మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ – రాజకీయ రంగ ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 35 ఏళ్ల అసదుద్దీన్ గతంలో హైదరాబాద్ కోల్ట్స్, గోవా వంటి జట్లకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుండి అపారమైన స్ఫూర్తి పొందినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పట్ల, పార్టీ విలువల పట్ల కనబరుస్తున్న నిబద్ధత తనను ఎంతగానో…

Read More

జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

సహనం వందే, హైదరాబాద్:అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం…

Read More

గుడ్డు గోల్‌మాల్‌ – మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో డ్రామా

సహనం వందే, హైదరాబాద్:మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న గుడ్డు గోల్‌మాల్‌ షాక్‌కు గురిచేస్తోంది. పాత కాంట్రాక్టర్లకే గుడ్ల సరఫరా కట్టబెడుతూ, కొత్త టెండర్ల ఎంపికలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు 36 కోట్లకు పైగా కోడిగుడ్ల సరఫరా కోసం ఏటా టెండర్లు జారీ చేయాలి. కానీ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన టెండర్లు పాత కాంట్రాక్టర్ల కోసమే అన్నట్లుగా నిబంధనలు వచ్చాయి. దీనిపై పౌల్ట్రీ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా,…

Read More

మహావీర్ మెడికల్ కాలేజ్ మహా డ్రామా..నకిలీ రోగికి రూ. 2 వేలు

సహనం వందే, హైదరాబాద్:వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సోమవారం ప్రారంభం కావాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలకు బ్రేక్ పడింది. సహనం వందే, ఆర్టికల్ టుడే డిజిటల్ పేపర్లలో వచ్చిన కథనాలతో ఎన్ఎంసీ అధికారులు వెనక్కి తగ్గారు. ముందస్తు సమాచారం ఇచ్చి మహావీర్ మెడికల్ కాలేజీకి తనిఖీలకు వస్తున్నారని సహనం వందే, ఆర్టికల్ టుడే లు (sahanamvande.com & articletoday.in) ప్రచురించడం సంచలనం అయ్యింది. ఈ విషయం ఎన్ఎంసీ చైర్మన్ దృష్టికి కూడా…

Read More

అదృశ్యమై దశాబ్దం.. జాడలేని మలేషియా ఎయిర్‌లైన్స్

సహనం వందే, హైదరాబాద్:2014 మార్చి 8న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌… సరిగ్గా అర్ధరాత్రి 12:41 గంటలకు బోయింగ్ 777-200 మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం చైనా రాజధాని బీజింగ్‌ వైపునకు బయలుదేరింది. అందులో 239 మంది ప్రయాణిస్తున్నారు. బయలుదేరిన గంట తర్వాత విమానం అకస్మాత్తుగా రాడార్‌లో కనిపించకుండా పోయింది. చివరిసారి ‘గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో’ అని విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రానికి సమాచారం ఇచ్చిన తర్వాత గల్లంతైంది. ఆ తర్వాత విమానం…

Read More

సెక్యులరిజం నయా ట్రెండ్ – మతాలకు గుడ్ బై చెబుతున్న కోట్లమంది

సహనం వందే, ఢిల్లీ: ప్రపంచంలో సెక్యులరిజం పెరుగుతుంది. వివిధ మతాల నుంచి కోట్ల మంది బయటకు వస్తున్నారు. అలాగేఅమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అనేకమంది సెక్యులరిస్టులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవుల జనాభా 230 కోట్లు, ఇస్లాం మతస్తుల జనాభా 200 కోట్లు… ఆ తర్వాత మూడో వర్గం ఏ మతానికీ చెందని వారు 147 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత 120 కోట్ల మంది హిందూ మతస్తులు ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్…

Read More

మహావీర్ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ లీకులు

సహనం వందే, హైదరాబాద్: వికారాబాద్ లోని మహావీర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ రెండు రోజుల ప్రత్యేక డ్రామాకు తెరలేపింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బృందాల తనిఖీలు గురు, శుక్రవారాల్లో జరుగుతాయని మేనేజ్మెంట్ కు సమాచారం అందింది. ఆకస్మికంగా జరగాల్సిన తనిఖీలు ముందస్తు లీకు కావడం గమనార్హం. దీంతో యాజమాన్యం మహా యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది. ఎక్కడెక్కడో ఉన్న వివిధ విభాగాల అధిపతులు తక్షణమే కాలేజీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వారంతా కేవలం…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో… చిన్న తిమింగలం 200 కోట్లు మింగేస్తే..

సహనం వందే, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల కలలను ఆశలతో నింపి కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర జీవనాడిగా చిత్రీకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, దానిని అవినీతి యంత్రంగా మార్చి ముంచింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ వద్ద రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో బంగారం, నగదు, విలాసవంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ,…

Read More

రెండు ఫ్లాట్లు… నిండా నోట్లు – కరోనా తీసుకొచ్చిన అదృష్టం

సహనం వందే, హైదరాబాద్: డాక్టర్ శ్రీహరిరావు (పేరు మార్చాం)… కరోనా కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో కీలక పోస్టులో పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపై ఆయన కంట్రోల్ ఉండేది. అప్పటి ప్రభుత్వం కూడా ఎనలేని ప్రాధాన్యం కల్పించింది. ఆయన స్థాయికి మించి బాధ్యతలు అప్పగించింది. వ్యాక్సిన్లు మొదలుకొని అన్నింటిపైనా అజమాయిషీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనా ఆయన పాలిట ధనలక్ష్మి అయ్యింది. ఆసుపత్రుల్లో శవాలు లేస్తుంటే… ఆ మాజీ వైద్యాధికారి ఇంట కరెన్సీ నోట్లు…

Read More