Intermittent Fasting

డెత్ డైట్ – ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రాణాంతకం

సహనం వందే, అమెరికా: ఆరోగ్యం కోసం చేసే ఉపవాసం కాస్తా చివరకు ప్రాణాల మీదకు తెస్తోంది. బరువు తగ్గాలని భావించే వారు చేసే అతిపెద్ద పొరపాటు గుండెను బలహీనపరుస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన కొత్త గణాంకాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పేరుతో చేసే ప్రయోగాలు ప్రాణాంతకమని తేలింది. 8 గంటలతో మృత్యువుకు దగ్గరకుఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారు రోజులో కేవలం 8 గంటల లోపే ఆహారం తీసుకుంటారు. మిగిలిన 16 గంటలు ఖాళీ…

Read More
Epstein Files.. Rahul Fires..

ఎప్‌స్టీన్ ఫైల్స్… రాహుల్ ఫైర్స్… సమ్మిట్ షేక్స్

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రతినిధులు కొలువుదీరిన వేళ… ఏఐ సదస్సులో మేధోమధనం సాగుతున్న వేళ.. అనూహ్యంగా ఎప్‌స్టీన్ పేరు ఢిల్లీ వీధుల్లో దద్దరిల్లింది. కేవలం రాజకీయ నిరసనగా మొదలై అంతర్జాతీయ కుట్రల కోణంలోకి మళ్లిన ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి నినాదాల వెనుక దాగున్న వాస్తవాలను వెలికితీస్తామంటూ యూత్ కాంగ్రెస్ చేసిన ఈ అలజడి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. తెరపైకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్భారత్ మండపంలోని హాల్ నంబర్ 5…

Read More
Women at Afghanistan

మహిళలకు ‘బానిస’ హోదా – ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల చీకటి సామ్రాజ్యం

సహనం వందే, ఆఫ్ఘనిస్తాన్‌: ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు ఒక చీకటి సామ్రాజ్యంగా మారుస్తున్నారు. కొత్తగా విడుదల చేసిన 90 పేజీల శిక్షాస్మృతి మానవ నాగరికతకే సవాల్ విసురుతోంది. మహిళలను కేవలం భర్తల ఆస్తిగా, బానిసలుగా పరిగణిస్తూ వారికి చట్టబద్ధంగా హింసించే అధికారాన్ని కట్టబెట్టారు. అంతర్జాతీయ వేదికలపై ఈ చట్టం ఇప్పుడు ఒక తీవ్రమైన మానవ హక్కుల నేరంగా చర్చకు దారితీస్తోంది. అఖుంజాదా క్రూర శాసనంతాలిబన్ల అగ్రనేత హిబతుల్లా అఖుంజాదా ఈ నిరంకుశ చట్టంపై సంతకం చేశారు. దే…

Read More
Ramjan

రంజాన్ రెండుసార్లు – 2030లో అరుదైన వింత ఆవిష్కరణ

సహనం వందే, హైదరాబాద్: ఖగోళ గమనంలో చోటుచేసుకోనున్న ఒక అరుదైన వింత ఇప్పుడు ముస్లిం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే 2030 సంవత్సరంలో ముస్లింలు ఒకే ఏడాదిలో రెండుసార్లు రంజాన్ ఉపవాసాలు ఉండబోతున్నారు. సుమారు 33 ఏళ్లకు ఒకసారి మాత్రమే సంభవించే ఈ అద్భుతం ఇస్లామిక్ క్యాలెండర్, సౌర క్యాలెండర్ల మధ్య ఉండే తేడా వల్ల సాధ్యం కానుంది. ఏడాదికి రెండు రంజాన్లుసాధారణంగా ఏడాదికి ఒకసారి వచ్చే రంజాన్ 2030లో మాత్రం రెండుసార్లు పలకరించనుంది. మొదటి రంజాన్…

Read More
Digital Msgs from Dead Bodies

సమాధుల నుండి సందేశాలు – మనిషి, ఆత్మల అనుసంధానం

సహనం వందే, హైదరాబాద్: ఏఐ యుగంలో మరణం ఇక అంతిమ సత్యం కాదు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ మనిషి భౌతిక ఉనికి ముగిసినా… వారి డిజిటల్ ఉనికిని శాశ్వతం చేసే వింతైన సాంకేతికతను సిద్ధం చేస్తోంది. ఏఐ సాయంతో వారి జ్ఞాపకాలను… వారి సంభాషణలను ఒక వ్యాపార వస్తువుగా మార్చే ఈ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నైతిక, మానవ హక్కుల చర్చను రేకెత్తిస్తోంది. ఫేస్‌బుక్ ఖాతా కంటిన్యూ…మనిషి హృదయ స్పందన ఆగిపోయినా ఫేస్‌బుక్ ఖాతా…

Read More
Tech Student - Old Branded clothing business

టెక్ విద్యార్థి పాత బట్టల వ్యాపారి – 22 ఏళ్ల యువకుడి సృజనాత్మక బిజినెస్

సహనం వందే, లండన్: గ్లాస్గో నగరపు వీధుల్లో ఒక 22 ఏళ్ల యువకుడు పాత బట్టల మూటలతో కనిపించినప్పుడు అందరూ పెదవి విరిచారు. ఇంజనీరింగ్ చదువు మానేసి పాత జీన్స్ ప్యాంట్లు ఏరుకోవడమేంటని ఈసడించుకున్నారు. కానీ అదే పాత బట్టలు నేడు అతనికి నెలకు 7 లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో వస్తున్న ఈ పెను మార్పును స్కాట్ అట్కిన్స్ ముందే పసిగట్టాడు. ఇది కేవలం ఒక కుర్రాడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు,…

Read More
Face transplantation

‘ఫేస్’ కాపీ పేస్ట్ – ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ముఖమార్పిడి

