Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More
Apple Opposes SancharSathi

యాపిల్‌ డోంట్ కేర్ – సంచార్ సాథీ యాప్ షరతుల తిరస్కరణ

సహనం వందే, హైదరాబాద్: సంచార్ సాథీ ప్రీఇన్‌స్టాలేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రీ ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ యాప్ ఆప్షన్ మాత్రమేనని వెల్లడించింది. అయినప్పటికీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఈ యాప్ విషయంలో యాపిల్‌ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ తయారీదారులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది….

Read More
Amar Subrahmanyam Apple AI Vice President

యాపిల్ కు ఇండియన్ చికిత్స – వైస్ ప్రెసిడెంట్ గా బెంగళూరు సుబ్రహ్మణ్యం

సహనం వందే, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో మేధావుల కోసం జరుగుతున్న టాలెంట్ వార్ తారస్థాయికి చేరింది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు షాకిస్తూ‌… యాపిల్ ఒక కీలక అడుగు వేసింది. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేసి… తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమర్ సుబ్రమణ్యాన్ని యాపిల్‌ ఏఐకి కొత్త వైస్ ప్రెసిడెంటుగా నియమించుకుంది. ఏఐ రేసులో వెనుకబడిన యాపిల్‌ను ముందుకు తీసుకెళ్లడమే సుబ్రహ్మణ్య ముందున్న అతిపెద్ద సవాల్….

Read More
Acid Attack at Warangal

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

సహనం వందే, వరంగల్:నర్సింగ్ విద్యార్థినిపై మంగళవారం ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. హనుమకొండలోని కాలేజీ నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఆమెపై హెల్మెట్లు ధరించిన దుండగులు యాసిడ్ చల్లారు. ఈ దాడిలో విద్యార్థినికి నడుము, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఎన్డీటీవీ సోర్స్: https://www.ndtv.com/india-news/telangana-nursing-student-attacked-with-chemical-substance-suffers-injuries-9734317

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Health Insurance Claim rejected

లక్షల బిల్లు… బీమాకు చిల్లు – హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం

సహనం వందే, హైదరాబాద్: ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది….

Read More
Sexual Content Hacking

బెడ్‌రూమ్స్ హ్యాకింగ్ – ఇళ్లల్లో అమర్చుకున్న కెమెరాల హైజాక్

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఓ భయంకరమైన సైబర్ నేరం వెలుగు చూసింది. తమ ఇళ్లలో, ఆఫీసుల్లో భద్రత కోసం అమర్చుకున్న లక్షా 20 వేలకు పైగా ఐపీ కెమెరాలు హ్యాకింగ్ అయ్యాయి. సీసీటీవీకి ప్రత్యామ్నాయంగా చవకగా దొరికే ఈ హోమ్ కెమెరాలను అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు ప్రజల వ్యక్తిగత జీవితాలను రికార్డ్ చేశారు. లైంగికపరమైన కంటెంట్‌ను దొంగిలించి వాటిని అమ్ముకుంటూ డబ్బు దండుకున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న వ్యాయామ సెంటర్లు, గైనకాలజిస్ట్…

Read More
CAS Twist

10 ఏళ్ల రూల్‌కు డీఎంఈ గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్:కంటిన్యూయస్ అకడమిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలుపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల కోరిక మేరకు డీఎంఈ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ నిబంధన విషయంలో 2006 నవంబర్ ప్రామాణికంగా తీసుకుని అప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏసీఆర్‌ల విషయంలో క్లారిటీ…ఇప్పటికే…

Read More
Sky Walk inn Vizag

దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన -కైలాసగిరి పర్వత శిఖరంపై అద్భుత నిర్మాణం

సహనం వందే, విశాఖపట్నం: భారతదేశంలోనే అతి పొడవైన గాజు ఆకాశ వంతెన (గ్లాస్ స్కైవాక్) ఇప్పుడు సాగర తీరం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరి పర్వత శిఖరంపై రెండు కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 120 మీటర్ల పొడవున్న ఈ గాజు వంతెన కింద నీలి సముద్రం కనిపిస్తుంటే సందర్శకులకు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతోంది. సాహసాలను, అద్భుతమైన దృశ్యాలను కోరుకునే యువతకు ఇది ఓ కొత్త గమ్యస్థానం….

Read More
Lead Actors

హీరో కాదు లీడ్ యాక్టర్ – సినీనటులను హీరోలని పిలవకూడదు

సహనం వందే, పల్నాడు:సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు లేదా అన్నం పెట్టే రైతుల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే…

Read More