ఎవడైతే నాకేంటి?

సహనం వందే, హైదరాబాద్: ఆయన రాష్ట్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి. జిల్లా వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. ఆ అధికారికి నోటి దురుసు ఎక్కువ. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు వైద్యాధికారులు హైదరాబాదులోని ఆ కీలక అధికారిని కలిశారు. తమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వైఖరితో విసిగిపోయామని, ఆయన్ను తొలగించాలని… అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంగీకారం తెలుపుతూ లేఖ రాశారని తమ బాస్ కు…

Read More

రీ-రిలీజులే దిక్కా?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పుడు కొత్త కథలు, సృజనాత్మకతతో ప్రేక్షకులను అలరించేది. కానీ ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు మంచి సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. థియేటర్ల సంఖ్య, స్క్రీన్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, కొత్త సినిమాల కొరతతో బోరు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల పాత సినిమాలతో పాటు, సీనియర్ ఎన్టీఆర్ లాంటి లెజెండ్‌ల చిత్రాలైన మాయాబజార్ వంటివి…

Read More

ఆదిలాబాద్‌లో ఆగని జొన్న దందా

సహనం వందే, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జొన్న అక్రమ వ్యాపారం ఆగడం లేదు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా జొన్నలను తరలించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే దందా జోరుగా సాగుతోంది. తాజాగా సిరికొండ మండలంలో 350 క్వింటాళ్ల జొన్నలను అధికారులు సీజ్ చేయగా, ఈ అక్రమ వ్యాపారంలో ఓ నియోజకవర్గ స్థాయి నేత హస్తం ఉన్నట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడిన ఐచర్ వాహనాన్ని అధికారులు విడుదల చేయడం, కేసులు నమోదు చేసి చేతులు…

Read More

ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

’23’: తెరపై దళిత గాథ!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

Read More

బీఆర్ఎస్‌ చీలికకు హరీష్ బీజాలు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ స్థాయికి తీసుకొస్తే, తన సొంత మేనమామ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కూడా హరీష్ రావు వెనుకాడడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్‌ చీలికకు ఆయన బీజం వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేనట్టు చెబుతున్నారు. కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ అడుగులు మరోరకంగా ఉంటాయని హరీష్ రావు తన…

Read More

వ్యవసాయశాఖలో కోవర్ట్

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలుతీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటం వెనుక వ్యవసాయశాఖలోని ఒకరిద్దరి హస్తం ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పథకాల రూపకల్పన నుంచి అమలు వరకు జరుగుతున్న తప్పిదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో కొందరు కావాలనే చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా…

Read More