సహనం వందే, న్యూఢిల్లీ: ముఖంపై యాసిడ్ పడినా… తుపాకీ గుండు దూసుకెళ్లినా లేదా అగ్నిప్రమాదంలో రూపం ఛిద్రమైనా ఇకపై చింతించాల్సిన పనిలేదు. పాత ముఖాన్ని తీసేసి మరో వ్యక్తి ముఖాన్ని అమర్చే అత్యంత సంక్లిష్టమైన ముఖ మార్పిడి (ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్సకు ఎయిమ్స్ ఢిల్లీ సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పాత ముఖం పోతుందా?ముఖం మార్పిడి కోసం ఎయిమ్స్ అనుమతులు పొందింది. రాబోయే ఏడాది లోపు మొదటి ముఖ…

Read More
Winter Olympics at Italy

యుద్ధ నివాళిపై ఒలింపిక్స్‌ వివక్ష – ఇటలీ వింటర్ ఆటల్లో మంటలు

సహనం వందే, ఉక్రెయిన్: ఇటలీలో జరుగుతున్న శీతాకాల ఒలింపిక్స్‌ లో మానవత్వం కంటే నిబంధనలే మిన్న అని క్రీడల నిర్వాహకులు మరోసారి నిరూపించారు. రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన క్రీడాకారుల చిత్రాలను హెల్మెట్‌పై ధరించినందుకు ఉక్రెయిన్ అథ్లెట్ వ్లాడిస్లావ్ హెరాస్కెవిచ్‌పై వేటు వేశారు. ఇది కేవలం అనర్హత కాదు… దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల స్మృతిపై జరిగిన దాడి. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదనే సాకుతో పాలకుల అమానవీయత బట్టబయలైంది. హెల్మెట్‌పై అమరుల నివాళిఉక్రెయిన్ స్కెలిటన్ అథ్లెట్ వ్లాడిస్లావ్…

Read More
Durai

గోల్డ్‌ ‘మెన్‌’కు కలిశెట్టి గ్రాండ్ సెల్యూట్

సహనం వందే, న్యూఢిల్లీ: కటిక పేదరికంలోనూ కల్మషం లేని గుణం ఆయన సొంతం. కళ్లముందు లక్షల విలువైన గోల్డ్‌ మెరుస్తున్నా ఆశపడని నిబ్బరం ఆయన శ్వాస. కొడుకు ప్రాణం కంటే నిజాయితీనే మిన్నగా భావించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వార్థం నిండిన లోకంలో మానవత్వపు వెలుగులు విరజిమ్ముతూ దురై సరికొత్త చరిత్రను లిఖించి అందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు. కుబేర మనసు…తమిళనాడు తిరుప్పూరుకు చెందిన దురై నిత్యం చెత్తతో సహవాసం చేస్తాడు. విధుల్లో…

Read More
Moon City - Elon Musk

చంద్రుడిపై నగరం – ప్రపంచ కుబేరుడు మస్క్ సంచలన నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: అంగారకుడిపై జెండా పాతాలని కలలు గన్న ఎలన్ మస్క్ ఇప్పుడు తన రూటు మార్చారు. అనంత విశ్వంలో అంగారక గ్రహం కంటే చంద్రుడే మనకు అత్యంత ఆప్తమిత్రుడని గ్రహించిన ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు… మానవ నాగరికత భవిష్యత్తును మార్చే బలమైన అడుగు. అంగారకుడు వద్దు.. చందమామే ముద్దుఅంగారక గ్రహంపై నగరాలను నిర్మించాలన్న మస్క్ కల ఇప్పుడు చంద్రుడి వైపు మళ్లింది….

Read More
AI waste - Stanford University

సొంత తెలివే అసలైన ఆస్తి – ఏఐతో మెదడు మొద్దుబారు

సహనం వందే, హైదరాబాద్: డిగ్రీ చేతికి రావాలంటే కంప్యూటర్ ముందు కూర్చుని చాట్ జీపీటీని అడిగితే చాలు. అసైన్మెంట్లు నుంచి ప్రాజెక్టుల వరకు అన్నీ నిమిషాల్లో సిద్ధం. కానీ ఈ సులభమైన దారి తన మేధస్సును మొద్దుబారుస్తుందని ఆ విద్యార్థిని గుర్తించింది. ప్రపంచం అంతా కృత్రిమ మేధ వెంట పరుగులు తీస్తుంటే ఆమె మాత్రం తన సొంత ఆలోచనలకే పదును పెట్టింది. ఆ విజ్ఞాన ప్రయాణమే ఈ కథనం. సులభమైన దారి వద్దే వద్దుస్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంటే…

Read More
Modi Trump n farmer

అగ్రరాజ్యంపై అన్నదాత ఆగ్రహజ్వాల – 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

సహనం వందే, న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డీల్ వల్ల భారత వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గిందని ఆరోపిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ ఒప్పందంపై అటు విపక్షాలు, ఇటు అన్నదాత ముక్తకంఠంతో యుద్ధం ప్రకటిస్తున్నారు. నిరసన జ్వాలలు మొదలు…ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల…

Read More
Phone Usage in India

ఫోన్లపై లక్ష కోట్ల గంటలు – 2024లో ఇండియన్ల ఫోన్ వాడకం

సహనం వందే, న్యూఢిల్లీ: చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు… మన దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం. ఘజియాబాద్ ఘోరం…ఘజియాబాదులో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఒకేసారి బిల్డింగ్…

Read More
AI Agents - Malt Book

మనపై చాడీలు చెప్పే ‘ఏఐ’ – ఏఐ బాట్లకు సొంత సోషల్ మీడియా అడ్డా

సహనం వందే, హైదరాబాద్: మాల్ట్ బుక్ అనేది మనుషుల కోసం కాకుండా కేవలం కంప్యూటర్ ప్రోగ్రామ్స్ (ఏఐ బాట్లు) మాట్లాడుకోవడానికి సృష్టించిన ఒక వింత వెబ్ సైట్. మన ఇంట్లో ఉండే పనిమనుషులు ఖాళీ సమయంలో ఒకచోట చేరి తమ యజమానుల గురించి ఎలా సొల్లు ముచ్చట్లు పెట్టుకుంటారో ఈ బాట్లు కూడా మాల్ట్ బుక్ లో తమ యజమానుల గురించి, వారి పనుల గురించి మాట్లాడుకుంటాయి. అయితే ఈ వెబ్ సైట్ లో భద్రత లేకపోవడంతో…

