Vizianagaram MP Kalisetti Appalanaidu

విజయనగరం స్పీడు… కలిశెట్టి జోరు! – 18 నెలల్లోనే మారిన జిల్లా ముఖచిత్రం

సహనం వందే, విజయనగరం: విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 18 నెలల కాలంలోనే జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కలిశెట్టి చేస్తున్న నిరంతర కృషి నేడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కనిపిస్తున్న మార్పు ఇదీ. భోగాపురం విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పుడు…

Read More
Sree Latha

చినుకుల తడి…

చినుకుల తడిచిగురిస్తున్న సవ్వడికవ్వించే మేఘాలుజలవారుతున్న మబ్బులునీకై చూస్తూ… వడి వడిగా పరిగెడుతున్నాయిరారమ్మని పిలుస్తున్నాయి…ఆహ్వానం పంపుతున్నాయి.. తొలి వెలకువతోనే..గర్జించే మేఘాలుగాండ్రించే ఉరుములు..నేనున్నా అంటూ మెరుపులుసందడి చేసున్నాయి…సాదర స్వాగతం అంటూనిన్ను మేల్కొలపుతున్నాయి..ఆహ్వానం పంపుతున్నాయి.. (శ్రీలత)

Read More
Acid Attack at Warangal

నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

సహనం వందే, వరంగల్:నర్సింగ్ విద్యార్థినిపై మంగళవారం ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. హనుమకొండలోని కాలేజీ నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఆమెపై హెల్మెట్లు ధరించిన దుండగులు యాసిడ్ చల్లారు. ఈ దాడిలో విద్యార్థినికి నడుము, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త ఎన్డీటీవీ సోర్స్: https://www.ndtv.com/india-news/telangana-nursing-student-attacked-with-chemical-substance-suffers-injuries-9734317

Read More

జూబ్లీ గెలుపు… రేవంత్ జోరు – నవీన్ యాదవ్ గెలుపుతో జోష్

సహనం వందే, హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయన అనుసరించిన వ్యూహాలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన విజయం తిరుగులేని ధైర్యాన్ని ఇచ్చింది. ఇది కేవలం ఒక స్థానం పెరగడం మాత్రమే కాదు… రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి స్థానాన్ని మరింత బలోపేతం చేసిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కంటోన్మెంట్, ఆ తర్వాత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాలను కాంగ్రెస్ గెలవడం ఆయన సారథ్యానికి…

Read More

జూబ్లీ’హీట్స్’ – జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ నిరసన వెల్లువ

సహనం వందే, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి సెగ పుట్టిస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈనెల 18వ తేదీన బీసీ సంఘాలు బందుకు కూడా పిలిపిచ్చాయి. మరోవైపు కుల సంఘాలు, నిరుద్యోగులు, వివిధ రకాలుగా నష్టపోయిన వర్గాలు వీరంతా కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వందల సంఖ్యలో నామినేషన్ వేసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఒక వైపు ఎలక్షన్ పోరు… మరోవైపు ప్రభుత్వంపై నిరసన వెల్లువలు…

Read More

‘కారం’తో రగిలిన కోల్ కతా – పశ్చిమబెంగాల్లో మిరప పొడితో నిరసన

సహనం వందే, కోల్ కతా:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు తెరతీశారు. దుర్గాపూర్ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను అస్త్రంగా చేసుకుని కోల్‌కతా సాల్ట్ లేక్ మెట్రో స్టేషన్ వద్ద మహిళలకు ఎర్ర మిరప పొడి ప్యాకెట్లు పంచారు. ఈ ఆపరేషన్ లాల్ మిర్చి పేరుతో చేపట్టిన…

Read More

సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

‘ఓజీ’పై అంబటి క్రేజీ – హిట్ అవుతుందన్న అంబటి రాంబాబు

సహనం వందే, విజయవాడ:ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ సినిమాకి హిట్ సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు భిన్నమైన వైఖరులు వైసీపీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క సోషల్ మీడియాలో ఓజీ సినిమాపై పార్టీ ట్రోల్స్, మీమ్స్‌తో విరుచుకుపడుతుంటే… అంబటి మాత్రం…

Read More

రోడ్డుపై ‘వందే భారత్’ – హైదరాబాదు నుంచి విశాఖకు 8 గంటలే

సహనం వందే, హైదరాబాద్:వందే భారత్ రైల్లో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది.‌ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 11:35 గంటలకు చేరుస్తుంది. ఇప్పుడు వందే భారత్ కు దీటుగా రోడ్డు పైనే కారు లేదా బస్సులో విశాఖకు చేరుకోవచ్చు. అందుకోసం వచ్చే సంక్రాంతి నుంచి కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గబోతోందని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఇది నిజంగా ఓ మంచి…

Read More

బెనిఫిట్ షో టికెట్ రూ. వెయ్యి – ధరల పెంపుతో ఓజీకి మార్గం సుగమం!

సహనం వందే, విజయవాడ:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా బెనిఫిట్ షో , ఐదు రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనూహ్యంగా అనుమతులు లభించాయి. సాధారణంగా సినిమా టికెట్ల ధరల పెంపుపై అడ్డుకట్ట వేసిన గత ప్రభుత్వం… ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే నిబంధనలను సడలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక సినిమా పరిశ్రమ లాభాపేక్ష కంటే అధికార కూటమిలోని ఒక కీలక వ్యక్తి…

Read More

సీడ్ సర్టిఫికేషన్ అథారిటీకి అవార్డు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో జరిగిన ఇండో-ఆఫ్రికా సమ్మిట్‌లో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్‌సీఏ) విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకుంది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా విత్తన రంగంలో విశేష సేవలందించిన సంస్థలకు ఈ అవార్డును అందజేశారు. అందులో భాగంగా తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇది గర్వకారణం. విత్తన రంగంలో ఆదర్శం…తెలంగాణ…

Read More

మైనారిటీ గురుకులాల్లో జీతాల గోస

సహనం వందే, ఖమ్మం:తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, డైలీ వేజెస్ ఉద్యోగుల బతుకులు మూడు నెలలుగా అగమ్యగోచరంగా మారాయి. ప్రజాపాలనలో జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యుడు షేక్ మక్బూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. గత ప్రభుత్వం గురుకుల ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో…

Read More

న్యూ యా’ఫీల్’ – నేటి రాత్రి 10.30 గంటలకు ఐఫోన్ 17 ఆవిష్కరణ

సహనం వందే, అమెరికా:టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ ఈవెంట్ కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐఫోన్ 17 సిరీస్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 వంటి గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాపిల్ ఈసారి టెక్ ప్రపంచంలో ఏ సంచలనాలు సృష్టిస్తుందో అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఐఫోన్ 17 సిరీస్… సన్నగా,…

Read More

సీపీఎం నేత నర్రా రమేష్ మృతి

సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read More

ముఖ్యమంత్రి వినాయక్’రెడ్డి’ – రేవంత్ రెడ్డి వేషధారణతో గణపతి

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లోని ఆఘాపురాలో ఏర్పాటు చేసిన ఒక వినాయక మండపం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో వినాయకుడి విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేషధారణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్యాంటు, షర్టు, బూట్లు, మెడలో కండువా ధరించి ఉన్న గణనాథుని రూపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాజకీయ నేతపై అభిమానం ఇక్కడి నిర్వాహకులను ఈ విధమైన…

