విలాసంపై విప్లవాగ్ని – నేపాల్ అధికార పెద్దల లగ్జరీపై ఆగ్రహజ్వాల

సహనం వందే, నేపాల్:నేపాల్‌ లో ప్రభుత్వ పెద్దల విలాసవంతమైన జీవితంపై యువతలో ఆగ్రహం అగ్నిపర్వతంలా పేలింది. లగ్జరీ కార్లు, ఖరీదైన విదేశీ ప్రయాణాలు, కళ్ళు చెదిరే జీవనశైలికి సంబంధించిన నాయకుల పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ‘నెపో కిడ్స్’ హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అయ్యాయి. దేశంలో నాలుగో వంతు ప్రజలు పేదరికంతో అల్లాడుతుంటే పాలకుల వారసులు చేస్తున్న విచ్చలవిడి ఖర్చులను చూసి యువత సహనం కోల్పోయింది. ఈ సోషల్ మీడియా ప్రచారం కేవలం సమాచారం కోసం మాత్రమే…

Read More

కుబేరుడి పీఠాన్ని కోల్పోయిన మస్క్

సహనం వందే, అమెరికా:ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ తన పీఠాన్ని కోల్పోయాడు. అపారమైన కంప్యూటింగ్ శక్తికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఒరాకిల్ సహవ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ అనూహ్యంగా అతడిని అధిగమించి కొత్త ధనవంతుల రాజుగా అవతరించాడు. ఒరాకిల్ అద్భుతమైన ఆదాయ నివేదికతో లారీ సంపద ఒక్క రోజులోనే ఆకాశానికి ఎగిసింది. ఒరాకిల్ ఆదాయంతో దూకుడు…ఒరాకిల్ సంస్థ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఆదాయ నివేదిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కృత్రిమ మేధస్సు కంపెనీల నుంచి వచ్చిన భారీ…

Read More

నేపాల్‌లో ‘జెన్-జెడ్’ విప్లవం – సోషల్ మీడియా నిషేధంపై కన్నెర్ర

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో యువత చేపట్టిన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. అవినీతి, సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా ‘జెన్-జెడ్’ యువత వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ఈ ఉద్యమం మొదలైంది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంట్ సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించారు. 300 మందికి పైగా…

Read More

పాప కోసం ప్రధాని పంతం – అయినా లెక్క చేయని జర్మనీ దేశం

సహనం వందే, న్యూఢిల్లీ:బెర్లిన్ నగరంలో జర్మనీ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న నాలుగేళ్ల భారతీయ బాలిక అరిహా షా వ్యవహారం అంతర్జాతీయ దౌత్య వివాదంగా మారింది. ఆ పాపను భారత్‌కు అప్పగించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రిని కోరారు. గతంలో స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని జర్మన్ ఛాన్సలర్‌ ముందు ప్రస్తావించారు. దేశం మొత్తం ఒకే గొంతుకగా ‘సేవ్ అరిహా షా’ ఉద్యమం నడుస్తున్నా జర్మనీ అధికారులు మాత్రం…

Read More

మరణమే లేకుండా… అధికారమే శాశ్వతంగా! – చైనాలో పుతిన్‌, జిన్‌పింగ్, కిమ్ సమాలోచన

సహనం వందే, చైనా:చైనాలో చారిత్రక తియాన్మెన్ చౌక్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఓ రహస్య సంభాషణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ రాజకీయాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీరు ఇప్పటికే అనేక వ్యూహాలు రచిస్తుంటారు. అయితే ఈసారి వీరి సంభాషణ చావును జయించి శాశ్వతంగా అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపై జరిగినట్లు సీక్రెట్ చర్చ బయటపడింది. జీవశాస్త్ర సాంకేతికతతో అవయవ మార్పిడి ద్వారా…

Read More

అగ్రరాజ్యంగా చైనా – నాటి రష్యా పాత్రను పోషిస్తున్న డ్రాగన్ కంట్రీ

సహనం వందే, చైనా:ఒకప్పుడు కమ్యూనిస్ట్ రష్యా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రపంచానికి అండగా నిలబడింది. ఇప్పుడు అదే బాధ్యతను కమ్యూనిస్ట్ చైనా భుజానికెత్తుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాపై విమర్శల వర్షం కురిపిస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. అమెరికా విధానాలు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ సుంకాల విధానాల వల్ల అనేక దేశాలు నష్టపోతున్నాయి. చైనా, భారత్‌ వంటి దేశాలను లెక్కచేయకుండా సుంకాలు విధిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడంపై షీ…

Read More

అమెరికాలో హై’డ్రగ్స్’బాద్ నరమేధం – ఫెంటానిల్‌ వాడి వందల మంది మృతి

సహనం వందే, హైదరాబాద్:వసుధ ఫార్మా కెమ్ కంపెనీ అమెరికాతో సహా పలు దేశాల్లో డ్రగ్ నరమేధం సృష్టిస్తుంది. ఆ కంపెనీ ప్రమాదకర ఫెంటానిల్‌ డ్రగ్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను ఏకంగా అమెరికాకే సరఫరా చేయడంతో ఆ దేశంలో వందల మంది చనిపోయారు. దీంతో ఆ కంపెనీ సీఈవో, మార్కెటింగ్ డైరెక్టర్లను ఈ ఏడాది మార్చి 20వ తేదీన అమెరికా ఫెడరల్ ఏజెన్సీ అరెస్టు చేయడంతో హైదరాబాద్ పరువు గంగలో కలిసింది. దీనిపై అప్పుడే సహనం వందే…

Read More

కిమ్ ట్రైన్… మిస్సైల్ రైడ్ – బాంప్రూఫ్ రైల్లో కిమ్ చైనాకు ప్రయాణం

సహనం వందే, ఉత్తర కొరియా:ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆరేళ్ల తర్వాత పొరుగు దేశం చైనాలో పర్యటించిన ఆయన విమానంలో కాకుండా తన ప్రత్యేకమైన బాంప్రూఫ్ రైలులో ప్రయాణించడం అంతర్జాతీయ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ రైలు కేవలం ప్రయాణ సాధనం కాదు. ఒక కదిలే భద్రతా కోట. సుమారు 90 కోచ్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ రక్షణ, మిస్సైల్ వ్యవస్థ, బాంబు నిరోధక వ్యవస్థలు, అత్యంత విలాసవంతమైన…

Read More

గాజా యుద్ధంలో జర్నలిస్టుల ఊచకోత – 210 మంది హత్య

సహనం వందే, న్యూయార్క్:గాజా యుద్ధంలో జర్నలిస్టులను టార్గెట్ చేసి ఇజ్రాయిల్ హత్య చేస్తోందని ఆరోపిస్తూ ప్రపంచ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 50 దేశాల నుంచి 200కు పైగా మీడియా సంస్థలు సోమవారం భారీ నిరసనలకు దిగాయి. పత్రికలు నల్లటి ముఖ చిత్రాలను ప్రచురించగా… టెలివిజన్, రేడియోలు తమ ప్రసారాలను నిలిపివేశాయి. ఈ నిరసన ద్వారా గాజాలో స్వేచ్ఛాయుత వార్తా కవరేజీకి అనుమతించాలని, అమాయక జర్నలిస్టుల హత్యలను ఆపాలని డిమాండ్ చేశాయి. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్,…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More