
హైదరాబాదులో మార్వాడీపై దాడి – బీజేపీలో అంతర్గత గొడవలే కారణం
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ…