దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన -కైలాసగిరి పర్వత శిఖరంపై అద్భుత నిర్మాణం
సహనం వందే, విశాఖపట్నం: భారతదేశంలోనే అతి పొడవైన గాజు ఆకాశ వంతెన (గ్లాస్ స్కైవాక్) ఇప్పుడు సాగర తీరం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరి పర్వత శిఖరంపై రెండు కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 120 మీటర్ల పొడవున్న ఈ గాజు వంతెన కింద నీలి సముద్రం కనిపిస్తుంటే సందర్శకులకు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతోంది. సాహసాలను, అద్భుతమైన దృశ్యాలను కోరుకునే యువతకు ఇది ఓ కొత్త గమ్యస్థానం….