హైదరాబాదులో అయోధ్య భాగ్యం – భాగ్యనగరంలో రామ మందిరం
సహనం వందే, హైదరాబాద్: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశమంతా రామమయమైంది. భక్త కోటి పరవశించిపోతున్న తరుణంలో హైదరాబాద్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. కూకట్పల్లిలో వెలసిన అయోధ్య రామ మందిర నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అచ్చం అసలు గుడిని తలపిస్తూ ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతోంది. ఈ అద్భుత నిర్మాణం వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు నగరాన్ని ఆకర్షిస్తున్నాయి. అచ్చం అయోధ్య నమూనాఅయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని చూసేందుకు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే కూకట్పల్లి హౌసింగ్…