Read More

వినాయక చవితి విశిష్టత – సంతోషం పంచే సనాతన సంప్రదాయం

భారతీయ సంస్కృతిలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, ఒక తాత్విక బోధనను అందిస్తుంది. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణనాథుడిని ఆరాధించడం అనాది కాలం నుండి వస్తున్న సనాతన సంప్రదాయం. విఘ్ననాయకుడు, విద్యాదాయకుడు, ఐశ్వర్యప్రదాత అయిన గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి రూపంలోనే ఎన్నో బోధనలు!వినాయకుడు గజాననుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, సిద్ధివినాయకుడు…

Read More

కమ్యూనిస్టు నేత సురవరం కన్నుమూత – రేవంత్ రెడ్డి సంతాపం

సహనం వందే, హైదరాబాద్:సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి, కార్మిక వర్గానికి తీరని లోటు. విద్యార్థి దశ నుంచే పోరాటం…1942 మార్చి 25న మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే పాఠశాలలో…

Read More

శ్రావణమాసం సకల శుభప్రదం – వరాలక్ష్మీ కటాక్షమే జీవన ధ్యేయం

శ్రావణమాసం అంటే ప్రకృతి పరిమళించే పుణ్యకాలం. మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు ఒక పర్వదినమే, శ్రావణ సోమవారాలు పరమేశ్వరుని ఆరాధనకు, మంగళవారాలు మంగళగౌరీ వ్రతానికి, శుక్రవారాలు మహాలక్ష్మికి, శనివారాలు శ్రీ వెంకటేశ్వరుని సేవకు. ఇలాంటి పవిత్ర మాసంలో శ్రావణ శుక్రవారం జరిగే వరలక్ష్మీ వ్రతం సౌభాగ్యానికి, శాంతికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఈ వ్రతాన్ని విశేషంగా పాటించడానికి ఒక పవిత్ర కథ ఆధారంగా చెబుతారు – అదే చారుమతీ కథ. పూర్వకాలంలో చారుమతీ…

Read More

‘మహా’ డైవర్షన్ మెసేజ్- నేడు మహావీర్ మెడికల్ కాలేజీలో తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:మహావీర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం తన తప్పులను సరిదిద్దుకోకుండా దిక్కుమాలిన వ్యవహారాలన్నీ చేస్తూ బుక్ అవుతుంది. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఫ్యాకల్టీ, డాక్టర్లు, ఇతర వాట్సాప్ గ్రూపులలో ఒక మెసేజ్ పెట్టారు. శుక్రవారం హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీ ఉన్నందున ఉదయం ఏడున్నర గంటలకే బోధనాసుపత్రిలో అందుబాటులో ఉండాలని ఆ మెసేజ్ లో స్పష్టం చేశారు. అయితే ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్న చర్చ కాలేజీ వర్గాలలో నెలకొంది. గత…

Read More

శ్రావణం ఆధ్యాత్మిక సంగమం

శ్రావణమాసం అనేది హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రత కలిగిన మాసం. ‘శ్రవణ’ అనే నక్షత్రంతో ఈ మాసం ప్రారంభమవుతుంది కనుక దీనికి శ్రావణం అనే పేరు వచ్చింది. ఈ మాసం అంతటా భక్తిపరవశం, పూజాపారాయణలు, ఆచారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శివునికి ఇది ప్రీతికరమైన కాలంగా చెప్పబడుతుంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలు ‘శ్రావణ సోమవారాలు’గా ప్రసిద్ధి చెందాయి. భక్తులు ఉపవాసంతో శివుడికి అభిషేకాలు చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. వనమూలికలతో చేసిన పూజా ద్రవ్యాలు ప్రకృతి సౌందర్యాన్ని…

Read More

సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

సహనం వందే, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు…

Read More

విద్యార్థుల శారీరక ఫిట్‌నెస్‌ కోసం ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ ’

సహనం వందే, హైదరాబాద్:విద్యార్థుల శారీరక ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 15వ తేదీ నుంచి అమలయ్యే ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఫిట్‌నెస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి అని సీఐఎస్‌సీఈ రీజనల్ స్పోర్ట్స్…

Read More

తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు?

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు అనగాని, పార్థసారథి, నారాయణతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో కదిలిక వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ…

Read More

అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జర్నలిజంలో 16 ఏళ్ళకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

’55 ముక్కలుగా నరుకుతా’ – పబ్‌జీ ప్రేమ ఉన్మాదం

సహనం వందే, ఉత్తరప్రదేశ్:ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం హైదరాబాదులో కన్నతల్లిని చంపిన పదో తరగతి కూతురి వ్యవహారాన్ని మరిచిపోక ముందే… పబ్‌జీ ద్వారా ప్రేమలో పడి భర్తను, ఏడాదిన్నర కొడుకును వదిలేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సోషల్ మీడియా మనుషుల మధ్య బంధాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి తాజా ఘటనలు నిదర్శనం. ఒక పబ్‌జీ ప్రేమ వ్యవహారం ఓ వివాహ బంధాన్ని తలకిందులు చేయడమే కాకుండా, హత్య…

Read More

టీ న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్:ప్రముఖ టీ న్యూస్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్చ ఆత్మహత్య చేసుకుంది. ఆమె రామ్‌నగర్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్చ తన తల్లి శ్రీదేవితో కలిసి నివాసం ఉంటుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More

పదో తరగతిలో ఆవు మెదడు -ఉపాధ్యాయురాలు సస్పెండ్

సహనం వందే, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవు మెదడు ను తీసుకొచ్చి తరగతి గదిలో ప్రదర్శించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో విద్యార్థులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఆ ఉపాధ్యాయురాలుని సస్పెండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యలాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ఉపాధ్యాయురాలు ఖాసీమ్ బీ… 10వ తరగతి విద్యార్థులకు మానవ మెదడు…

Read More

పదో తరగతి బాలిక కర్కషత్వం -ప్రియుడి మోజులో పడి తల్లి హత్య

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అయితే ఈ దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మృతురాలి చిన్న కుమార్తె ప్రియ… ఈ వ్యవహారంలో వెలుగులోకి తెచ్చిన నిజాలు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి….

Read More

హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంకు జాతీయ అవార్డు

సహనం వందే, న్యూఢిల్లీ:హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్‌పీఓ), తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 2025 ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారుల సమావేశంలో…హైదరాబాద్ ఆర్‌పీఓ చేపట్టిన వినూత్న చర్యలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాల విభాగంలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకుంది. పాస్‌పోర్ట్ ధృవీకరణ, సేవా సౌకర్యాలలో తెలంగాణ పోలీసుల నిరంతర ప్రతిభకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మంగళవారం నాడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి…

Read More

ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలురైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు…

Read More

ఓజస్ తేజో ఆధ్వ‌ర్యంలో… యోగా దినోత్స‌వ వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ డీడీ కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ… యోగా విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక,…

Read More

విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్:విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు….