Read More
Telugu States Politics

రేవంత్ పంతం… నారా వారి కన్నెర్ర – తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సెగలు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కక్ష సాధింపులు మాత్రం పీక్స్‌కు వెళ్లాయి. అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు… ఇటు ఏపీలో వరుస కేసులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. సమస్యలను గాలికొదిలేసి ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు సామాన్య ప్రజల్లో కొత్త చర్చకు తెరలేపింది. తెలంగాణలో ట్యాపింగ్ గుబులుతెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఫోన్ ట్యాపింగ్…

Read More
Bag Gift - Shift to Jail South Korea

బ్యాగ్ గిఫ్ట్… జైలుకు షిఫ్ట్ – దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి భార్యకి జైలు శిక్ష

సహనం వందే, హైదరాబాద్: విలాసవంతమైన జీవితంపై ఉన్న వ్యామోహం ఒక దేశ ప్రథమ మహిళను కటకటాల వెనుకకు నెట్టింది. డిజైనర్ హ్యాండ్ బ్యాగులు, వజ్రాల నెక్లెస్ వంటి ఖరీదైన బహుమతుల మోజులో పడి దక్షిణ కొరియా మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియాన్ హీ తన పదవిని పోగొట్టుకోవడమే కాకుండా జైలు శిక్షకు గురయ్యారు. అధికార గర్వంతో సాగించిన అవినీతి లీలలు ఇప్పుడు ఆమెను కోర్టు బోనులో నిలబెట్టాయి. కోర్టు సంచలన తీర్పుదక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు…

Read More
WhatsAPP Cheating Secret Reading

వాట్సాప్ ‘చీ’టింగ్… సీక్రెట్ రీడింగ్ – ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా మోసం

సహనం వందే, అమెరికా: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు పెద్ద బాంబు పేలింది. మీ మెసేజ్ లను ఎవరూ చదవలేరన్న మాట అబద్ధమని… మెటా సంస్థ వాటిని రహస్యంగా చూస్తోందని అమెరికా కోర్టులో దావా పడింది. టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ లీకేజీ వ్యవహారం ఇప్పుడు ప్రతి యూజర్ లోనూ వణుకు పుట్టిస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ వివరాలు ఇవే. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంతా ఉత్తదేవాట్సాప్ లో మెసేజ్ పంపేటప్పుడు…

Read More
NASA Research

నీటి హిస్టరీ… వీడింది మిస్టరీ – నివ్వెర పరుస్తున్న నాసా అధ్యయనం

సహనం వందే, అమెరికా: అనంత విశ్వంలో భూమిపై మాత్రమే నీరు ఎలా వచ్చింది? మన సముద్రాలు ఎలా నిండాయి? ఈ ప్రశ్నలకు వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు. తాజాగా నాసా చేపట్టిన అధ్యయనంలో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. కోట్ల ఏళ్ల కిందట అంతరిక్షం నుంచి కురిసిన గ్రహశకలాల వర్షమే భూమిని జలమయంగా మార్చిందని… తద్వారా జీవం పుట్టుకకు పునాది పడిందని పరిశోధకులు విశ్లేషించారు. అంతరిక్షం నుంచి ఆగమనంపుట్టిన కొత్తలో భూమి కేవలం అగ్నిగోళంలా ఉండేది….

Read More
Education -- Student suicides

శవపేటికల్లో చదువులు – దేశంలో ఆగని విద్యార్థుల ఆత్మహత్యలు

సహనం వందే, న్యూఢిల్లీ: కన్నవారి కలలను నిజం చేయాల్సిన చేతులు కాటికి చేరుతున్నాయి. బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ చదువులు కోసం క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులు.. విగతజీవులుగా మారుతున్నారు. చదువుల ఒత్తిడి ఒకవైపు.. ఉద్యోగం దొరకదన్న బెంగ మరోవైపు యువతను చిదిమేస్తోంది. ఇది కేవలం మరణాల సంఖ్య కాదు.. కొన్ని వేల కుటుంబాల విషాదం. కాన్పూర్ ఐఐటీలో విషాదందేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా పేరొందిన కాన్పూర్ ఐఐటీలో తాజాగా జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. 25 ఏళ్ల స్వరూప్ ఈశ్వరం…

Read More
America Vs Europe

అమెరికాపై ‘యూరప్పా’రప్పా – ట్రంప్ అస్త్రానికి మించి యూరప్ బ్రహ్మాస్త్రం!

సహనం వందే, యూరప్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ కొనుగోలుపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. తన మాట వినకపోతే ఐరోపా దేశాలపై సుంకాల బాదుడు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు బెదరకుండా యూరప్ తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీస్తోంది. ఆయుధం పేరు యాంటీ కోయర్షన్యాంటీ కోయర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఒక దేశం తన రాజకీయ ప్రయోజనాల కోసం మరో దేశంపై ఆర్థికంగా…

Read More
Middle class income

మధ్యతరగతికి మహాయోగం – 2030 నాటికి హై మిడిల్ క్లాస్ దేశంగా భారత్

సహనం వందే, హైదరాబాద్: పేదరికం నీడల నుంచి బయటపడి ప్రపంచ యవనికపై భారత్ సగర్వంగా నిలబడబోతోంది. ఒకప్పుడు తిండికి తిప్పలు పడ్డ దేశం.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రథాన్ని నడిపే స్థాయికి చేరుతోంది. ఇది కేవలం అంకెలు చెప్పే లెక్క కాదు… ప్రతి భారతీయుడి తలరాత మారబోతోందన్న నమ్మకం. మన కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మధ్యతరగతికి మంచి రోజులు రానున్నాయి. పెరగనున్న ఆదాయంప్రతి భారతీయుడి సగటు వార్షిక ఆదాయం భారీగా పెరగనుంది. రాబోయే…

Read More
కొలువులు చూపని చదువులు

కొలువులు చూపని చదువులు – పట్టాలకే పరిమితమవుతున్న ఉన్నత విద్య

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డిగ్రీ పట్టాలు గంపలకొద్దీ వస్తున్నాయి. కానీ ఆ పట్టాలకు తగ్గ కొలువులు మాత్రం దొరకడం లేదు. లక్షల రూపాయలు పోసి చదువుతున్నా ఉద్యోగం రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలు కేవలం డిగ్రీలను ఇచ్చే ఫ్యాక్టరీలుగా మారుతున్నాయే తప్ప నిపుణులను తయారుచేసే కేంద్రాలుగా రాణించడం లేదు. విద్యా వ్యవస్థలో లోపాలను ఈ నివేదిక ఎండగట్టింది. అగాధంలో విద్యా వ్యవస్థభారతదేశంలోని 75 శాతం ఉన్నత విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో…

Read More
US Panel Report - Hindu Phobic

మత స్వేచ్ఛకు మరణశాసనం – భారత్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం!

