రి ఆపరేషన్ తో విలవిలశనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ దేశ రాజధాని…

Read More
Revanth serious action on Oilpalm company Lohiya

రేవంత్ మార్క్… అదిరిపోయే స్ట్రోక్ – ఆయిల్ పామ్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు పెంచకుండా కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. ఇలాంటి సంస్థల పట్ల ఉదాసీనత పనికిరాదని భావించిన సర్కారు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. సాగులో పురోగతి చూపని కంపెనీల జోన్లను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

Read More
Poor People Houses

గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు

సహనం వందే, న్యూఢిల్లీ: అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి. రెట్టింపైన విధ్వంసం…గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో…

Read More
D Vitamin deficiency Dengue severe

డీ-లోపం… డెంగీ తీవ్రం – ఐసీఎంఆర్ పరిశోధనలో తేలిన చేదు నిజం

సహనం వందే, హైదరాబాద్: దోమ కాటుతో వచ్చే డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. కొందరిలో సాధారణ జ్వరంగా తగ్గిపోతుంటే మరికొందరిలో ఎందుకు తీవ్రమవుతోంది అన్నది మిస్టరీగా మారింది. దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో విటమిన్ డీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయన నివేదిక విస్తుపోయే అంశాలను వెల్లడించింది. ఆ నివేదికపై గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ‘సహనం వందే’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది….

Read More
Shravan Kumar Shankh Air Tempo Driver to Flight Owner

టెంపో డ్రైవరే విమాన ఓనర్ – 35 ఏళ్ల శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఘనత

సహనం వందే, కాన్పూర్: నిన్నటి వరకు ఆయన చేతులు టెంపో స్టీరింగ్‌ను తిప్పాయి. నిత్యం రద్దీగా ఉండే కాన్పూర్ గల్లీల్లో వస్తువులను గమ్యస్థానాలకు చేర్చడమే ఆయన దినచర్య. కానీ ఆ చేతులే ఇప్పుడు విమాన రెక్కలకు ఊపిరి పోస్తున్నాయి. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి గగన విహారానికి బాటలు వేసిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ విజయగాథ ప్రతి సామాన్యుడికి ఒక స్ఫూర్తి పాఠం. టెంపో స్టీరింగ్ నుంచి విమానం దాకా శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ప్రయాణం అత్యంత…

Read More
Romila Thapar Speaking of History

చరిత్ర అంటే వాట్సాప్ కాదు – ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ కామెంట్

సహనం వందే, న్యూఢిల్లీ: చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాల కథలు మాత్రమే కాదు. అది మన వర్తమానాన్ని ప్రభావితం చేసే ఒక జీవన రికార్డు. కానీ దురదృష్టవశాత్తు నేడు చరిత్రను కట్టుకథలతో పోలుస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, రచయిత నమిత్ అరోరాతో కలిసి నిజమైన చరిత్ర ప్రాముఖ్యతను లోకానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాల ముప్పు…నేటి కాలంలో చాలా మందికి చరిత్ర పుస్తకాల్లో దొరకడం లేదు. సెల్…

Read More