తెలంగాణ అభివృద్ధికి సహకారం కావాలి

భారత్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన, పర్యావరణ సమతుల్యతను సాధిస్తూ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శనివారం భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,…

Read More

‘అల్లాహ్’ సందేశంతో సైబర్ దాడి

సహనం వందే, ఢిల్లీ: ‘అల్లాహ్ మాతో ఉన్నాడు… మీ మతం మిమ్మల్ని కాపాడలేదు!’ భారత సైనిక నర్సింగ్ కళాశాల వెబ్‌సైట్‌లో శుక్రవారం హ్యాకర్లు పోస్ట్ చేసిన ఈ బెదిరింపు సందేశం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మన మదిని కలచివేస్తుండగానే ఈ సైబర్ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు కేవలం భౌతికంగానే కాకుండా, డిజిటల్‌గా కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా…

Read More

ఉస్మానియా ప్రిన్సిపల్ గా రాజారావు

సహనం వందే, హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ రాజారావు నియమితులయ్యారు.‌ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా ఆయన పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించారు.

Read More

ఉగ్రదాడిపై ముస్లింల ఆగ్రహజ్వాల

సహనం వందే, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. శుక్రవారం మక్కా మసీదు వద్ద జరిగిన జుమా నమాజ్‌లో పాల్గొన్న ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు. నమాజ్ అనంతరం వారు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ ముర్దాబాద్, హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ…

Read More

కీరవాణీ… హిందువులనే అవమానిస్తావా?

బ్యాన్ చేయాలంటూ డిమాండ్! సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ‘పాడుతా తీయగా’ అనే ఒక సింగింగ్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ప్రవస్తి ఆరాధ్య ఆయనపై బాడీ షేమింగ్ ఆరోపణలు చేయగా, ఇప్పుడు కీరవాణి గతంలో చేసిన ఒక వ్యాఖ్య వైరల్ కావడంతో ఆయనను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలతో దుమారం… ‘పాడుతా తీయగా’ 25వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న ప్రవస్తి ఆరాధ్య,…

Read More

రాహుల్ – హిండెన్‌బర్గ్ ల ఉమ్మడి ఆపరేషన్

సహనం వందే, ఢిల్లీ: ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా ఆధారిత షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌తో చేతులు కలిపి, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుడు సామ్ పిట్రోడా అమెరికాలోని హోమ్ సర్వర్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ కుట్ర బట్టబయలైనట్లు స్పుత్నిక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హిండెన్‌బర్గ్…

Read More

పాకిస్తాన్ గగనతలం మూసివేత

సహనం వందే, ఢిల్లీ: పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానాలకు పూర్తిగా మూసివేయడంతో భారత విమానయాన సంస్థలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య వల్ల భారతీయ విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో వంటివి తమ అంతర్జాతీయ విమాన మార్గాలను మార్చుకోవలసి వస్తోంది. దీని కారణంగా విమాన ప్రయాణ సమయం పెరగడంతో పాటు…

Read More

‘మోదీ అంతర్గత ఉగ్రవాది’

సహనం వందే, విశాఖపట్నం: పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘అంతర్గత ఉగ్రవాది’గా అభివర్ణిస్తూ, దేశ నిఘా వ్యవస్థలను ఆయన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నిఘా వ్యవస్థ పనిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు. మోడీకి పాలించే హక్కు లేదు! కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రత విషయంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై…

Read More

ఫిట్జీ కోచింగ్ సంస్థపై ఈడీ దాడులు

సహనం వందే, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిట్జీ వంటి కార్పొరేట్ కోచింగ్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాటి దాడులు విద్యా రంగంలో పేరుకుపోయిన రాక్షస క్రీడకు అద్దం పడుతున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలోని ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాలు డబ్బు లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో జరగడం కేవలం గమనార్హం. వేల కోట్ల రూపాయల ఫీజులు దండుకుని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఈ విద్యా వ్యాపారుల అసలు…

Read More

దేవుడి చెంత వైద్య ఉద్యోగి దందా

సహనం వందే, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒక సబ్ యూనిట్ ఆఫీసర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన ఆ ఉద్యోగి, డబ్బు వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ అసిస్టెంట్ స్థాయి నుండి ప్రమోషన్ పై సబ్ యూనిట్ ఆఫీసర్ అయిన ఇతను, ప్రైవేట్ ఆస్పత్రులు,…

Read More