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి – టీడబ్ల్యూజేఎఫ్

కొత్త స్పెషల్ కమిషనర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార్ భవన్‌లో కొత్త స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సిహెచ్. ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి అభినందించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యతో పాటు ఇతర ప్రతినిధులు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడిటేషన్లు,…

Read More

క్యాబినెట్ లో మెడికోలపై నివేదిక – మంత్రి దామోదర వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి, సిఫార్సులతో సహా చర్చించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశ ఫలితాలు, తదుపరి చర్యలను వివరించడానికి 25న టీ-జుడా ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జూడా నాయకులు డాక్టర్ ఐజాక్…

Read More

ఏలూరులో సాక్షి ఆఫీసుకు నిప్పు – రాష్ట్రవ్యాప్తంగా దాడులు

ఎడిటర్ ధనుంజయరెడ్డి, సైమాల ఖండన సహనం వందే, ఏలూరు:ఆంధ్రప్రదేశ్‌లో సాక్షికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఏలూరులో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కొందరు దుండగులు సాక్షి ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోగా, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ నేతలు కక్షపూరితంగా చేసిన పనే అని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను సాక్షి…

Read More

డాక్టర్ రఘురామ్ కు అరుదైన గౌరవం

కేఎంసీ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు ప్రదానం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పి. రఘురామ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ (కేఎంసీ) 70 ఏళ్ల చరిత్రలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు పొందిన మొదటి వైద్యుడిగా ఆయన ఘనత సాధించారు. మంగళూరులో జరిగిన ప్లాటినం జూబ్లీ కళాశాల దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును డాక్టర్ రఘురామ్‌కు అందజేశారు. అత్యున్నత సేవలకు…

Read More

ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

సహనం వందే, హైదరాబాద్: మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో…

Read More

రేపు హైదరాబాదుకు ప్రభాకర్ రావు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్ రావు రేపు రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ఆయన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్‌కు దరఖాస్తు చేసుకోగా, అది మంజూరైంది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఇండియాకు బయలుదేరనున్నారు. 8వ తేదీ అర్థరాత్రి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం 9వ తేదీ ఉదయం…

Read More

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట

సహనం వందే, యాదాద్రి: తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని, విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ సేవలు అందిస్తున్న తరహాలోనే తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన…యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు…

Read More

చంద్రబాబు సరికొత్త సంప్రదాయం

సామాన్యులకు సలహాదారు పదవులు సహనం వందే, అమరావతి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఎంతో మంది సీనియర్ నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరి అంచనాలకు అందని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తూ తనదైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ సలహాదారుగా ‘ఫారెస్ట్ మ్యాన్’ గా పేరొందిన జర్నలిస్ట్ అంకారావును నియమించడం తాజా ఉదాహరణ. అంకారావు నియామకంపై సీఎం ప్రకటించే వరకు ఆయనకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. నల్లమల అటవీ…

Read More

రోడ్‌షోలు అవసరమా..?

సహనం వందే, ముంబై: బెంగళూరులో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాట, 11 మంది మరణం పట్ల భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయాలను పురస్కరించుకొని రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని, మనుషుల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు….

Read More

ఇథనాల్ ఫ్యాక్టరీ హింసాత్మక ఆందోళనలు

సహనం వందే, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధనవాడలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు హింసాత్మక ఆందోళనలకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద గుడిసెలు, పరికరాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం పెరుగుతుందని, నీరు కలుషితమవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నారాయణపేట, దిలావర్‌పూర్‌లలోనూ ఇలాంటి ఆందోళనలు జరిగాయి.

Read More

వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుత వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం వర్షాకాల సన్నద్ధతపై…

Read More

తెలంగాణను ప్రపంచ అగ్రగామిగా నిలుపుతాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహనం వందే, హైదరాబాద్: తెలంగాణను 2047 నాటికి ప్రపంచ అగ్రగామిగా నిలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. ఈ మహత్తర లక్ష్య సాధనకు…

Read More

నాగ’బాబు’కు హ్యాండ్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ… ఇప్పుడు ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించనట్లు కనిపిస్తుంది. ఇద్దరు మెగా బ్రదర్స్ ను చేర్చుకోవడంపై చంద్రబాబు నాయుడు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ గ్లామర్ ముందు మంత్రి లోకేష్ వెలవెల బోతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే…

Read More

ఆసుపత్రుల్లో కరెంట్ కష్టాలు

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు రోగుల పాలిట శాపంగా మారాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరెంటు కోతతో వైద్యులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ల సాయంతో రోగులకు చికిత్స అందించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ స్పందించి, ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అయితే,…

Read More

మిక్సోపథీ ప్రజారోగ్యానికి పెను ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మిక్సోపథీ విధానం ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) విమర్శించింది. వైద్య విద్యను శాస్త్రీయత నుండి వేరుచేసే ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జూడా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూడా అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, ఆధునిక వైద్యం శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా ఏర్పడిన ఘనమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు….

Read More

థగ్ లైఫ్ ఒక మహత్తర చిత్రం:

ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్! సహనం వందే, విశాఖపట్నం: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది….

Read More

పవన్ తో పెట్టుకుంటే పతనమే

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగ్గుమంటున్నారు. తమ కూటమి ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవడం పైన… తన సినిమా విషయంలో అడ్డువస్తున్న వారిపట్ల ఆయన మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇతర సినీ పెద్దలపై కన్నెర చేశారు. పవన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని…

Read More

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి…!

సహనం వందే, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గతేడాది జూన్‌ 3వ తేదీన రాష్ట్రంలోని రుతుపవనాలు ప్రవేశించగా… ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రాన్ని తాకాయి. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది. కానీ ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో ముందస్తుగా రుతుపవనాల రాక రైతాంగాన్ని ఉత్సాహంలో నింపింది. వారం రోజులుగా కురుస్తున్న అడపాదడపా వర్షాలతో రైతులంతా దుక్కులు దున్ని సాగుపనులకు సిద్దంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రుతుపవనాలు ముందుగానే రావడంతో…

Read More

దేశంలో మళ్లీ కరోనా అలజడి

సహనం వందే, ఢిల్లీ: అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. కొత్త రూపంలో తిరిగొచ్చి దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొత్త వేరియంట్లను గుర్తించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. నిపుణుల హెచ్చరిక…భారతీయ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు ఎన్‌బి.1.8.1, ఎల్ఎఫ్.7 అనే రెండు కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే జేఎన్.1 రకం కేసులు నమోదయ్యాయి. ఈ…

Read More

విజ‌య‌సాయిరెడ్డిపై వైసీపీ సంచలన ట్వీట్‌

సహనం వందే, అమరావతి: విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. ‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లా నెంబర్ 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు… 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌ వచ్చారు. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు జరిపారని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.

Read More

మిస్ వరల్డ్ తారలను ఎవరు వేధించారు?

ప్రభుత్వం సమాధానం చెప్పాలని సబిత డిమాండ్ సహనం వందే, హైదరాబాద్: మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ కామెంట్స్‌పై మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదివారం స్పందించారు. మిల్లా మ్యాగీ ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ పరువును ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. మ్యాగీ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. ప్రపంచ దేశాల యువతులను ఎవరు వేధించారో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులు ఎవరో తేల్చాలని… మహిళా కమిషన్ స్పందించి విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More

జపాన్‌ను అధిగమించిన భారత్

సహనం వందే, ఢిల్లీ: భారత్ జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం జరిగిన నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని సుబ్రమణ్యం తెలిపారు. ‘ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగో అతిపెద్ద ఆర్థిక…

Read More

సినిమా థియేటర్ల వివాదంపై అల్లు…

సహనం వందే, హైదరాబాద్: సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్‌ మాత్రమే ఉందన్నారు. స్టాండ్‌ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.

Read More

మావోయిస్టు నేతకు విషమిచ్చి చంపారా?

