
ముఖ్యమంత్రి వినాయక్’రెడ్డి’ – రేవంత్ రెడ్డి వేషధారణతో గణపతి
సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఆఘాపురాలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో వినాయకుడి విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్యాంటు, షర్టు, బూట్లు, మెడలో కండువా ధరించి ఉన్న గణనాథుని రూపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజకీయ నేతపై అభిమానం ఇక్కడి నిర్వాహకులను ఈ విధమైన…