సర్జన్ల భవనానికి సీఎం సహకారం – రేవంత్ రెడ్డిని కోరిన డాక్టర్ బొంగు రమేష్
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సర్జన్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి, యువ వైద్యులకు ప్రపంచస్థాయి శిక్షణ అందించడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మహత్తర ఆశయానికి ప్రభుత్వం నుంచి భూమి సహకారం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించింది. ముఖ్యమంత్రితో భేటీ…అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఎస్ఐ…