మెడికోల సస్పెన్షన్లపై ఫైమా ఫైర్ – ఎన్‌ఎంసీకి ఫిర్యాదు

సహనం వందే, న్యూఢిల్లీ:కరీంనగర్‌ చల్మెడ ఆనందరావు ప్రైవేటు మెడికల్ కాలేజీలో స్టైపెండ్ కోసం నిరసన తెలిపిన 64 మంది ఇంటర్న్‌లను సస్పెండ్ చేయడంపై అఖిల భారత వైద్య సంఘాల సమాఖ్య (ఫైమా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఇంటర్న్‌లకు స్టైపెండ్‌లు చెల్లించకపోవడంపై మండిపడింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఛైర్మన్‌కు ఫైమా లేఖ రాసింది. ఈ సమస్యపై తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. స్టైపెండ్ చెల్లింపుల్లో అక్రమాలు…తెలంగాణలో…

Read More

అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ శుక్రవారం జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జర్నలిజంలో 16 ఏళ్ళకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో…

Read More

ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను…

Read More

‘కాంపౌండర్ల వైద్యంతో కాటికే’ – నకిలీ వైద్యులతో ప్రాణాలు హరి

సహనం వందే, రంగారెడ్డి జిల్లా:రంగారెడ్డి జిల్లా షాబాద్, హైతాబాద్ ప్రాంతాల్లో డాక్టర్లుగా చెలామణి అవుతున్న కాంపౌండర్లు, నకిలీ వైద్యుల గుట్టు రట్టైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్, వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బృందం నిర్వహించిన తనిఖీలలో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ ఎయిడ్ బోర్డులు పెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా అల్లోపతి దవాఖానాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను గుర్తించారు. కాంపౌండర్ గా పనిచేసి పెద్ద డాక్టర్లుగా చెప్పుకుంటున్నట్లు…

Read More

’55 ముక్కలుగా నరుకుతా’ – పబ్‌జీ ప్రేమ ఉన్మాదం

సహనం వందే, ఉత్తరప్రదేశ్:ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం హైదరాబాదులో కన్నతల్లిని చంపిన పదో తరగతి కూతురి వ్యవహారాన్ని మరిచిపోక ముందే… పబ్‌జీ ద్వారా ప్రేమలో పడి భర్తను, ఏడాదిన్నర కొడుకును వదిలేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సోషల్ మీడియా మనుషుల మధ్య బంధాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి తాజా ఘటనలు నిదర్శనం. ఒక పబ్‌జీ ప్రేమ వ్యవహారం ఓ వివాహ బంధాన్ని తలకిందులు చేయడమే కాకుండా, హత్య…

Read More

నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కి మంత్రులు -తుమ్మల సమీక్ష

సహనం వందే, సిద్దిపేట:తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పామాయిల్ సాగు, నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రుల బృందం కొహెడ మండలం సముద్రాల గ్రామంలోని కోమురరెడ్డి పామాయిల్ తోటను సందర్శించి సాగు చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం నంగునూరు…

Read More

టీ న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్:ప్రముఖ టీ న్యూస్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్చ ఆత్మహత్య చేసుకుంది. ఆమె రామ్‌నగర్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్చ తన తల్లి శ్రీదేవితో కలిసి నివాసం ఉంటుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More

పదో తరగతిలో ఆవు మెదడు -ఉపాధ్యాయురాలు సస్పెండ్

సహనం వందే, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవు మెదడు ను తీసుకొచ్చి తరగతి గదిలో ప్రదర్శించడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో విద్యార్థులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ఆ ఉపాధ్యాయురాలుని సస్పెండ్ చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యలాల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్స్ ఉపాధ్యాయురాలు ఖాసీమ్ బీ… 10వ తరగతి విద్యార్థులకు మానవ మెదడు…

Read More

పదో తరగతి బాలిక కర్కషత్వం -ప్రియుడి మోజులో పడి తల్లి హత్య

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు కలిసి తల్లి అంజలిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. అయితే ఈ దారుణమైన హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన మృతురాలి చిన్న కుమార్తె ప్రియ… ఈ వ్యవహారంలో వెలుగులోకి తెచ్చిన నిజాలు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి….

Read More

హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంకు జాతీయ అవార్డు

సహనం వందే, న్యూఢిల్లీ:హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్‌పీఓ), తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 2025 ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారుల సమావేశంలో…హైదరాబాద్ ఆర్‌పీఓ చేపట్టిన వినూత్న చర్యలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాల విభాగంలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకుంది. పాస్‌పోర్ట్ ధృవీకరణ, సేవా సౌకర్యాలలో తెలంగాణ పోలీసుల నిరంతర ప్రతిభకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మంగళవారం నాడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి…

Read More