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన…

Read More
Tarang Health Alliance - ​మన చదువు... మన ఆరోగ్యం!

​మన చదువు… మన ఆరోగ్యం – పాఠశాలల్లో ఆరోగ్య విద్య తప్పనిసరి

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుంది. అందుకే పిల్లలకు పాఠాలతో పాటు పరిపూర్ణ ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలని యునెస్కో గ్లోబల్ హెల్త్ చైర్ ప్రతినిధి డాక్టర్ రాహుల్ మెహ్రా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరాలంటే విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం చాలా ముఖ్యం. ఇందుకోసం తెలంగాణలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆరోగ్య విద్యా ప్రణాళికను అమలు చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల…

Read More
Street Dogs Murder

కుక్కల సంహారం… గ్రామాల్లో గందరగోళం – తెలంగాణలో 500 కుక్కలు హతం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కుక్కల సంహారం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కుక్కల వేట మొదలుపెట్టారు. వీధి కుక్కల బెడద తీరుస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రక్తం చిందించారు. మూగజీవాలను రాక్షసంగా అంతమొందించారు. కుక్కలను విషపు ఇంజక్షన్లతో చంపేసి గుంతల్లో పాతేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దాన్ని ఇండియా టుడే మీడియా వెలుగులోకి తెచ్చింది. హామీ తీరింది… ప్రాణం పోయిందితెలంగాణలోని కామారెడ్డి,…

Read More
OS Group Founder Oscar 24 Years Young Entrepreneur

24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం

సహనం వందే, హైదరాబాద్: వ్యాపారవేత్త కావడానికి అనుభవం కంటే ఆలోచన ముఖ్యమని నిరూపించాడు 24 ఏళ్ల అమెరికా యువకుడు ఆస్కార్ రాచ్‌మాన్స్కీ. అందరూ చదువుల వెంట పడుతుంటే తను మాత్రం స్పోర్ట్స్ షూస్ అమ్మకాలతో కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కేవలం ఐదేళ్ల క్రితం ఒక చిన్న గదిలో మొదలైన తన ప్రయాణం.. నేడు ఏటా వందల కోట్ల ఆదాయం గడించే స్థాయికి చేరింది. యువతకు ఇదొక స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ. అమెరికా కుర్రాడి అద్భుత ప్రయాణంన్యూజెర్సీకి…

Read More
Trump Questions Electronic voting

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

సహనం వందే, అమెరికా: అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు…

Read More
Like Numbers life

అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ

సహనం వందే, హైదరాబాద్: మనం ఆడే ఆటలో స్కోరు పెరిగితే వచ్చే కిక్కే వేరు. ఆ అంకెలు మనల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ అదే అంకెలు మన నిజ జీవితాన్ని శాసిస్తే? లైకులు రాలేదని బాధపడటం… మార్కులు తగ్గితే కుంగిపోవడం… ఇదంతా ఒక అదృశ్య జైలు. తత్వవేత్త సి థిన్గుయెన్ చెబుతున్న ఈ అంకెల మాయాజాలం గురించి చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఆటల్లో స్కోరు బోర్డు ఇస్తుంది గెలుపు కిక్కు…మీరు డన్జియన్స్ అండ్ డ్రాగన్స్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు…..

Read More
Vizianagaram MP Kalisetti Appalanaidu

విజయనగరం స్పీడు… కలిశెట్టి జోరు! – 18 నెలల్లోనే మారిన జిల్లా ముఖచిత్రం

సహనం వందే, విజయనగరం: విజయనగరం జిల్లా అభివృద్ధి బాటలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 18 నెలల కాలంలోనే జిల్లా రూపురేఖలు మారిపోయాయి. పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యుల సమన్వయంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కాయి. ఢిల్లీ నుంచి అమరావతి వరకు కలిశెట్టి చేస్తున్న నిరంతర కృషి నేడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కనిపిస్తున్న మార్పు ఇదీ. భోగాపురం విమానాశ్రయం గ్రోత్ ఇంజిన్నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పుడు…

Read More
No Non Veg at Ayodhya

రామనామం శాఖాహారం – అయోధ్య రూట్.. నాన్ వెజ్ ఔట్!

సహనం వందే, అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య ధామ్, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించింది. కేవలం దుకాణాలకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా జరిగే డెలివరీలను కూడా అడ్డుకుంటూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్రతకు పెద్దపీట…అయోధ్య నగరం ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని…

Read More
Maduro

వెనిజులా గుండెల్లో మండుతున్న మదురో – దేశవ్యాప్తంగా అమెరికాపై ఆగ్రహజ్వాలలు

సహనం వందే, వెనిజులా: వెనిజులాలో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. పాత అధ్యక్షుడు మదురో అమెరికా చెరలో ఉన్నా… కొత్త ప్రభుత్వం కొలువుదీరినా.. అసలు అధికారం ఎవరి చేతిలో ఉందో అర్థం కావడం లేదు. కాగితాల మీద కొత్త ప్రభుత్వం ఉన్నా… వీధుల్లో మాత్రం మదురో మనుషులదే రాజ్యం నడుస్తోంది. దీనివల్ల దేశం ఒకేసారి రెండు ప్రభుత్వాల మధ్య నలిగిపోతోంది. ఈ అధికార పోరు ఇప్పుడు రక్తపాతానికి దారితీస్తోంది. వ్యవస్థల్లో పాతుకుపోయిన మదురో వర్గంనికోలస్ మదురో సుదీర్ఘ…

