అమెరికా రాజకీయల్లో ‘మస్క్’ మజా..

సహనం వందే, అమెరికా:ప్రపంచ వ్యాపార దిగ్గజం… టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత లేకపోయినా, ఆయన అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇటీవల ఆయనతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు పూనుకోవడం…

Read More

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ – తెల్లవారుజామున కీలక ప్రకటన

సహనం వందే, అమెరికా:ప్రముఖ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రాజకీయ రంగ ప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ‘అమెరికా పార్టీ’ పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అమెరికా రాజకీయాల్లోకి సంచలనాత్మక అడుగు వేశారు. దేశంలో వ్యర్థాలు, అవినీతి పెరిగిపోయాయని, స్వేచ్ఛను తిరిగి తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ పెడుతున్నట్లు గతంలోనే ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=4952 ప్రత్యేకంగా ఆర్టికల్ రాసింది….

Read More

రుచుల విందులో ‘అదుర్స్’ – ప్రపంచంలో 50వ స్థానం హైదరాబాద్

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచ ఆహార పటంలో భారతదేశం తన విశిష్టమైన వంటకాలతో మరోసారి సగర్వంగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 100 ఆహార నగరాల జాబితాలో ఆరు భారతీయ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది భారతదేశపు అద్భుతమైన, వైవిధ్యమైన వంటకాల వారసత్వానికి నిదర్శనం. ఈ జాబితాలో ముంబై (5వ స్థానం) అగ్రగామిగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో అమృత్‌సర్ (43వ స్థానం), ఢిల్లీ (45వ స్థానం), హైదరాబాద్ (50వ స్థానం), కోల్‌కతా…

Read More

ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరి… ఒంటరితనం పెనుభూతం

సహనం వందే, జెనీవా:ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం ఒక పెనుభూతంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌ఓ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒంటరితనం వల్ల ప్రతి గంటకు సుమారు వంద మంది మరణిస్తున్నారని వెల్లడించింది. అంటే సంవత్సరానికి…

Read More

‘నాగరీకులెవరూ బిర్యానీని చేతితో తినరు’

సహనం వందే, న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోరాన్ మందానిపై టెక్సాస్ కాంగ్రెస్‌ మెన్ బ్రాండన్ గిల్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. బిర్యానీని మందాని చేతులతో తింటున్న వీడియోను రీట్వీట్ చేసిన గిల్, “అమెరికాలోని నాగరిక మానవులు ఇలా తినరు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించని వారు మూడో ప్రపంచానికి తిరిగి వెళ్ళాల’ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని రేకెత్తించాయి….

Read More

ఏఐ స్టార్టప్ కొనుగోలు చేసిన యాపిల్

సహనం వందే, హైదరాబాద్: ఆన్-డివైస్ మోడల్స్‌ పై దృష్టి సారించిన ఒక స్టెల్త్ ఏఐ స్టార్టప్ ను యాపిల్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు భవిష్యత్తులో మరింత అధునాతనమైన సిరి అప్‌డేట్లు వస్తున్నాయని సూచిస్తోంది. ఈ స్టార్టప్ లైట్‌వెయిట్, ప్రైవసీ-ఫస్ట్ మోడల్స్‌ లో నిపుణత్వం కలిగి ఉంది. ఇది వినియోగదారుల డేటా భద్రతకు ప్రాధాన్యతనిచ్చే యాపిల్ విధానానికి అనుగుణంగా ఉంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో నూతన ఆవిష్కరణలు వేగంగా దూసుకుపోతున్నాయి. అభివృద్ధి చెందిన సాంకేతికతలతో తయారైన…

Read More

ఎలాన్ మస్క్ సింపుల్ లైఫ్… సూపర్ గోల్స్ …

సహనం వందే, అమెరికా:ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్) వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవనశైలి ఎందరికో ఆదర్శం. రూ. 35 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నప్పటికీ… ఆయన విలాసవంతమైన జీవితానికి దూరంగా, అత్యంత సాధారణంగా జీవించడం విశేషం. సంపదను వ్యక్తిగత విలాసాలకు కాకుండా, మానవాళి భవిష్యత్తును మెరుగుపరచే తన వెంచర్ల అభివృద్ధికి వినియోగించడమే మస్క్ ప్రధాన లక్ష్యం. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి….

Read More

ఆధునిక వైద్యంపై విషం – సొంత వైద్యంతో క్యాన్సర్…కూతురి బలి

సహనం వందే, లండన్:ఆమె కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒక యువతి. క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆమెకు కీమోథెరపీ చేస్తే 80 శాతం తగ్గుతుందని డాక్టర్లు నిర్ధారించారు. కానీ తల్లి ఆధునిక వైద్యాన్ని తిరస్కరించి… అశాస్త్రీయ మొక్కల ఆధారిత థెరపి చేయించి కూతురి ప్రాణాలను బలిపొంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ సోదరి… తమ తల్లి ప్రచారం చేసిన వైద్య వ్యతిరేక సిద్ధాంతాల వల్లే కన్నుమూసిందని ఇద్దరు సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. అపోహల…

Read More

బతుకుపై బండ… చావుకు అండ…ఇంగ్లాండ్ లో చట్టం

సహనం వందే, ఇంగ్లాండ్: ఎంతటి తీవ్ర అనారోగ్యమైనా సహజ మరణం వచ్చేవరకు కాపాడుకోవడం మానవుడి లక్షణం. కానీ రోజులు మారుతున్నాయి. కలియుగం దాపురించింది. కొన ఊపిరి ఉన్నంతవరకు తోటి మనిషిని కాపాడుకోవాల్సిన మానవజాతి… వారిని వదిలించుకునేందుకు ఏకంగా చట్టాలు చేస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. చచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వాలని కోరుతూ కొన్ని దేశాలు చట్టాలు చేశాయి. కొన్ని దేశాల్లో వాటిపై చర్చలు జరుగుతున్నాయి. మరణం హక్కుగా మారుతుండడం మానవత్వానికి మచ్చ. ఇంగ్లాండులో బిల్లుకు ఏర్పాటు..‌.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న…

Read More

688 ఏళ్ల నాటి లండన్ హత్య కేసు – హత్య నిజా నిజాలు

సహనం వందే, లండన్:సుమారు 688 సంవత్సరాల క్రితం… సరిగ్గా 1337 మే సాయంత్రం.‌.. లండన్‌లోని ఓల్డ్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ సమీపంలో జాన్ ఫోర్డ్ అనే పూజారి దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి, గొంతు, కడుపులో పొడిచి ప్రాణాలు తీశారు. ఈ హత్య వెనుక ఎలా ఫిట్జ్‌పేన్ అనే ధనిక కుటుంబానికి చెందిన శక్తివంతమైన మహిళ హస్తం ఉందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో వ్యభిచారం, దోపిడీ,…

Read More