చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం – గురుకులలో ఫుడ్ పాయిజన్ తో 48 మంది చావడమా?

సహనం వందే, హైదరాబాద్:మనం నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా? ఏఐ కాలంలోనూ పేద విద్యార్థులను కాపాడుకునే స్థితిలో కూడా లేమా? ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్న గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి అనేకమంది విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో 886 ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగి 48 మంది బహుజన పేద విద్యార్థులు మరణించారంటే… ఇవి సాధారణ మరణాలు కావు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో జరిగిన హత్యలుగా…

Read More

డాక్టర్లా? బూచోళ్ళా? – ఆసుపత్రుల్లో శిశువులకు రక్షణ కరువు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆసుపత్రుల్లో పుట్టిన శిశువులకు అసలు రక్షణ ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఎత్తుకొచ్చిన శిశువును కొనుగోలు చేసి… సరోగసి ద్వారా పుట్టించామని ఆ బిడ్డను తల్లిదండ్రులకు విక్రయించిన డాక్టర్ నమ్రత వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలలో శిశువులను ఎత్తుకుచ్చే గ్యాంగ్ తో ఫెర్టిలిటీ సెంటర్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది….

Read More

‘సృష్టి’ వైద్యాధికారులపై చర్యలు? – తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు

సహనం వందే, హైదరాబాద్:‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. ఆ వ్యవహారం వెనక ఉన్న అధికారులు ఎవరో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వైద్యాధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ ‘సహనం వందే’ ప్రతినిధితో మాట్లాడుతూ… సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు…

Read More

విత్తనాల దందా… అధికారుల అండ – అధిక ధరలతో అన్నదాత లూటీ

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరకు విక్రయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోయాబీన్ విత్తనాల కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం రూ. 2,400 మాత్రమే కాగా… కొందరు వ్యాపారులు రైతుల నుంచి రూ. 2,600 వరకు…

Read More

ఢిల్లీతో రేవంత్ రె’ఢ్డీ’ – బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతోనే కొట్లాట

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర పార్టీల నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు…

Read More

రాష్ట్ర జడ్జీల సంఘం ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర జడ్జీల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయి. ఈ ఎన్నికలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షించారు. ఆదివారం ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో, విజేతలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికలు న్యాయవ్యవస్థలో నూతన నాయకత్వానికి మార్గం సుగమం చేశాయి. వారి నాయకత్వంలో తెలంగాణ…

Read More

యూరియా కోసం…. గడప దాటండి… ఢిల్లీ వెళ్లండి…

సహనం వందే, హైదరాబాద్:ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో పంటల సాగు ఊపందుతుంది. ఇంతటి కీలక సమయంలో యూరియా అత్యవసరం. అందుకోసం అన్నదాత ఎదురుచూస్తున్నారు. కానీ యూరియా అందుబాటులో లేకుండా పోయింది. దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉండటంతో సాగు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆరోపిస్తుంది. మంత్రి తుమ్మల…

Read More

ముఖ్యమంత్రికి విన్నవించినా…ఆగని ఆయిల్ ఫెడ్ అక్రమార్కుల ఆగడాలు

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య ఆధ్వర్యంలో గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సార్లు విన్నవించారు. అయినా ఆయిల్ ఫెడ్ లో అక్రమాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కొందరు సీనియర్ అధికారులు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఆ సంస్థకు చెందిన కీలక అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,…

Read More

బీసీల నెత్తిన టోపీ – 42 శాతం రిజర్వేషన్లపై నీలినీడలు

సహనం వందే, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాలను రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్న బీసీల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు నాటకాలు ఆడుతూనే ఉన్నాయి. అగ్రవర్ణ పార్టీల నాయకులు బీసీల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ వారిని మోసం చేస్తూనే ఉన్నాయి. అటువంటి వారిని కొందరు బీసీ నాయకులు నమ్ముతుండడం పరాకాష్ట. ఎక్కడైనా మేకలకు పులి రక్షణ ఇస్తుందా? అని బీసీ నేతలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు…

Read More

డాక్టర్ల ఫేక్(స్) రికగ్నేషన్ – మెడికల్ కాలేజీలకు కొత్త సమస్య

సహనం వందే, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చెబుతోంది. అయితే ఈ చర్యలను ఛేదించే విధంగా కొన్ని కంపెనీలు కొత్త యాప్‌లతో ముందుకొచ్చాయి. ఇంటి నుంచే ముఖ గుర్తింపు ద్వారా హాజరు వేసుకునే సౌలభ్యాన్ని కేవలం రూ.7000కే అందిస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు వైద్య విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బొటనవేలు నుంచి ముఖ గుర్తింపు వరకువైద్య కళాశాలల్లో అధ్యాపకుల హాజరు కోసం గతంలో…

Read More