‘గడల’పై ఏసీబీ ఉచ్చు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడిగా పనిచేసిన డాక్టర్ గడల శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా విపత్కర సమయంలో, అంతకుముందు కాలంలో ఆయన కోట్ల రూపాయలను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక ఫిర్యాదులతో పాటు ఇటీవల కొందరు ఉద్యోగులు అందించిన పక్కా సమాచారం ఆధారంగా ఏసీబీ తన విచారణను…

Read More

జపాన్‌ను అధిగమించిన భారత్

సహనం వందే, ఢిల్లీ: భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం జరిగిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని సుబ్రమణ్యం తెలిపారు. ‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక…

Read More

అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్…

Read More

మావోయిస్టు నేతకు విషమిచ్చి చంపారా?

నంబాల ఎన్‌కౌంటర్… అనుమానాలు, ఆరోపణలు సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) మరణంపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతుండగా, పౌరహక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం విషమిచ్చి చంపారనో లేక ఎక్కడో కాల్చి చంపి అడవుల్లో పడేశారనో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల మృతదేహాన్ని అప్పగించడంలో పోలీసుల నిరాకరణ, రీ-పోస్టుమార్టం భయం చుట్టూ అలుముకున్న రహస్యాలు…

Read More

పవన్ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ గౌరవం, మర్యాదలను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే, వారు మాత్రం నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఈ రిటర్న్ గిఫ్ట్‌ను (థియేటర్ల బంద్) స్వీకరిస్తానని ఆయన హెచ్చరించారు. టాలీవుడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా సినీ పెద్దలు కనీసం ముఖ్యమంత్రిని కలవలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్…

Read More

దానం ముసుగులో దగా

సహనం వందే, హైదరాబాద్: ‘ఒక బిలియనీర్ దానం చేస్తున్నాడంటే, కమ్యూనిజం మీ బుర్రకెక్కలేదని అర్థం’- కారల్ మార్క్స్ అన్న ఈ మాటలు నేటి బిలియనీర్ల దానాల వెనుక దాగి ఉన్న నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు తమ సంపదలో కొంత భాగాన్ని దానం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మార్క్స్ దృష్టితో చూస్తే ఈ దానాల వెనుక స్వచ్ఛమైన ఉద్దేశాలు కాకుండా, తమ సామ్రాజ్యాలను కాపాడుకునే కుట్రలు, పన్నులు ఎగ్గొట్టే దిక్కుమాలిన ఎత్తుగడలు…

Read More

…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ…

Read More

జడ్జి ఆదర్శం… నేతల ధిక్కారం

సహనం వందే, హైదరాబాద్: వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ ఘటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదర్శవంతంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంచిన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసినట్లు మంత్రి చెప్పారు. కానీ గాంధీ, ఉస్మానియా లాంటి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు అంతంత మాత్రంగానే సేవలు ఇస్తుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్,…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More