Foot Ball Messi

అరుదైన వ్యాధితో మెస్సీ’ఫుట్‌బాల్’ – కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ ఆరాధ్య దైవం… లక్షలాది మంది అభిమానుల కలల వీరుడు లియోనెల్ మెస్సీ శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా అధికారులు ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వాణిజ్యపరమైనదిగా తెలుస్తోంది. కష్టాల కడలి దాటిన దిగ్గజం…ఫుట్‌బాల్ మైదానంలో తన మాయాజాలంతో ప్రపంచాన్ని…

Read More
Global Summit Hydraa Highlight

గ్లోబల్ సమ్మిట్… హైడ్రా హైలైట్ – గ్లోబల్ సమ్మిట్‌లో హైద‌రాబాద్ ముద్ర

సహనం వందే, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు హైడ్రా కార్యకలాపాలపై అమితాసక్తి చూపించారు. ముఖ్యంగా నగరంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ గురించి వారు ఆరా తీశారు. అలాగే వర్షాకాలంలో వరదల నివారణకు హైడ్రా తీసుకున్న పటిష్ట చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు, పర్యావరణవేత్తలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఆయన చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలిపారు. చెరువుల అభివృద్ధిపై…

Read More
Sania Mirza and with her' Son

టెన్నిస్ తూచ్… అమ్మతనమే అదుర్స్ – స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగం

సహనం వందే, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు జీవితంలోనూ విజేతగా నిలిచింది. అనేక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సానియా… కోర్టు బయట తన తల్లి అనుభవాలను పంచుకుంది. తన కొడుకు ఇజ్హాన్‌ను పెంచే క్రమంలో తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం… జీవితంలో సమతుల్యత (బ్యాలెన్స్) సాధించడమే అని ఆమె అంటున్నారు. టెన్నిస్‌లో గెలవడం మాత్రమే కాదు, జీవితపు మ్యాచ్ ప్లాన్‌లో విజయం సాధించాలంటే కుటుంబం, కెరీర్ మధ్య…

Read More
Eswara Chari Death

బీసీ బిడ్డ బలిదానం… రగులుతున్న తెలంగాణ

సహనం వందే, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ కన్నుమూయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను ఏకంగా 17 శాతానికి తగ్గించడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం తమను మోసం…

Read More
Girl Friend Movie on Netflix

గర్ల్‌ఫ్రెండ్ లో ఓయో రూమ్ – కాలేజీ లేడీస్ హాస్టల్‌ లో ప్రేమికుల రాసలీలలు

సహనం వందే, హైదరాబాద్: ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం ఈరోజు నుంచి (డిసెంబర్ 5) నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సినిమాలు కుటుంబ సభ్యులు కలిసి చూడాలా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశం. ఈ సినిమాకు విపరీతమైన హైప్ ఇచ్చి గొప్ప కళాఖండంగా డప్పు కొట్టుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. ఇందులో అభ్యుదయ భావాలతో చూపించిన ప్రత్యేకతలు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. పైగా టీనేజ్ పిల్లల మనసుల్లో విష భావాలు నింపేలా ఈ చిత్రం ఉందన్న విమర్శలు…

Read More
TS Outsourcing JAC

బతుకు కోసం బతుకు – ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల బానిసత్వం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న లక్షలాది మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నా వీరికి జీతాలు మాత్రం సకాలంలో అందడం లేదు. నెలలు గడుస్తున్నా వేతనం రాక ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించలేక అప్పుల బాధతో అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదనేందుకు, పాలనా యంత్రాంగం సరిగా పనిచేయడం లేదనేందుకు ఈ జీతాల జాప్యమే నిదర్శనం. ఈ సమస్యను…

Read More
Pawan Kalyan Comments on Telangana

దిష్టి కళ్ళపై అగ్నిజ్వాలలు – పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని నేతల డిమాండ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అంతేకాదు… ‘తెలంగాణ ప్రజల దిష్టి కాదు… ఆంధ్రా పాలకుల వల్లనే ఫ్లోరైడ్ విషం తాగారు’ అంటూ పవన్ వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టారు. ‘మంత్రి…

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Health Insurance Claim rejected

లక్షల బిల్లు… బీమాకు చిల్లు – హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల మాయాజాలం

సహనం వందే, హైదరాబాద్: ఆయన పేరు రఘునందన్… హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం రోజులపాటు ఉన్నందుకు,,,, ఆయనకు చికిత్స చేసినందుకు ఆ ఆసుపత్రి 8 లక్షల రూపాయలు బిల్లు వేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న ధీమాలో ఆ ఉద్యోగి ఉన్నాడు. బిల్లు చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి బీమా కంపెనీ కొర్రీలు పెట్టింది. మీరు చేయించుకున్న చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించదని బాంబు పేల్చింది….

Read More
CAS Twist

10 ఏళ్ల రూల్‌కు డీఎంఈ గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్:కంటిన్యూయస్ అకడమిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలుపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల కోరిక మేరకు డీఎంఈ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ నిబంధన విషయంలో 2006 నవంబర్ ప్రామాణికంగా తీసుకుని అప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏసీఆర్‌ల విషయంలో క్లారిటీ…ఇప్పటికే…

Read More