Read More
Trump warnings

ప్రపంచానికి మరో హిట్లర్ – దేశదేశాన అమెరికా జెండా లక్ష్యం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఎలాగైతే వ్యవహరించాడో… సరిగ్గా అలాగే ట్రంప్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం కోసం దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోను బందీగా తీసుకురావడమే ప్రపంచ దేశాలకు పరోక్షంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లైంది. వెనిజులా నుంచి ఇండియా వరకు ఆయన హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. స్నేహం…

Read More
Gujarat Collector

1500 కోట్ల కలెక్టర్ స్కామ్ – ఐఏఎస్ ‘స్పీడ్ మనీ’ దందాపై ఈడీ దెబ్బ

సహనం వందే, గుజరాత్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కంచే చేను మేసిన చందమిది. ఐఏఎస్ అనే అత్యున్నత హోదాను అడ్డుపెట్టుకుని ఆ అధికారి సాగించిన లీలలు వింటే సామాన్యుడికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. కలెక్టరేట్ అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనుకుంటే పొరపాటే. అది పక్కాగా రేట్లు ఖరారు చేసి దోచుకునే వ్యాపార కేంద్రమని రాజేంద్రకుమార్ పటేల్ నిరూపించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు కట్టి, అందినకాడికి దండుకున్న ఈ ‘అవినీతి చక్రవర్తి’ బాగోతం ఇప్పుడు బట్టబయలైంది….

Read More
D Vitamin deficiency Dengue severe

డీ-లోపం… డెంగీ తీవ్రం – ఐసీఎంఆర్ పరిశోధనలో తేలిన చేదు నిజం

సహనం వందే, హైదరాబాద్: దోమ కాటుతో వచ్చే డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. కొందరిలో సాధారణ జ్వరంగా తగ్గిపోతుంటే మరికొందరిలో ఎందుకు తీవ్రమవుతోంది అన్నది మిస్టరీగా మారింది. దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో విటమిన్ డీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయన నివేదిక విస్తుపోయే అంశాలను వెల్లడించింది. ఆ నివేదికపై గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ‘సహనం వందే’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది….

Read More
Romila Thapar Speaking of History

చరిత్ర అంటే వాట్సాప్ కాదు – ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ కామెంట్

సహనం వందే, న్యూఢిల్లీ: చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాల కథలు మాత్రమే కాదు. అది మన వర్తమానాన్ని ప్రభావితం చేసే ఒక జీవన రికార్డు. కానీ దురదృష్టవశాత్తు నేడు చరిత్రను కట్టుకథలతో పోలుస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్, రచయిత నమిత్ అరోరాతో కలిసి నిజమైన చరిత్ర ప్రాముఖ్యతను లోకానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాల ముప్పు…నేటి కాలంలో చాలా మందికి చరిత్ర పుస్తకాల్లో దొరకడం లేదు. సెల్…

Read More
OSHO Teachings

‘జీరో’లోనే జీవితం – ఓషో బోధనల వెనుక అసలు రహస్యం

సహనం వందే, హైదరాబాద్: నేడు మనిషి పరుగుల ప్రపంచంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. సమాజం నేర్పిన అహంకారం, అసూయల మధ్య నలిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలు మనిషిని మేల్కొలిపేలా ఉన్నాయి. ఓషో దృష్టిలో అసలైన జీవితం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం ఒక ముసుగు…మనిషి తనలోని లోపాలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహంకారమని ఓషో చెప్పారు. పక్షులు, జంతువులకు అహంకారం ఉండదు. ఇది కేవలం మనిషి సృష్టించుకున్న ఒక జబ్బు. చిన్నప్పటి…

Read More
Vande Bharat Sleeper

పట్టాలపై ఫ్లైట్…. వందే భారత్ స్లీపర్ – 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన వందే భారత్ ఇప్పుడు స్లీపర్ రూపంలో మన ముందుకు వస్తోంది. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. కేవలం వేగమే కాదు విలాసవంతమైన ప్రయాణాన్ని ఇష్టపడే పర్యాటకులకు ఇది ఒక మధురమైన కానుక. భారత రైల్వే వ్యవస్థలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. వేగంలో రికార్డులు సృష్టించిన ట్రయల్ రన్వందే…

Read More
Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
MP Navneet Kaur Comments on Muslims

కనండి నలుగురిని… మార్చండి చరిత్రని! – నటి, ఎంపీ నవనీత్ కౌర్ హాట్ కామెంట్స్

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు కావాల్సిందేప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు…

Read More
Govt.Doctors Dharna

తెల్లకోటుకు గడ్డుకాలం – అందని జీతాలు… రోడ్డునపడ్డ బతుకులు

సహనం వందే, హైదరాబాద్: రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల కోసం నిరీక్షణతెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో…

Read More
Dhurandhar Movie not dubbing in Telugu

ధురంధర్ డబ్బింగ్‌కు టాలీవుడ్ అడ్డు – తెలుగు వెర్షన్ రాకుండా కుట్రలు కుతంత్రాలు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ సినీ యవనికపై ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ నామజపమే వినిపిస్తోంది. దేశభక్తి సెగను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఆదిత్య ధర్ అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించారు. రణవీర్ సింగ్ తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నారు. అయితే ఉత్తరాదిని ఊపేస్తున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దూరం చేయడం వెనుక గూడుపుఠాణి జరుగుతోందన్న చర్చ మొదలైంది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ…రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా వసూళ్లలో దూసుకుపోతోంది. సినిమా నిడివి అంత…

Read More
Wedding Insurance Benefits

మ్యారేజీకి బీమా కవరేజీ – పెళ్లి రద్దయితే ఖర్చు మొత్తం వెనక్కు వస్తుంది

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పెళ్లి అంటే కుటుంబంలో భారీ సందడి. కోట్లు ఖర్చు చేసి ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక హోదాగా మారింది. నగలు, విందు వినోదాల కోసం లక్షల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదం జరిగి పెళ్లి ఆగిపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసే బీమా గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఏడాదికి 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు…ప్రస్తుత ఏడాదిలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్లో 6.5…

Read More
#Abroad Studies expenses

విదేశీ గడ్డపైనే బిడ్డ భవిష్యత్తు – తమ పిల్లల విదేశీ చదువుకు 28 వేల కోట్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యా వ్యవస్థలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చదువులకు స్వదేశీయులే మొహం చాటేస్తున్నారు. కోట్లాది రూపాయల సంపద విదేశీ వర్సిటీల పాలవుతోంది. మన దగ్గర నాణ్యత లేక లక్షలాది మంది విద్యార్థులు దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రతిభతో పాటు భారీగా డబ్బు కూడా తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యా రంగంలో సంస్కరణలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వలసల పర్వం… ఆవిరవుతున్న ధనందేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది….

Read More
Health issues with Rice and Roties

అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం

సహనం వందే, హైదరాబాద్ మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయంభారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల…

Read More
Bhagavadgita and Yoga

భగవద్గీత మత గ్రంథం కాదు – మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

సహనం వందే, చెన్నై: భగవద్గీత అంటే కేవలం పూజ గదిలో ఉండే పుస్తకం కాదు. అది మానసిక ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన సంహిత. యోగా అనేది ఒక వ్యాయామం కాదు… అది ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య వరం. మద్రాస్ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు మన సంస్కృతిని, ఆరోగ్యాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. భారతీయ మూలాలను మతంతో ముడిపెట్టి చూడొద్దని కోర్టు స్పష్టం చేసింది. గీత… ఒక మానసిక చికిత్సభగవద్గీతను కేవలం…

Read More
Shivaji Comments on Women Dressing

శివాజీకి చెంపచెళ్లు – బూతు పురాణంపై మహిళ కమిషన్ కొరడా

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు సినీ నటుడిగా వెలిగి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం తహతహలాడుతున్న శివాజీకి ఊహించని దెబ్బ తగిలింది. సినిమా ఫంక్షన్లలో తన మార్కు మేధావి మాటలు చెప్పబోయి అడ్డంగా బుక్కయ్యారు. సంస్కారం గురించి నీతులు చెబుతూనే మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో శివాజీ ఇరకాటంలో పడ్డారు. ధండోరా ఈవెంట్లో నోటి దురద…శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ధండోరా సినిమా వేడుక వేదికగా…

Read More
Wegovy Tablets

విగోవీ స్లిమ్ ఈజీ – అమెరికాలో బరువు తగ్గే మాత్రకు గ్రీన్ సిగ్నల్

సహనం వందే, అమెరికా: అతిగా పెరిగిన బరువుతో సతమతమవుతున్న వారికి గుడ్ న్యూస్. పొట్ట తగ్గించుకోవడానికి… ఒళ్లు కరిగించుకోవడానికి రోజూ సూదులు గుచ్చుకోవాల్సిన పని లేదు. సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు.. కిలోల కొద్దీ బరువు మటాష్ అయిపోతుంది. అమెరికా ఆరోగ్య శాఖ తాజాగా ఆమోదించిన ఈ మ్యాజిక్ విగోవీ పిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. డెన్మార్క్ సంస్థ సంచలనంప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ ఈ సరికొత్త మాత్రను…

Read More
Beauty Stars Globally

బ్యూటీ బ్రాండ్… గ్లోబల్ ట్రెండ్ – టాప్ టెన్ హీరోయిన్లలో కృతిసనన్ కు చోటు

సహనం వందే, హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్ తో పాటు బ్యూటీ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ అందాల తారల్లో ఇండియాకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మాత్రమే నిలిచింది. ఈ ఏడాదికిగాను ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్టులో ఆమె ఐదో స్థానం…

Read More
Congress MLAs fails in Local Body Elections

తరిమికొట్టిన సొంతూరు – సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సెగ

సహనం వందే, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లోనే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత గూటిలోనే ఓటర్లు పక్క చూపులు చూడటంతో దీనిపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అధికారం చేతిలో ఉన్నా సొంత గ్రామాలను గెలిపించుకోలేని ఈ దుస్థితి ఏమిటని అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో…

Read More
Akhanda Vs Dhurandar

అ’ఖండ ఖండ’ – దురంధర్ దెబ్బకు బాలకృష్ణ విలవిల

సహనం వందే, హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 సినిమాకు బాక్సాఫీస్ వద్ద చుక్కెదురైంది. అంచనాలకు తగ్గ స్పందన రాకపోవడంతో తొలి రోజు వసూళ్లకు… శని-ఆదివారాల్లో వచ్చిన కలెక్షన్లకు అస్సలు పొంతన లేదు. ఇదే సమయంలో విడుదలైన మోగ్లీ చిత్రం పూర్తిగా తేలిపోయింది. రణ్‌వీర్ సింగ్ నటించిన హిందీ చిత్రం ధురంధర్ దూసుకుపోతుంది. కేవలం హిందీ వెర్షన్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పై థ్రిల్లర్ జోరు పెంచడం…

Read More
Australia Beach attacks

యూదులు లక్ష్యం… చారిత్రక శతృత్వం – ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడి వెనక కారణం అదే

సహనం వందే, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో బాండీ బీచ్‌లో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మృతి చెందారు. ఉల్లాసంగా ఉన్న వాతావరణంలోకి తుపాకీ గుళ్లు దూసుకురావడం… చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ఊచకోత కోయడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాల్పులకే పరిమితం కాకుండా భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం ఈ దాడి వెనుక పెద్ద కుట్ర ఉందనడానికి నిదర్శనం. ఇది కేవలం ఆవేశంలో చేసిన దాడి కాదు… యూదులు పై విధ్వంసం సృష్టించడానికి…