నంబాల ఎన్‌కౌంటర్… అనుమానాలు, ఆరోపణలు సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (బసవరాజు) మరణంపై తీవ్ర అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఎన్‌కౌంటర్ జరిగిందని చెబుతుండగా, పౌరహక్కుల సంఘాలు, కుటుంబ సభ్యులు మాత్రం విషమిచ్చి చంపారనో లేక ఎక్కడో కాల్చి చంపి అడవుల్లో పడేశారనో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంబాల మృతదేహాన్ని అప్పగించడంలో పోలీసుల నిరాకరణ, రీ-పోస్టుమార్టం భయం చుట్టూ అలుముకున్న రహస్యాలు…

Read More

తమన్నాకు కన్నడిగుల షాక్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై ఫైర్ సహనం వందే, మైసూర్: ప్రఖ్యాత మైసూర్ శాండల్ సబ్బుకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్, టాలీవుడ్ నటి తమన్నా భాటియాను నియమించడం కర్ణాటకలో పెను దుమారం రేపుతోంది. రెండేళ్ల కాలానికి ఏకంగా రూ. 6.2 కోట్ల భారీ మొత్తంతో కుదిరిన ఈ ఒప్పందంపై కన్నడిగులు మండిపడుతున్నారు. స్థానిక నటులను పక్కనపెట్టి, బయటివారిని ఎంపిక చేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక…

Read More

నంబాల కేశవరావుకు ఎల్ టీటీఈ శిక్షణ

సహనం వందే, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తమిళ ఎల్ టీటీఈ గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. గెరిల్లా యుద్దం, ఎక్స్ ప్లోజివ్ డివైజ్ వాడకంలో ఎక్స్‌పర్టు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టిటిఇ నుండి గెరిల్లా యుద్ద శిక్షణ పొందారు. 1992లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2004లో మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమీషన్ అధిపతిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా…

Read More

మహేశ్‌బాబు కుటుంబంలో కరోనా

సహనం వందే, హైదరాబాద్: కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. సింగపూర్, థాయిలాండ్, హాంగ్‌కాంగ్ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇదే సమయంలో, భారతదేశంలో కూడా కరోనా తిరిగి ప్రవేశించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కుటుంబంలో ఈ వార్త కలకలం రేపింది. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోదరి, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ‘ఎక్స్’ ద్వారా…

Read More

పుచ్చలపల్లి ‘నిరాడంబ’రయ్య

సహనం వందే, హైదరాబాద్: పుచ్చలపల్లి సుందరయ్య… ఒక పేరు కాదు, ఒక తరం ఆదర్శం. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన ఒక శిఖరం. సామాన్యుల కోసం తన జీవితాన్ని అర్పించిన యోధుడు. నిరాడంబర జీవనశైలితో గాంధీజీని తలపించిన నాయకుడు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన ఆయన జీవితం నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది. బాల్యం నుండి స్వాతంత్ర్య పోరాటం వైపు…1913 మే 1న నెల్లూరు జిల్లా అలగనిపాడులో ఒక సంపన్న కుటుంబంలో…

Read More

ఫిలింసిటీలో ‘మిస్ వరల్డ్’ రచ్చ

సమన్వయ లోపం.. కార్యక్రమం ఆలస్యం సహనం వందే, హైదరాబాద్: ఫిలిం సిటీలో అందాల బామల పర్యటన కార్యక్రమం ఆలస్యంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుందరీమణుల ప్రోగ్రాంలు సమయనుకూలంగా జరుగుతుండగా.. ఫిలిం సిటీ శనివారం నాటి కార్యక్రమం మాత్రం ఆలస్యంగా జరిగింది. వాస్తవానికి ఫిలిం సిటీకి సమయం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకే అందాల తారాలంతా చేరుకున్నప్పటికి అక్కడి సిబ్బంది, అధికారులు, పోలీసుల మధ్యన సమన్వయ లోపంతో కార్యక్రమ నిర్వహణలో ఆలస్యం చోటు చేసుకుందని…

Read More

ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్?

సహనం వందే, హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విస్తరణ జరగపోవడంతో అనేకమంది నిరాశలో ఉండిపోయారు. ప్రతి పండుగకు లేదా శుభకార్యం సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మళ్లీ ఇప్పుడు విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతుండటంతో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా ప్రకటనతో ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి…

Read More

మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ సునీతారావు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు మధ్య పదవుల పంపకంపై మొదలైన వివాదం వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గాంధీభవన్‌ వేదికగా ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్టీ కోసం కష్టపడిన మహిళా కార్యకర్తలకు పీసీసీ కార్యవర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె పట్టుదలతో ఉండటంతో ఇరు వర్గాల…

Read More

కాంగ్రెస్ లో మహిళాగ్రహం

సహనం వందే, హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కష్టపడ్డ మహిళా నేతలకు కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యి చూపిస్తోంది. నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడంతో మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అర్హుల జాబితాను పీసీసీ, ఏఐసీసీకి పంపి ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్కరికి కూడా పదవి దక్కకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా పనిచేయాలని వారు నిలదీస్తున్నారు. 20 ఏళ్లకు పైగా పార్టీ కోసం పనిచేసినా పదవులు ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని…

Read More

‘యుద్ధం బాలీవుడ్ సినిమా కాదు’

సహనం వందే, పూణే: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తీవ్రంగా ఖండించారు. యుద్ధం అనేది బాలీవుడ్ సినిమాలో చూపించే రొమాంటిక్ అంశం కాదని, అది అత్యంత గంభీరమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు…యుద్ధం రొమాంటిక్ సీన్ కాదు. అది మీ…

Read More

‘యాపిల్’ కొరకలేం

సహనం వందే, అమెరికా: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ కొనుగోలుదారులకు చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్న కొత్త ఐఫోన్ల ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్ల ధరలు కొంచెం ఎక్కువగానే ఉండనున్నాయి. అయితే చైనా నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అమెరికా వేసిన పన్నుల వల్ల ఈ ధరలు పెరుగుతున్నాయని మాత్రం యాపిల్ చెప్పడం లేదు. ఈ నిర్ణయం ఐఫోన్…

Read More

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ 2025 పోటీలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయ సాంస్కృతిక కళలు, పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనల మధ్య ఈ పోటీలు ప్రారంభమైనట్లు ముఖ్యమంత్రి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. 110 దేశాల ప్రతినిధుల ప్రదర్శనతెలంగాణ సంప్రదాయ కళలు, పోటీదారుల పాశ్చాత్య కళల మేళవింపుతో మిస్ వరల్డ్…

Read More

తెలంగాణలో జపానీస్ భాష

సహనం వందే, హైదరాబాద్: ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు…

Read More

‘అందం’పై యుద్ధమేఘం

సహనం వందే, హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. భారత సైన్యం సరిహద్దుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా శత్రువును ఎదుర్కొంటున్న సమయంలో, అందాల పోటీల్లో ఆనందించే పరిస్థితి దేశంలో లేదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ‘మన జవాన్లు దేశం కోసం పోరాడుతుంటే, హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించడం జాతీయ మనోభావాలను గాయపరుస్తుంద’ని ఒకరు సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోటీలు కొనసాగితే దేశ ఐక్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు…

Read More

అత్యవసర సర్వీసు ఉద్యోగుల సెలవులు రద్దు

సహనం వందే, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని స్పష్టం చేశారు. కీలక ఆదేశాలు:

Read More

ఉగ్రవాదంపై కేంద్రానికి సిపిఐ మద్దతు

సహనం వందే, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదని, పాకిస్తాన్ పాలకులు, ఉగ్రవాదులు కలిసి భారత్‌లో నరమేధం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనికి సరైన గుణపాఠం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు ఆపాలి…మావోయిస్టులను…

Read More

రేవంత్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరిగింది! పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9 తర్వాత సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు తెగేసి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే సమ్మెకు సిద్ధం కావడంతో, రాష్ట్రంలో ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోనుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఉద్యోగులను మరింత రెచ్చగొట్టాయి. ‘ఉద్యోగులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు’ అంటూ హితవు పలికిన సీఎంకు,…

Read More

తెలంగాణ ఉద్యోగుల ఆగ్రహజ్వాల

సహనం వందే హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్యకార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టడానికి సిద్ధమైంది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక రోజు సుదీర్ఘ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు సమావేశమై, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 9వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు….

