సన్‌రైజర్స్ విజయం

– రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు…

Read More

డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం

 కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నిజస్వరూపం బహిర్గతం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి…

Read More

వడగళ్ల వర్షంతో 11 వేల ఎకరాల్లో పంట నష్టం

– వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వెల్లడి సహనం వందే, హైదరాబాద్: రెండు రోజులుగా తెలంగాణలో వడగళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల తెలంగాణలో 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఏకకాలంలో రుణమాఫీ చేశాం… ఆర్థిక అస్తవ్యస్తత ఉన్నప్పటికీ, రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ….

Read More

భద్రాచలం శ్రీరామనవమికి సీఎంకు ఆహ్వానం

సహనం వందే, హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను ఆదివారం కలిసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా ఆహ్వానం అందించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్…

Read More

దక్షిణాదిపై ఢిల్లీ కుట్ర…

  డీలిమిటేషన్ పేరుతో పెను విధ్వంసం.. – చెన్నైలో కేటీఆర్ సంచలన ఆరోపణలు! సహనం వందే, హైదరాబాద్ చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఢిల్లీ కుట్ర పన్నుతోందని, ఇది కేవలం పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితం కాదని, ఆర్థిక విధ్వంసానికి కూడా దారితీస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం…

Read More

రైతులకు 24 గంటల్లోనే నగదు జమ: మంత్రి నాదెండ్ల మనోహర్

సహనం వందే, గుంటూరు ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని, ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి…

Read More

రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’

ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం సహనం వందే, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ‘దావత్ ఏ ఇఫ్తార్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు నిధుల…

Read More

వాకింగ్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం – అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీ మృతి

సహనం వందే, హైదరాబాద్ హైదరాబాద్: డిజిపి కార్యాలయంలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.ఎం. నందీశ్వర బాబ్జీ శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం 4:40 గంటల సమయంలో హనుమాన్ ఆలయం సమీపంలోని లక్ష్మారెడ్డి పల్లెంలో నందీశ్వర బాబ్జీ నడకకు వెళ్లి రోడ్డు దాటుతుండగా, అబ్దుల్లాపూర్‌మెట్ నుండి హయత్ నగర్ వైపు వేగంగా వస్తున్న…

Read More

జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు – న్యాయవ్యవస్థలో సంచలనం!

సహనం వందే, హైదరాబాద్: జస్టిస్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూడడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో హోలీ పండుగ రోజున జరిగిన అగ్నిప్రమాదం న్యాయవ్యవస్థను కుదిపేసింది. మంటలార్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు కట్టలు లభ్యమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయమూర్తి ఇంట్లో బయటపడిన ఈ నగదు వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి చేరడంతో,…

Read More

వ్యవసాయానికి అత్యాధునిక సాంకేతికత – జర్మన్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో జర్మనీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫెడరల్ మినిస్ట్రీ ఏషియా హెడ్ రెబెకా రిడ్డర్ ఆధ్వర్యంలోని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు 55 నుండి 60 శాతం వరకు ఉన్నారని,…

Read More