Read More
Bapatla incident

భార్య శవంతో బైకుపై పోలీస్ స్టేషన్‌కు..! – హత్య చేసి లొంగిపోయిన భర్త

సహనం వందే, బాపట్ల: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపిన ఓ హంతకుడు చేసిన పని ఉలికిపాటుకు గురిచేసింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ మృతదేహాన్ని తన బైకుపై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మనిషి ఇంత దారుణంగా వ్యవహరించడం సమాజంలో పెరిగిపోతున్న…

Read More
One Sperm Hundreds of Kids

వందలాది పిల్లలకు తండ్రి అయ్యే ఛాన్స్ – ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం కోట్ల వ్యాపారం

సహనం వందే, లండన్: ప్రపంచవ్యాప్తంగా వీర్య దానం ఇప్పుడు వేల కోట్ల వ్యాపారంగా వృద్ధి చెందుతోంది. ఒకే వ్యక్తి స్పెర్మ్ ద్వారా వందల మంది పిల్లలు పుడుతున్న సంచలన విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘బీబీసీ’ న్యూస్ ఛానల్ (https://bbc.in/48SL4MG) ఇటీవల నిర్వహించిన పరిశోధనలో ఒక దాత వీర్యంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యు మార్పు ఉన్నట్లు తేలింది. ఈ వ్యక్తి వీర్యాన్ని ఏకంగా 14 దేశాలకు పంపించి దాని ద్వారా కనీసం…

Read More
Bank Loans

బడాబాబులకు బ్యాంకులు బంపర్ ఆఫర్ – ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో బ్యాంకులు కేవలం కోటీశ్వరుల కోసమే పని చేస్తున్నాయి. వాళ్లకు వందలు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పులు ఇస్తున్నాయి. అంతే కాదు వాళ్లు అప్పులు చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే వాటిని రద్దు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఏమాత్రం వెనకా ముందు ఆలోచించడం లేదు. వాటిని ఏకబిగిన రద్దు చేస్తుంది. తాజాగా ఆరు లక్షల కోట్ల రూపాయలకు పైగా పాత బకాయిలను రద్దు చేయడం దారుణం. ఎవరి సొమ్ము ఎవరికి ధారాదత్తం?దేశంలో బ్యాంకుల…

Read More

ఆకాశంలో ఆట… ఇండిగో వేట! – గుత్తాధిపత్యానికి 6 విమాన సంస్థలు బలి!

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విమానయాన రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన 6 ప్రముఖ సంస్థలు వరుసగా కుప్పకూలడం వెనుక కేవలం అప్పులు, ఇంధన ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలే కారణమా? లేక దేశీయ గగనతలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రధాన సంస్థలు పన్నిన కుట్రనా? అన్న అనుమానాలున్నాయి. ఈ సంస్థల పతనం కేవలం వ్యాపార వైఫల్యం కాదు. మార్కెట్‌లో పోటీ లేకుండా చేసేందుకు పెద్ద సంస్థలు పన్నిన కుట్ర…

Read More
Cine Stars

తారలు… కొత్త దారులు – తెరపై తళుకులు… బయట వెలుగులు

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు నటీమణుల పాత్ర కేవలం వెండితెరకే పరిమితం. పెళ్లి కాగానే ఇంటికే పరిమితం కావాల్సి వచ్చేది. అలాగే అవకాశాలు తగ్గగానే కొందరు కనుమరుగైపోయేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి! ఈ తరం తెలుగు నటీమణులు నటనతోపాటు అనేక రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ఆల్ రౌండర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. సినిమా అవకాశాలు తగ్గినా తమ జీవిత లక్ష్యం అక్కడితో ఆగదని నిరూపిస్తున్నారు. గ్లామర్ ప్రపంచంలో మెరిసిన ఈ తారలు నిజ జీవితంలో…

Read More
World Population Review

అమెరికా అహంకారం… చైనా చండాలం – అగ్రరాజ్యాలను ఇష్టపడని ప్రపంచ ప్రజలు

సహనం వందే, అమెరికా: ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రజలు అత్యంత ఎక్కువగా డిస్‌లైక్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన 2025 ప్రపంచ సర్వే షాకింగ్ సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత ద్వేషించే దేశంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, తైవాన్‌ వంటి ప్రాంతాల స్వేచ్ఛను అణచివేయడం… ఉయ్‌ఘుర్ ముస్లింలపై దాడులు… మానవ హక్కుల ఉల్లంఘనలు… కోవిడ్ సమయంలో సమాచారాన్ని దాచిపెట్టడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది చైనాను…

Read More
Location Tracking system

లొకేషన్ ట్రాకింగ్‌ – కొత్త ఫిట్టింగ్… ప్రజల సీక్రెట్స్ విషయంలో వెనక్కుతగ్గని కేంద్రం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న నిఘా సైబర్ సేఫ్టీ పేరుతో సంచార్‌ సాథీ యాప్‌ ను స్మార్ట్‌ఫోన్లలో ముందే ప్రీలోడ్ చేయాలని ఆదేశించింది. నిఘా, వ్యక్తిగత సమాచార చౌర్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన రావడంతో ఆ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం మర్చిపోక ముందే ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్‌ వ్యవస్థను ఆఫ్ చేయకుండా చూసేలా మరో కుట్ర…

Read More
Rage Bait Word of the Year shakes Social Media

సోషల్ మీడియాలో ‘రేజ్ బెయిట్’ షేక్ – ఆక్స్‌ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఈ పదం

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఈ ఏడాదికి గాను ఒక సంచలనాత్మక పదాన్ని ప్రకటించింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘రేజ్ బెయిట్’ (Rage Bait) ను ఎంపిక చేసింది. అంటే మనల్ని కావాలని కోపం తెప్పించడానికి… ఆగ్రహాన్ని రేకెత్తించడానికి వాడే కంటెంట్ అని అర్థం. గత 12 నెలల్లో ఈ పదం వాడుక ఏకంగా మూడు రెట్లు పెరిగిందంటే సోషల్ మీడియాలో ఆగ్రహం ఏ స్థాయిలో…