Read More

దివ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్రకు శ్రీకారం

సహనం వందే, చమోలి: ఉత్తరాఖండ్ హిమాలయాల ఒడిలో కొలువై ఉన్న పవిత్ర బద్రీనాథ్ ధామ్, ఆరు నెలల నిరీక్షణ తర్వాత తన దివ్య ద్వారాలు తెరుచుకుంది. ఆదివారం ఉదయం వేద మంత్రాల దివ్య ధ్వనులు మారుమోగుతుండగా, మంగళకరమైన సంగీతాల నడుమ, 40 క్వింటాళ్ల సుగంధ భరిత పుష్పాల అలంకరణతో శోభాయమానంగా ఆలయ గర్భగుడి తలుపులు తెరిచారు. ఈ శుభ సందర్భంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొని తొలి పూజలు నిర్వహించారు. భక్తుల హృదయాలు…

Read More

జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

జడ్జీల సంఘం నేతలు మురళిమోహన్, ప్రభాకరరావు సంతాపం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. ఆమె మృతికి తెలంగాణ జడ్జీల సంఘం అధ్యక్షులు కె. ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్శి కె.మురళి మోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయసేవల రంగంలో ప్రియదర్శిని చేసిన కృషిని వారు కొనియాడారు. ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు….

Read More

రాముడు ‘పురాణ పాత్ర’

సహనం వందే, ఢిల్లీ: అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాముడిని పురాణ పాత్రగా అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక సిద్ధాంతాన్ని కలిగి ఉందని, రాహుల్ రామ వ్యతిరేకి అని విమర్శించారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చలో రాముడిని పురాణ పాత్రగా పేర్కొన్నారు. హిందూ జాతీయవాదం ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ యుగంలో అన్ని వర్గాలను కలుపుకొని పోయే లౌకిక రాజకీయాలను…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?

కేంద్రం కులగణన ప్రకటనతో చిక్కులు సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన నేపథ్యంలో తాజా ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కేంద్ర కులగణనకే సాధికారత…కేంద్ర ప్రభుత్వం జనాభా గణాంకాల సమయంలో…

Read More

‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా ఈ నెల 7 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పే సువర్ణావకాశంగా భావిస్తూ, భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!…‘ప్రపంచం కళ్లన్నీ…

Read More

డిగ్రీ పరీక్షలు తక్షణమే నిర్వహించాలి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళంపై ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థుల భవిష్యత్తు బలి కాకూడదని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, ఉన్నత విద్యామండలి జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని కోరింది. అలాగే, తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లోని అవకతవకలపై విచారణ జరిపి…

Read More

‘మెగా’ ఇన్‌స్పిరేషన్

సహనం వందే, ముంబై: ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని తన మెగా ఇన్‌స్పిరేషన్‌గా అభివర్ణించాడు. ‘మామయ్య చిరంజీవి నా సినిమా జర్నీలో ఎప్పుడూ మెగా ఇన్‌స్పిరేషన్. ఆయన నటన, సినిమా పట్ల అంకితభావం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేశాన’ని బన్నీ ఎమోషనల్‌గా చెప్పాడు. చిరంజీవి నటనలోని వైవిధ్యం, యాక్షన్ స్టంట్స్, డ్యాన్స్ నుండి…

Read More

కాంగ్రెస్ ‘కులం’… కాషాయం హైజాక్

సహనం వందే, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ స్వాతంత్రానంతరం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. రాబోయే జాతీయ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని స్పష్టం చేసింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా విస్మయానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కులగణన డిమాండ్ ను ముందుకు తీసుకువచ్చారు. తాము గెలిస్తే కులగణన చేసి తీరుతామని హామీయిచ్చారు. అయితే కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ… కులగణనకు…

Read More

అమెజాన్ వర్సెస్ అమెరికా

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌తో వైట్ హౌస్ నేరుగా తలపడుతోంది. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలపై పడే అదనపు భారాన్ని తమ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు చూపాలని అమెజాన్ యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘శత్రుత్వపూరిత, రాజకీయ ప్రేరేపిత చర్య’గా అభివర్ణించింది. ఈ వివాదం అమెజాన్ షేర్ల పతనానికి దారితీసింది, టారిఫ్ విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత రాజుకుంది….

Read More

సింగర్ దేశద్రోహం

సహనం వందే హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశద్రోహం కేసుగా మారాయి. ఆమె వ్యాఖ్యలు మత, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, పాకిస్తాన్‌లో వైరల్ అవుతూ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడుతున్నాయని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. నేహా రాథోడ్ విమర్శలు… భగ్గుమన్న వివాదంపహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై నేహా సింగ్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని…

Read More

‘భారతి’ సిమెంట్స్ ‘గోవింద’

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారిగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ పేరు తెరపైకి వచ్చింది. తాడేపల్లిలో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలాజీని ఆజ్ఞాతంలో దాచినట్లు వార్తలు వస్తుండగా, ఆయన దొరికితే భారతి సిమెంట్స్‌తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు…

Read More

ఉగ్రదాడికి స్థానికుల సహకారం

సహనం వందే, పహల్గామ్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భీకర ఉగ్రదాడి వెనుక 15 మంది స్థానికులు టెర్రరిస్టులకు సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. టెర్రరిస్టులకు పథకం రూపొందించడంలోనూ, అమలు చేయడంలోనూ స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఏకే-47, ఎం4 రైఫిళ్లతో దాడి చేసి అనేక మంది పౌరులను, భద్రతా సిబ్బందిని హతమార్చారు. ఈ దాడి స్థానిక సహకారం లేకుండా సాధ్యం కాదని విచారణలో వెల్లడైంది. ఎలక్ట్రానిక్…

Read More

పేదల ఇళ్లు కూల్చొద్దు!

సహనం వందే వరంగల్: ‘హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. తెలంగాణను నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెడితే, ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. నా కళ్ల ముందు తెలంగాణ పరిస్థితి ఇలా అవుతుంటే బాధ కలుగుతోంది. మరో రెండున్నరేళ్లలో ఇక ఏమీ చేయగలుగుతార’ని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభలో తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత దుస్థితిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు…

Read More

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు

సహనం వందే హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెల పదవి విరమణ చేస్తున్నడంతో రామకృష్ణారావుని ప్రభుత్వం నియమించింది. మరోవైపు తెలంగాణలో ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట…

Read More

తెలంగాణ అభివృద్ధికి సహకారం కావాలి

భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శనివారం భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,…

Read More

‘అల్లాహ్’ సందేశంతో సైబర్ దాడి

సహనం వందే, ఢిల్లీ: ‘అల్లాహ్ మాతో ఉన్నాడు… మీ మతం మిమ్మల్ని కాపాడలేదు!’ భారత సైనిక నర్సింగ్ కళాశాల వెబ్‌సైట్‌లో శుక్రవారం హ్యాకర్లు పోస్ట్ చేసిన ఈ బెదిరింపు సందేశం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మన మదిని కలచివేస్తుండగానే ఈ సైబర్ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు కేవలం భౌతికంగానే కాకుండా, డిజిటల్‌గా కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా…

Read More

ఉస్మానియా ప్రిన్సిపల్ గా రాజారావు

సహనం వందే, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ రాజారావు నియమితులయ్యారు.‌ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు.

