గగనంలో ఎగరలేం – ఇరాన్ యుద్ధం విమానయానానికి అడ్డం
సహనం వందే, న్యూఢిల్లీ: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. కోవిడ్ తర్వాత మళ్ళీ కోలుకుంటున్న పరిశ్రమకు ఈ యుద్ధం ఊహించని పెద్ద దెబ్బ తగిలింది. వేల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన ధరల మంట విమానయాన సంస్థల లాభాలను ఆవిరి చేస్తోంది. గ్లోబల్ ట్రావెల్ నెట్వర్క్ ఇప్పుడు తీవ్ర అనిశ్చితిలో ఉంది. ఆకాశంలో పెరిగిన ఉద్రిక్తతఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు…