‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు

సహనం వందే, మడ్ గాస్కర్:‘జెన్ జెడ్’ మంటల్లో మడ్ గాస్కర్ అధ్యక్షుడు తిరుగుబాటుతో మడ్ గాస్కర్ అధ్యక్షుడు అండ్రీ రాజోయెలినా దేశం విడిచి పారిపోవడం ప్రపంచ రాజకీయాలను ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. వేలాది మంది యువకులు అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉద్ధృతం చేయడంతో ఆర్మీ కూడా సహకరించింది. సైన్యం మద్దతు కోల్పోయిన రాజోయెలినా రహస్యంగా దేశం వదిలి వెళ్లిపోయాడు. రాజోయెలినా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒప్పందం చేసుకుని ఫ్రెంచ్ సైనిక విమానంలో పారిపోవడం…

Read More

అద్దె భార్య… అంతులేని వ్యధ – థాయ్‌లాండ్ పర్యాటకంపై విమర్శల వెల్లువ

సహనం వందే, బ్యాంకాక్:థాయ్‌లాండ్ పర్యాటకం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న ఒక చీకటి ధోరణి ప్రపంచ మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. పట్టాయా వంటి నగరాల్లో విదేశీ పర్యాటకులు తాత్కాలికంగా భార్యలను అద్దెకు తీసుకునే ఈ పోకడ ఆర్థిక అవసరాల పేరుతో మహిళలను వస్తువుల్లా మార్చే ప్రమాదకరమైన దోపిడీగా మారింది. రచయిత లావెర్ట్ ఎమ్మాన్యుయేల్ తన పుస్తకంలో బయటపెట్టిన ఈ అమానవీయ వాస్తవం ప్రపంచవ్యాప్తంగా సామాజిక నైతికతపై తీవ్ర చర్చకు దారితీసింది. ఇది…

Read More

మానవ హక్కుల బ్రోకర్లకు నోబెల్ – ఇజ్రాయిల్ మద్దతుదారు మచాడో ఎంపిక

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మరోసారి తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. 2025 సంవత్సరానికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఈ పురస్కారం దక్కడం నోబెల్ కమిటీ పశ్చిమ దేశాల రాజకీయ అజెండాను అమలు చేస్తోందనడానికి తాజా నిదర్శనం. అహింసా మార్గంలో ప్రపంచానికి స్వాతంత్య్ర సిద్ధాంతాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీకి ఐదుసార్లు నామినేషన్ వేసినా దక్కని ఈ గౌరవం… వెనెజులాలో సోషలిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడిన మచాడోకు లభించడం…

Read More

జాతి విద్వేషం… గాంధీ విగ్రహం ధ్వంసం – లండన్‌లో భారతీయులపై హేట్ క్రైమ్‌లు…

సహనం వందే, లండన్:ఒకప్పుడు భారతదేశాన్ని రాచి రంపాన పెట్టి దోపిడీ చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు… ఇప్పుడు మళ్లీ తమ అహంకారాన్ని అప్పుడప్పుడు బయట పెడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా వదలడం లేదు. ఆ దేశంలో ఉన్న కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహ ధ్వంసాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు…

Read More

డాక్టర్లపై డాలర్ సెగ – భారతీయ వైద్యులకు హెచ్1బీ గుదిబండ

సహనం వందే, అమెరికా:అమెరికా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న విదేశీ వైద్యులకు హెచ్1బీ వీసా ఫీజు రూపంలో అకస్మాత్తుగా పెనుభారం పడింది. అగ్రరాజ్యం తాజాగా వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ భారీ ఫీజు వైద్య సేవలకు అడ్డంకిగా మారుతుందని, దీని ప్రభావం వల్ల దేశ ఆరోగ్య రంగం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఆరోగ్య భద్రతకు అత్యవసరం అయిన వైద్యులను ఈ నిబంధన…

Read More

పచ్చబొట్టుకు పండగ – దక్షిణ కొరియాలో టాటూకు చట్టబద్ధత!

సహనం వందే, సియోల్:కొత్త చట్టంతో దక్షిణ కొరియాలో ఇక టాటూ కళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటివరకు చీకటి గదుల్లో రహస్యంగా పనిచేసిన టాటూ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. జాతీయ అసెంబ్లీ టాటూ కళను చట్టబద్ధం చేస్తూ చారిత్రక బిల్లును గురువారం ఆమోదించింది. ఈ చట్టం దక్షిణ కొరియా సమాజంలో టాటూలపై ఉన్న అపోహలను తొలగించి కళగా గుర్తించే దిశగా వేసిన అతిపెద్ద అడుగు. కళాకారుల జీవితాల్లో వెలుగు…దక్షిణ కొరియాలో టాటూలు వేయడం ఎప్పటి నుంచో నిషేధం….

Read More

మీడియాపై నరమేధం – యెమెన్‌లో 31 మంది జర్నలిస్టుల మృతి

సహనం వందే, న్యూఢిల్లీ:మధ్యప్రాచ్యంలో జర్నలిస్టుల భద్రతకు మరోసారి పెనుముప్పు పొంచి ఉంది. యెమెన్‌లో ఒక వార్తాపత్రిక కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 31 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల రక్షణ కమిటీ (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) నివేదిక ప్రకారం… జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ దాడిని హౌతీ తిరుగుబాటుదారుల మీడియా కేంద్రంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బందిని…

Read More

భారత మగాళ్లకు అమెరికాలో డిమాండ్ – ఇండియన్ భర్త కోసం ఒక మహిళ ప్రయత్నం

సహనం వందే, అమెరికా:న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అక్కడ విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు కనిపిస్తుంటారు. అలాంటి చోట ఒక అమెరికన్ మహిళ ‘భారతీయ భర్త కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక కాలంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలకు వేదికగా మారుతున్నప్పుడు… ఆ మహిళ పాత పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది….

Read More

లండన్ మండెన్ – ‘మా దేశం మాక్కావాలి’.. బ్రిటన్ లో నిరసనలు

సహనం వందే, లండన్:లండన్ నగరం వలస వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. యాంటీ-ఇమ్మిగ్రేషన్ ఉద్యమం గట్టి గళంతో ముందుకు సాగుతోంది. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి నుంచి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వరకు వేలాది మంది ప్రజలు కదలివచ్చారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి లక్షన్నర మందికి పైగా హాజరయ్యారని నివేదికలు చెబుతున్నాయి. వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ, అక్రమ వలసదారులను వెంటనే వెనక్కి పంపించాలని వీరు డిమాండ్ చేశారు. నిరసన శాంతియుతంగా మొదలైనా…

Read More

జెన్ జెడ్ వెనుక ‘డీజే’ సౌండ్ – నేపాల్ ను కుదిపేసిన నేత సుదాన్ గురుంగ్

సహనం వందే, నేపాల్:నేపాల్‌లో అవినీతి, కుటుంబ రాజకీయాలు… అలాగే సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ యువతలో రేగిన ఆగ్రహం ఇప్పుడు రాజకీయ విప్లవంగా మారింది. ఈ పోరాటంలో ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువ కెరటం 36 ఏళ్ల సుదాన్ గురుంగ్. ‘హమి నేపాల్’ అనే సంస్థకు అధ్యక్షుడైన గురుంగ్… ఈ నిరసనలకు ఊపిరి పోశాడు. వాటిని దేశవ్యాప్తంగా వ్యాపింపజేశాడు. ‘కొత్త తరం ముందుకు వచ్చి, పాత విధానాలను సవాల్ చేయాల’ని గురుంగ్ చెప్పిన మాటలు లక్షలాది మంది…

Read More