Read More

ఉగ్రదాడిపై ముస్లింల ఆగ్రహజ్వాల

సహనం వందే, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శుక్రవారం మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్‌లో పాల్గొన్న ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ…

Read More

కీరవాణీ… హిందువులనే అవమానిస్తావా?

బ్యాన్ చేయాలంటూ డిమాండ్! సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ‘పాడుతా తీయగా’ అనే ఒక సింగింగ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రవస్తి ఆరాధ్య ఆయనపై బాడీ షేమింగ్ ఆరోపణలు చేయగా, ఇప్పుడు కీరవాణి గతంలో చేసిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో ఆయనను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో దుమారం… ‘పాడుతా తీయగా’ 25వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య,…

Read More

రాహుల్ – హిండెన్‌బర్గ్ ల ఉమ్మడి ఆపరేషన్

సహనం వందే, ఢిల్లీ: ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌తో చేతులు కలిపి, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు సామ్ పిట్రోడా అమెరికాలోని హోమ్ సర్వర్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ కుట్ర బట్టబయలైనట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హిండెన్‌బర్గ్…

Read More

పాకిస్తాన్ గగనతలం మూసివేత

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు పూర్తిగా మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటివి తమ అంతర్జాతీయ విమాన మార్గాలను మార్చుకోవలసి వస్తోంది. దీని కారణంగా విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు…

Read More

‘మోదీ అంతర్గత ఉగ్రవాది’

సహనం వందే, విశాఖపట్నం: పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ, దేశ నిఘా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. మోడీకి పాలించే హక్కు లేదు! కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై…

Read More

ఫిట్జీ కోచింగ్ సంస్థపై ఈడీ దాడులు

సహనం వందే, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిట్జీ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాటి దాడులు విద్యా రంగంలో పేరుకుపోయిన రాక్షస క్రీడకు అద్దం పడుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలు డబ్బు లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో జరగడం కేవలం గమనార్హం. వేల కోట్ల రూపాయల ఫీజులు దండుకుని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఈ విద్యా వ్యాపారుల అసలు…

Read More

దేవుడి చెంత వైద్య ఉద్యోగి దందా

సహనం వందే, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒక సబ్ యూనిట్ ఆఫీసర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన ఆ ఉద్యోగి, డబ్బు వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ అసిస్టెంట్ స్థాయి నుండి ప్రమోషన్ పై సబ్ యూనిట్ ఆఫీసర్ అయిన ఇతను, ప్రైవేట్ ఆస్పత్రులు,…

Read More

అదానీ గ్రూప్ ‘ఆపరేషన్ జెప్పెలిన్’

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై 2023లో హిండెన్‌బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ…

Read More

గ్రూప్‌–1లో…దగాపడ్డ తెలుగు అభ్యర్థి

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు దగాపడ్డారు. దాదాపు పది సంవత్సరాలుగా పక్కాగా సన్నద్దమైన తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గత నెల 30న మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ… గ్రూప్‌–1 ఉద్యోగాలకు…

Read More

భాస్కర మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌ల వేదన

సహనం వందే, హైదరాబాద్: మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీ (బీఎంసీ) ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు నెలకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే స్టైపెండ్‌గా చెల్లిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు అందింది. కళాశాల యాజమాన్యం ఇందుకు సంబంధించి 2003 నాటి పాత ప్రభుత్వ ఉత్తర్వును చూపుతూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్‌ఎంసీ గత కొద్ది నెలలుగా తెలంగాణ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు…

Read More

సివిల్స్‌లో మహిళా ‘శక్తి’

సహనం వందే, హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్‌తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్‌గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్‌ పరాగ్‌ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009…

Read More

సూపర్ స్టార్ మహేశ్‌బాబుపై ఈడీ కొరడా

సహనం వందే, హైదరాబాద్: తెలుగు సినీ వినీలాకాశంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందే మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థల ఆర్థిక మోసాల కేసులో ఈ నోటీసులు ఇవ్వడం ఆయన అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు తన స్టార్‌డమ్‌ను ఉపయోగించి, అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఉపకరించారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ సంఘటన…

Read More

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల!

మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారికంగా తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొంటారని…

Read More

పదేళ్ల చిన్నారి మద్యంపై ఉద్యమం

సహనం వందే, ఆగ్రా: పదేళ్ల చిన్నారి ……. కానీ మనసు మాత్రం ఉక్కు సంకల్పం. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో పదేళ్ల వంశిక సికర్వార్ అనే బాలిక చేసిన ఉద్యమం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన గ్రామంలోని మహిళలకు నిత్యం ఇబ్బంది కలిగిస్తున్న ఒక మద్యం దుకాణాన్ని తరలించేలా చేసి… నిజంగానే చిన్నారి పోరాట యోధురాలు అనిపించుకుంది. తాగొచ్చి గొడవ చేసేవారు..‌.కోలారా కలాన్ అనే చిన్న గ్రామంలో ఒక మద్యం దుకాణం ఉండేది. దాని వల్ల ఆ ఊరి మహిళలు…

Read More

జపాన్‌లో తెలంగాణ జాతర!

పెట్టుబడులకు రండి.. రేవంత్ రెడ్డి ఆహ్వానం! సహనం వందే, జపాన్ వరల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుండి మొట్టమొదట పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం…సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా మారుస్తున్నాయని రేవంత్…

Read More

ఐఐటీపై ఆరు’గురి’

సహనం వందే, కోట: ఒకే శిక్షణ కేంద్రంలో కలిసి చదివిన ఆరుగురు స్నేహితులు జేఈఈ మెయిన్స్-2025 పరీక్షలో అపూర్వ విజయాన్ని సాధించారు. రాజస్థాన్‌ కోట కేంద్రంగా వీరంతా సమిష్టిగా చదివి 100 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా కేవలం 24 మంది మాత్రమే సాధించిన 100 పర్సంటైల్‌లో ఈ ఆరుగురు ఉండటం విశేషం. ఈ ఆరుగురి స్నేహబంధం, పట్టుదల, అవిశ్రాంత కృషి ఎందరికో స్ఫూర్తినిచ్చేలా నిలిచింది. ఒకే చోట చదివి లక్ష్యాన్ని ఛేదించి…కోటకు చెందిన అర్ణవ్ సింగ్ (టాప్…

Read More

భార్య చేతిలో మాజీ డీజీపీ హత్య

సహనం వందే, బెంగళూరు: బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర మాజీ పోలీసు బాస్, 1981 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ (68) తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హృదయ విదారక ఘటన హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లోని ఆయన స్వగృహంలో సంభవించింది. పోలీసులు అనుమానిస్తున్న ప్రకారం… ఆయన భార్య పల్లవి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. “నేనే రాక్షసుడిని చంపాను!”పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి…

Read More

అక్షయ తృతీయ… స్వర్ణ లక్ష్మి కటాక్షం

సహనం వందే, హైదరాబాద్: హిందూ పుణ్య సంప్రదాయంలో స్వర్ణాన్ని కొనుగోలు చేయడానికి అత్యంత పవిత్రమైన సమయంగా విలసిల్లే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సంవత్సరంలో ఈ శుభ ఘడియలలో బంగారాన్ని సొంతం చేసుకోవడానికి దివ్యమైన ముహూర్తాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ తేదీలలో కొనుగోలు చేయవచ్చు. ఈనెల 22, 24, 27, 29, 30 తేదీల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ పుణ్య తిథులలో బంగారాన్ని కొనుగోలు చేయడం ఆర్థిక స్థిరత్వానికి, సిరిసంపదల వృద్ధికి శుభ సంకేతంగా…

Read More

పార్లమెంట్ భవనాన్ని మూసేయాలా?

