మార్మోగిన ఔట్ సోర్సింగ్ గళం – మహా ధర్నా సక్సెస్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఉద్యోగ భద్రత, సమాన వేతనం కోసం పోరాడుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గళం శనివారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మార్మోగింది. రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చి తమ ఐక్యతను చాటారు. ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమాన వేతనం రాజ్యాంగ హక్కు:…

Read More

తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివ(క)క్ష

సహనం వందే, హైదరాబాద్:ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవమాన భారం మోస్తున్నారు. జీతం తక్కువ… ఛీత్కారాలు ఎక్కువ. నిబద్ధతతో సేవ చేస్తున్నప్పటికీ అవమానంతో మనుగడ సాగిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా… కనీసం విచారణ, నోటీసు లేకుండా ఒక సాధారణ ఫోన్ కాల్ ద్వారా తొలగిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు లేదు. వీరి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధుల్లో 25-30% ఏజెన్సీలు తినేస్తున్నాయి. తెలంగాణలో రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సరైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలను నెట్టుకొస్తున్నారు….

Read More

49,000 కోట్ల భారీ స్కామ్‌ – పెరల్ ఆగ్రో టెక్ మోసం

సహనం వందే, లక్నో: దేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇదొకటి.‌ పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఏసీఎల్‌) సంస్థ ఏకంగా రూ. 49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటంతో దేశం యావత్తూ నిర్ఘాంత పోయింది. మధ్యతరగతి ప్రజలను, అనేకమంది చిన్నచిన్న పెట్టుబడిదారులను మోసం చేయడంతో ఆయా వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ప్రజల నుంచి, చిన్నచిన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో శుక్రవారం…

Read More

విద్యార్థుల శారీరక ఫిట్‌నెస్‌ కోసం ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ ’

సహనం వందే, హైదరాబాద్:విద్యార్థుల శారీరక ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్‌సీఈ) ‘యాక్టివ్ సీఐఎస్‌సీఈ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 15వ తేదీ నుంచి అమలయ్యే ఈ కార్యక్రమంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఫిట్‌నెస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఐసీఎస్‌ఈ (10వ తరగతి), ఐఎస్‌సీ (12వ తరగతి) పరీక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి అని సీఐఎస్‌సీఈ రీజనల్ స్పోర్ట్స్…

Read More

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల పోరుబాట -12వ తేదీన మహాధర్నా

సహనం వందే, హైదరాబాద్:తమ సమస్యల పరిష్కారం కోసం ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు గళం విప్పుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఏజెన్సీలు కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాట బాట పట్టారు. ఈ మేరకు శనివారం (12వ తేదీన) హైదరాబాదులోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల నుంచి వందలాదిమంది ఈ ధర్నాకు…

Read More

ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినం – మంత్రివర్గం కీలక నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్:ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఆ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల హాజరుపై కఠినంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు దోహదపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు బుధవారం జరిగిన…

Read More

చంద్రబాబుతో రేవంత్ రె’డ్ఢీ’ – వరద జలాలపై ఆంధ్రప్రదేశ్ వాదన

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వరద…

Read More

యూరియా సకాలంలో సరఫరా చేయాలి – నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి

సహనం వందే, న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర రైతుల అవసరాల కోసం యూరియా సకాలంలో సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనశాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను వివరించారు. రైతుల ఇబ్బందులపై దృష్టి…వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న సమయంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర…

Read More

10 గంటలు ‘మరణ’శాసనం – పని గంటలు పెంచిన కార్మిక ‘వ్యతిరేక’ శాఖ

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పనివేళలను 8 గంటల నుండి 10 గంటలు కు పెంచుతూ తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయంపై కార్మిక, ఉద్యోగ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో తెచ్చిన ఈ కొత్త నిబంధన కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విశ్రాంతితో కలుపుకుని ఏకంగా 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని జారీ చేసిన ఉత్తర్వులు కార్మికులను బానిసలుగా మార్చేస్తాయని…

Read More

తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు?

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు అనగాని, పార్థసారథి, నారాయణతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో కదిలిక వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ…

Read More