‘జీరో’లోనే జీవితం – ఓషో బోధనల వెనుక అసలు రహస్యం
సహనం వందే, హైదరాబాద్: నేడు మనిషి పరుగుల ప్రపంచంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. సమాజం నేర్పిన అహంకారం, అసూయల మధ్య నలిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలు మనిషిని మేల్కొలిపేలా ఉన్నాయి. ఓషో దృష్టిలో అసలైన జీవితం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం ఒక ముసుగు…మనిషి తనలోని లోపాలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహంకారమని ఓషో చెప్పారు. పక్షులు, జంతువులకు అహంకారం ఉండదు. ఇది కేవలం మనిషి సృష్టించుకున్న ఒక జబ్బు. చిన్నప్పటి…