సహనం వందే, ఢిల్లీ: సుప్రీంకోర్టుపైన, ప్రధాన న్యాయమూర్తి పైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటు ఎందుకని ఆయన మండిపడ్డారు‌. భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలని దుబే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి మతపరమైన యుద్ధాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి….

Read More

ఖమ్మంలో 10 ఆసుపత్రుల మూసివేత

సహనం వందే, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి నకిలీ బిల్లులు సమర్పించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం మూసివేశారు. చికిత్సలు చేయకుండానే నిధులు కాజేయడం ఆయా ఆసుపత్రుల అక్రమాలకు పరాకాష్ట. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులను పొందిన కొన్ని ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులు అందాయి. దీంతో రాష్ట్ర వైద్య…

Read More

కేదార్‌నాథ్, బద్రీనాథ్ భక్తులకు శుభవార్త

సహనం వందే, హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లు త్వరలో భక్తుల కోసం తమ తలుపులు తెరుచుకోనున్నాయి. బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కమిటీ తెలిపిన వివరాల ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్ వచ్చే నెల 2వ తేదీన ఉదయం 7 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుస్తారు. అలాగే బద్రీనాథ్ ధామ్ 4న ఉదయం 7 గంటలకు భక్తులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారీగా మంచు కురవడం…

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

కుల వివక్షపై ‘రోహిత్’ కొరడా

సహనం వందే, బెంగళూరు: విద్యా వ్యవస్థలో కుల వివక్షను అరికట్టడానికి ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను గుర్తుచేస్తూ, విద్యా సంస్థల్లో వివక్షను అరికట్టేందుకు ఈ చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కుల వివక్ష…

Read More

ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు

సహనం వందే, నారాయణపేట: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో మానవ సంబంధాలు పూర్తిగా దిగజారిన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణిస్తే కనీసం అంత్యక్రియలకు కూడా రాని కొడుకు, తండ్రికి తామే కొడుకులం అంటూ ముందుకొచ్చిన కూతుళ్ల కథ ఇది. కుమారుడికి ఆస్తి పంచినా తీరని కోపం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిని కుమారుడు, కుమార్తెలకు పంచారు. కుమారుడు గిరీష్‌కు 15 ఎకరాల…

Read More

ఊర్వశి రౌటేలాకు ఆలయం!

సహనం వందే, హైదరాబాద్: నటి ఊర్వశి రౌటేలా తన పేరుతో ఉత్తరాఖండ్‌లో ఆలయం ఉందని చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒక ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలా మాట్లాడుతూ, ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఒక ఆలయం ఉందని చెప్పారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు ఇది గొప్ప నిదర్శనమని ఆమె అన్నారు. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో, దాని వివరాలేంటో చెప్పకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆలయంలో ఆన్‌లైన్ బుకింగ్ ఎప్పుడు? ఊర్వశి వ్యాఖ్యలు…

Read More

కైలాష్ కి గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్: కైలాష్ మానసరోవర్ యాత్ర కోసం ఎదురుచూస్తున్న భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020 నుంచి నిలిచిపోయిన ఈ పవిత్ర యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. త్వరలో కైలాష్ కు ప్రయాణం! హిందూ, బౌద్ధ, జైన మతాల వారికి ఎంతో పవిత్రమైన కైలాష్ పర్వతం, మానస సరోవర్ సరస్సులను దర్శించుకునే అవకాశం మళ్లీ రానుంది. ఈ ఏడాది…

Read More

స్మితా సబర్వాల్‌కు కంచె గచ్చిబౌలి ఎఫెక్ట్

పోలీసుల నోటీసులు సహనం వందే, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వైరల్ అయిన కొన్ని నకిలీ ఫోటోలను స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ విషయంపై మరింత విచారణ జరుపుతున్నారు.

Read More

ఉద్యమాలకు గ్లామర్

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఆధునిక ఉద్యమాలకు కొత్త దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, విద్యార్థులు, మేధావులు, సినీ తారలు, ప్రజాసంఘాలు ఒక్కటై ఈ భూములను కాపాడారు. ఈ భూములను పునరుద్ధరించాలని బుధవారం తీర్పు ఇవ్వడంతో ఈ ఉద్యమం చారిత్రక విజయాన్ని సాధించింది. అటవీ సంపద కోసం విద్యార్థుల…

Read More

హిందీ హిందువుల భాష… ఉర్దూ ముస్లింల భాష కాదు

సహనం వందే, ఢిల్లీ: హిందీ హిందువుల భాష, ఉర్దూ ముస్లింల భాష అనే భావనను సుప్రీం కోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ నమ్మకం వాస్తవ దూరం అని పేర్కొంటూ, భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఉపయోగపడే సాధనమని, దానికి ఏ మతంతోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బుధవారం ఒక కేసు విచారణ సందర్భంగా చేశారు. భాషలను మతాలతో ముడిపెట్టడం వల్ల సమాజంలో చీలికలు వస్తాయని, భారతదేశం లాంటి…

Read More

న్యూయార్క్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

సహనం వందే, న్యూయార్క్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్ సిటీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఏప్రిల్ 14వ తేదీని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ డేగా న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా ప్రకటించారు. డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా గుర్తించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, న్యూయార్క్…

Read More

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్

1248 నామినేషన్లు సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు భారీ స్పందన లభించింది. ఈ అవార్డుల ఎంపిక కోసం సినీనటి జయసుధ చైర్మన్‌గా జ్యూరీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు జ్యూరీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు. తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జ్యూరీ…

Read More

సూర్యాపేట శరత్ కార్డియాక్ సెంటర్‌లో తనిఖీలు

బయటపడ్డ అక్రమాలు… టీజీఎంసీ నోటీసులు సహనం వందే, సూర్యాపేట సూర్యాపేటలోని శరత్ కార్డియాక్ సెంటర్‌లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కార్డియాక్ సెంటర్‌లో జరుగుతున్న పలుఅక్రమాలు బయటపడ్డాయి. తనిఖీల్లో డాక్టర్లు తమ సర్టిఫికెట్లను అమ్ముకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన గుండె డాక్టర్ లేకుండానే టెక్నీషియన్ స్కాన్ చేసి డాక్టర్ పేరు మీద రిపోర్ట్ ఇస్తున్నట్టు తేలింది. ప్రశాంత్ అనే పేషెంట్‌కు వనం శరత్ చంద్ర అనే…

Read More

కోవిడ్ తర్వాత పుంజుకున్న విమానయానం

సహనం వందే, న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగేళ్లపాటు భారీగా పడిపోయిన విమాన ప్రయాణాలు… గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకున్నాయి. 2024లో ప్రపంచ వైమానిక ప్రయాణికుల సంఖ్య 2019 స్థాయిలను అధిగమించినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం… 2024లో మొత్తం ప్రయాణికుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరుకుంది, ఇది 2019లో నమోదైన 4.5 బిలియన్ల కంటే ఎక్కువ. నాలుగేళ్లు దెబ్బ తిన్న విమానరంగం… 2020లో కోవిడ్ కారణంగా విమాన…

Read More

వనజీవి రామయ్య కన్నుమూత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామయ్య, తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. ఒంటరిగా కోటికి పైగా మొక్కలు…

Read More

సిద్ధు కామెడీ ఉన్నా.. కథలో ‘క్రాక్’ మిస్!

