
అన్నయ్య వర్సెస్ తమ్ముడు-నాగబాబుకు మంత్రి పదవిపై సందిగ్ధత
సహనం వందే, అమరావతి:నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…