కొత్త ఇంట్లో రోగాల కుంపటి – అడుగుపెట్టిన రోజు నుంచి జబ్బుల జాతర

సహనం వందే, అమెరికా:ప్రతి ఒక్కరి జీవితంలో సొంత ఇల్లు ఒక పెద్ద కల. అమెరికాలోని ఓహియోకు చెందిన సారా, కోలిన్ దంపతులు కూడా అదే కలను సాకారం చేసుకున్నారు. 2024 మే నెలలో సుమారు రూ. 3.3 కోట్లు వెచ్చించి ఒక అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులు సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొన్ని రోజుల్లోనే సారాకు వింత ఆరోగ్య సమస్యలు…

Read More

మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం

సహనం వందే, యూరప్:ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి…

Read More

ఏఐ సైకోసిస్ – దాంతోనే ఒంటరిగా గడిపితే భ్రమల్లో జీవితం

సహనం వందే, అమెరికా:కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి మానవాళికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏఐ పితామహుడిగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఏఐ పరిశోధన ఒక ఆయుధాల పోటీలా మారిందని, దీనిపై నియంత్రణ లేకపోతే అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విప్లవం ప్రపంచంలో పెను మార్పులు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్న కంపెనీలు…ఒకప్పుడు…

Read More

యుద్ధ విషాదం… అందంతో సందేశం – మిస్ యూనివర్స్ వేదికపై పాలస్తీనా గొంతుక

సహనం వందే, పాలస్తీనా:యుద్ధం… బాధలు… నిరాశతో నిండిన పాలస్తీనా నేల నుంచి ఒక ఆశాకిరణం ప్రపంచ వేదికపై మెరిసిపోనుంది. మిస్ యూనివర్స్ పోటీ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా తరఫున ఒక ప్రతినిధి పాల్గొనబోతున్నారు. ఆమె పేరు నదీన్ అయూబ్. పాలస్తీనా ప్రజల కన్నీళ్లు, కలలను తనలో నింపుకొని ఆమె ఇప్పుడు ప్రపంచానికి తమ గొంతుకగా నిలబడబోతున్నారు. నవంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్ వేదికపై పాలస్తీనా జెండా ఎగరవేయడానికి ఆమె సిద్ధమయ్యారు. అందం నీడలో సందేశం..‌.అందాల పోటీలు…

Read More

బీపీ కొత్త లెక్కల షాకింగ్ – అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కొత్త గైడ్ లైన్స్

సహనం వందే, న్యూయార్క్:అధిక రక్తపోటును నియంత్రించడానికి కొత్త మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కలిసి శుక్రవారం విడుదల చేశాయి. 2017 తర్వాత వచ్చిన ఈ తాజా సూచనలు, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధులు, మధుమేహం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి వాటిని నివారించవచ్చని స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త నియమాలు పాతవాటి కంటే చాలా కఠినంగా ఉండడమే కాకుండా, మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సిఫారసు చేస్తున్నాయి….

Read More

సూపర్ ఏజర్స్… సోషల్ జర్నీస్ – 90 ఏళ్లు వచ్చినా యూత్ ఐకాన్స్

సహనం వందే, అమెరికా:ఎనభై తొంభై ఏళ్లు వచ్చినా యువకుల్లా మంచి జ్ఞాపకశక్తితో ఉత్సాహంగా జీవిస్తున్న సూపర్ ఏజర్స్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? సుమారు పాతికేళ్లుగా నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధారణ వృద్ధులపై అనేక అధ్యయనాలు చేశారు. వాళ్ళ తాజా పరిశోధనలో మనసుకు హత్తుకునే నిజాలు వెలుగుచూశాయి. సామాజిక సంబంధాలు, ఉల్లాసమైన మనస్తత్వమే ఈ సూపర్ ఏజర్ల వెనుక ఉన్న రహస్యమని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యాన్ని ఎలా ఉల్లాసంగా గడపాలో ఈ సూపర్ ఏజర్ల జీవితాలు…

Read More

కెనడాలో ఖలిస్తాన్ ఎంబసీ – సర్రేలో రాయబార కార్యాలయ బోర్డు

సహనం వందే, కెనడా:కెనడాలోని సర్రేలో గురు నానక్ సిక్కు గురుద్వారా ప్రాంగణంలో ఖలిస్తాన్ రాయబార కార్యాలయం అనే బోర్డు ఏర్పాటు కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది పంజాబ్ ను విభజించేలా కుట్ర జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే భారత్, కెనడా సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఖలిస్తాన్ సమర్థకులు కెనడా గడ్డపై స్వేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ పాత్ర…సర్రేలోని గురు నానక్ సిక్కు గురుద్వారా ప్రాంగణంలో…

Read More

గ్రహాంతరవాసులతో వినాశనం – స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలో నిజమెంత?

సహనం వందే, లండన్:ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గ్రహాంతరవాసుల గురించి చేసిన హెచ్చరికలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఆకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువులు (యూఎఫ్ఓ), గ్రహాంతరవాసుల గురించి రోజురోజుకు ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో హాకింగ్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజల మనసుల్లో ఆందోళన రేపుతున్నాయి. గ్రహాంతరవాసులతో మనకు సంబంధాలు ఏర్పడితే అది మానవ జాతికి ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ విషయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి. గ్రహాంతరవాసులు…

Read More

90 ఏళ్ల బుల్లెట్టు… రేస్ వాకర్- అలాన్ పోయిస్నర్ స్ఫూర్తి గాథ

సహనం వందే, అమెరికా:వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని డాక్టర్ అలాన్ పోయిస్నర్ నిరూపిస్తున్నారు. 90 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఆయన, రేస్‌వాకింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ పతకాలు సాధించారు. తన వయసు విభాగంలో రికార్డులు నెలకొల్పిన ఆయన, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నా వయసు 90… కానీ నేను యువకుడినేతనను ఎవరైనా వృద్ధుడు అని పిలిస్తే, నేను వృద్ధుడిని కాదు, వయసు మళ్లిన వ్యక్తిని…

Read More

శుక్రకణాలకు శనిగ్రహం – పురుషుల్లో పునరుత్పత్తి వైఫల్యం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం ప్రమాదకరంగా క్షీణిస్తోందని అంతర్జాతీయ అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు శుక్రకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కోట్లాది జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి, దీంతో అనేక చోట్ల ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. అనేక మోసాలకు పాల్పడుతున్నాయి. లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతంతో అసలు సంతాన వైఫల్యానికి కారణాలపై…

Read More