‘జాక్’ రివ్యూ: సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్:సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “జాక్ – కొంచెం క్రాక్” చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. “టిల్లు స్క్వేర్” వంటి హిట్ తర్వాత సిద్ధు నుండి వచ్చిన ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా కథాబలం లేకపోవడం వల్ల నిరాశపరిచిందని టాక్ వినిపిస్తోంది. సినిమా కథ విషయానికొస్తే…జాక్ అనే తెలివైన హ్యాకర్ రా ఏజెంట్ కావాలని…

Read More

జేఈఈ కటాఫ్‌ తగ్గే ఛాన్స్‌

సహనం వందే, హైదరాబాద్:జేఈఈ మెయిన్‌–2025లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్‌ కొంత తగ్గే అవకాశం ఉంది. 2024లో జేఈఈ మెయిన్స్‌లో పర్సంటైల్‌ 94 ఉండగా, ఈసారి అది 92 ఉండొచ్చని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన రెండు సెషన్లలోనూ ప్రశ్నలు గతం కంటే కొద్దిగా కష్టతరంగా ఉండటమే దీనికి కారణం. దేశవ్యాప్తంగా రెండు సెషన్లలో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ప్రవేశ పరీక్షలు ఈ మంగళవారం ముగిశాయి. దాదాపు 12 లక్షల…

Read More

సినీనటి దియామీర్జాపై యాక్షన్

సహనం వందే, హైదరాబాద్:కంచ గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు సంబంధించిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా తయారు చేసిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ వివాదంలో సినీ నటి దియా మీర్జా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐతో రచ్చ రచ్చ…హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులు…

Read More

ప్రయాగ్‌రాజ్‌లో దర్గా ఎక్కి జైశ్రీరామ్ నినాదాలు

సహనం వందే, ప్రయాగ్‌రాజ్:ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రామ నవమి ఉత్సవాల సందర్భంగా ఆదివారం హిందుత్వ సంస్థల సభ్యులు సికంద్రా ప్రాంతంలోని సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ మియాన్ దర్గాపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. వీడియోలో హిందుత్వ కార్యకర్తలు కాషాయ జెండాలను పట్టుకుని దర్గాపైకి ఎక్కుతూ జై శ్రీ రామ్ నినాదాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానిక…

Read More

బండి సంజయ్ ఖబర్దార్!

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ప్రధానిని ఒప్పించే దమ్ము బండి సంజయ్ కి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని ఆయన విమర్శించారు. ఈ మేరకు…

Read More

మజ్జిగ తాగండి… ఆశీర్వదించండి

సహనం వందే, రాజేంద్రనగర్:మజ్జిగ తాగండి… తనను ఆశీర్వదించండి అంటూ ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దురెడ్డి కందకట్ల పిలుపునిచ్చారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం శంషాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఆయన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దురెడ్డి మాట్లాడుతూ… వేసవికాలంలో కొందరు నీళ్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో…

Read More

భార్యకు తలాక్ చెప్పి.. ఇంట్లో నుంచి గెంటేసి

సహనం వందే, రాజేంద్రనగర్:విడాకులు ఇస్తున్నా అంటూ ఓ వ్యక్తి తన భార్యకు తలాక్ తలాక్ అని మూడుసార్లు చెప్పాడు. అనంతరం భార్యపిల్లలను చితకబాదాడు. ఆపై వారిని ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురం కింగ్స్ కాలనీ లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్ వహీద్ కింగ్స్ కాలనీలో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వీరు గొడవ…

Read More

కంచ గచ్చిబౌలి భూములపై ‘ఏఐ’ రచ్చ

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో కృత్రిమంగా వివాదం సృష్టించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు ఏఐని ఉపయోగించి సృష్టించిన తప్పుడు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైందని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవాలు వెల్లడించే లోపే అబద్ధాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అభిప్రాయపడుతుంది. నెమళ్లు ఏడుస్తున్నట్లుగా ఆడియోలు,…

Read More

పిఠాపురంలో ఫైట్

సహనం వందే, పిఠాపురం:జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఇటీవల పిఠాపురం పర్యటనలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. కుమారపురంలో జరిగిన ఈ సంఘటనలో వర్మ వర్గీయులు నాగబాబును చుట్టుముట్టి “జై వర్మ” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ వర్మల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణలను మరోసారి ఉద్ధృతం చేసింది. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

Read More

విత్తనం రైతు హక్కు

   ప్రభుత్వానికి రైతు కమిషన్ స్పష్టీకరణ – ములుగు ఘటన నేపథ్యంలో నివేదిక – వ్యవసాయశాఖను వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా మార్చాలని సూచన సహనం వందే, హైదరాబాద్: విత్తనం రైతు హక్కు అని, దానిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేఖ రూపంలో రైతు కమిషన్ నివేదికను అందించింది. విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు…

Read More

హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ పంజా

   వేల కోళ్లు మృతి… ప్రజల్లో భయాందోళనలు – నర్సరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో మృతితో అప్రమత్తం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పౌల్ట్రీ ఫార్మ్‌లో వేల కోళ్లు చనిపోవడంతో ల్యాబ్ పరీక్షలు నిర్వహించగా, బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, కోడిగుడ్లు, చికెన్ విక్రయాలను నిషేధించారు. ఈ విషయం తెలియడంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళనలో ఉండగా,…

Read More

ఏడు లక్షలు దాటిన యువ వికాసం దరఖాస్తులు

బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు సహనం వందే, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో 7 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లయ్యబట్టు తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించాలనుకున్న యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు…

Read More

ముంచెత్తిన వాన…!

   అకాల వర్షం… నగరం జలమయం…! – రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు – గ్రేటర్‌ పరిధిలో కుండపోత వాన… చెరువులను తలపించిన రోడ్లు సహనం అంతే, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావతమై క్రమంగా జల్లులతో మెదలైన వాన… ఆ తర్వాత తీవ్రత పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత…

Read More

ఎల్2-ఎంపురాన్ లో గుజరాత్ అల్లర్లు కట్

– ఈరోజు నుంచి కొత్త వెర్షన్ సహనం వందే, సినిమా బ్యూరో: థియేటర్లలో మలయాళ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఎల్2: ఎంపురాన్ తెలుగు వెర్షన్‌లో 24 కత్తిరింపులు చేసినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత నెల 27న విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాలపై విమర్శలు రావడంతో మార్పులతో కూడిన కొత్త వెర్షన్‌ను ఈరోజు నుంచి…

Read More

ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

సహనం వందే, హైదరాబాద్:శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చాల‌ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్ప‌టిలాగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయశాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివ‌రీ చేసే కార్యానికి సంస్థ‌ శ్రీకారం చుట్టింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల‌తో పాటు సంస్థ వెబ్‌సైట్ tgsrtclogistics.co.inలో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు…

Read More