
రాష్ట్ర బడ్జెట్‌పై జాన్ వెస్లీ తీవ్ర విమర్శలు – నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో విద్యా, వైద్య, వ్యవసాయం, గృహనిర్మాణ రంగాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు, ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోకు, ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలకు ఎలాంటి పొంతన లేదని జాన్ వెస్లీ…