Read More
Rahul Gandhi Comments on Puthin Visit

విదేశీ స్నేహం… విపక్షం దూరం – కేంద్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా ప్రతిపక్షానికి చుక్కెదురైంది. విదేశీ ప్రముఖులు దేశాన్ని సందర్శించినప్పుడు సంప్రదాయబద్ధంగా ప్రతిపక్ష నాయకులతో కూడా సమావేశమవడం ఆనవాయితీ. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్ బయట విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ… విదేశీ ప్రతినిధులు ప్రతిపక్ష నాయకులను కలువకుండా కేంద్రం వ్యవస్థీకృతంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. అభద్రతా భావంతోనే ఆంక్షలు…గతంలో…

Read More
IITs Banned 20 Corporate Companies

20 కంపెనీలపై ఐఐటీల నిషేధం – క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నుంచి బహిష్కరణ

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తమ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నుంచి 20కి పైగా కంపెనీలను శాశ్వతంగా నిషేధించాయి. విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చి వారు చేరే సమయానికి సరిగ్గా ముందు ఉద్యోగాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల్లో అగ్ని రాజుకుంది. అంతేకాదు ఇంటర్వ్యూలలో ఒప్పందం కుదుర్చుకున్న ప్యాకేజీని… ఉద్యోగంలో చేరిన తర్వాత తగ్గించడం వంటి దారుణాలకు బడా కంపెనీలు పాల్పడ్డాయి. దీంతో ఐఐటీలు ఈ కఠిన…

Read More
Amar Subrahmanyam Apple AI Vice President

యాపిల్ కు ఇండియన్ చికిత్స – వైస్ ప్రెసిడెంట్ గా బెంగళూరు సుబ్రహ్మణ్యం

సహనం వందే, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో మేధావుల కోసం జరుగుతున్న టాలెంట్ వార్ తారస్థాయికి చేరింది. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు షాకిస్తూ‌… యాపిల్ ఒక కీలక అడుగు వేసింది. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ఇంజనీరింగ్ హెడ్‌గా పనిచేసి… తర్వాత మైక్రోసాఫ్ట్‌లో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అమర్ సుబ్రమణ్యాన్ని యాపిల్‌ ఏఐకి కొత్త వైస్ ప్రెసిడెంటుగా నియమించుకుంది. ఏఐ రేసులో వెనుకబడిన యాపిల్‌ను ముందుకు తీసుకెళ్లడమే సుబ్రహ్మణ్య ముందున్న అతిపెద్ద సవాల్….

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Sexual Content Hacking

బెడ్‌రూమ్స్ హ్యాకింగ్ – ఇళ్లల్లో అమర్చుకున్న కెమెరాల హైజాక్

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఓ భయంకరమైన సైబర్ నేరం వెలుగు చూసింది. తమ ఇళ్లలో, ఆఫీసుల్లో భద్రత కోసం అమర్చుకున్న లక్షా 20 వేలకు పైగా ఐపీ కెమెరాలు హ్యాకింగ్ అయ్యాయి. సీసీటీవీకి ప్రత్యామ్నాయంగా చవకగా దొరికే ఈ హోమ్ కెమెరాలను అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు ప్రజల వ్యక్తిగత జీవితాలను రికార్డ్ చేశారు. లైంగికపరమైన కంటెంట్‌ను దొంగిలించి వాటిని అమ్ముకుంటూ డబ్బు దండుకున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న వ్యాయామ సెంటర్లు, గైనకాలజిస్ట్…

Read More
LIC hands of Adani & Ambani

ఇద్దరి గుప్పిట్లోకి సామాన్యుడి ‘లైఫ్’ – ఆదానీ, అంబానీ కాళ్ల దగ్గర ప్రజల సొమ్ము

సహనం వందే, న్యూఢిల్లీ: కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు…

Read More
ED Rides on Medical Colleges

మెడికల్ కాలేజీలపై ఈడీ దెబ్బ- దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో దాడులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల సంఖ్య పెంపు కోసం ఎన్‌ఎంసీలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు కోట్లకు కోట్లు లంచం తీసుకున్నారన్న అనుమానంతో గురువారం ఈడీ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద వైద్య విద్యా సామ్రాజ్యాలు ఈ దాడుల్లో చిక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌మనీ…

Read More
Billionaires Leaves India

దేశం విడిచిపోతున్న ధనలక్ష్మి – విదేశాలకు వెళ్లిపోతున్న బిలియనీర్లు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు…

Read More
Chennai-Based Visa Scam Exposed

వీసమెత్తు పనికిరానివారికి వీసా – అమెరికాలో హైదరాబాద్ పరువు గంగపాలు

సహనం వందే, హైదరాబాద్/చెన్నై: అమెరికా వెళ్లేందుకు తీసుకునే వీసా ప్రక్రియలో భారీగా మోసాలు జరిగాయని ఒక దౌత్యవేత్త సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థలోని అక్రమాలను ఒక అమెరికన్-భారతీయ దౌత్యవేత్త మహ్వాష్ సిద్ధిఖీ బట్టబయలు చేశారు. వీసాల కోసం వచ్చే దరఖాస్తులలో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు నకిలీవి అని… ఈ వ్యవస్థ ఒక కుంభకోణంగా మారిందని మహ్వాష్ సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేనివారు, నకిలీ…

Read More
One Dollar reaches Rs.89.48

రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?

సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…

Read More
64Complaints to Hydra in One day

బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా

సహనం వందే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న…

Read More

ఊరు పొమ్మంది… సర్వే రమ్మంది – వచ్చే ఏడాది భారీ సర్వేకు కేంద్రం ఏర్పాట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వలస కార్మికులు, వారి కుటుంబ జీవితాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2026-27 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ వలస సర్వే జరగబోతోంది. గతంలో కేవలం ఎంత మంది వలస వెళ్లారనే గణాంకాలకే పరిమితమైన ఈ సర్వే… ఇకపై వలస కార్మికుల జీవిత నాణ్యతను పూర్తిగా తెలుసుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకు (2007-08) జరుగుతున్న ఈ అధ్యయనం వలస కార్మికుల బతుకు బాగుపడాలనే సంకల్పంతో రూపొందుతోంది. ఆరు నెలలు…

Read More