ఒకే వ్యూహం… ఒకే గేమ్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు… మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులపై పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. వారిపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది‌. కేసీఆర్, జగన్‌లను అరెస్టు చేయడానికి ఇదే సరైన సమయంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భావిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తే రాబోయే ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో…

Read More

సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావం

సహనం వందే, హైదరాబాద్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రతినిధులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆ సంస్థ తీవ్రంగా ఆరోపిస్తోంది. సాక్షి మీడియా వర్గాల ప్రకారం… పోలీసులు ఎటువంటి సెర్చ్ వారెంట్ చూపకుండానే…

Read More

విశాఖలో ‘కరాచీ’ చిచ్చు!

సహనం వందే, విశాఖపట్నం: విశాఖపట్నంలో కరాచీ అనే పేరు ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. వెంకోజీపాలెం డైమండ్ పార్క్ రోడ్డులో కొన్నేళ్లుగా కొనసాగుతున్న కరాచీ బేకరీ పేరును మార్చాలంటూ స్థానిక జనజాగృతి సమితి సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో… శత్రుదేశ నగరమైన కరాచీ పేరుతో ఇక్కడ వ్యాపారం చేయడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఈ పేరును వెంటనే మార్చాలని, లేదంటే బేకరీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వారు…

Read More

బహుజనుల బలిదానంతో అమరావతి

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి… ఇది రాజధాని కాదు, రాజకీయ నాయకుల కుట్రలకు, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం! 2015లో వేసిన అబద్ధపు పునాదులపై ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన మరోసారి శంకుస్థాపన డ్రామాకు తెరలేపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ రాజకీయ నాటకంలో ప్రజల ఆశలు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల జీవితాలు కూడా బలి అవుతున్నాయి. మొదటి శంకుస్థాపనతో వేల కోట్ల ప్రజాధనం స్వాహా అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ…

Read More

నెలకు 60 కోట్ల సంపాదన లక్ష్యం!

సహనం వందే, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలతో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేసినట్లు రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగిందని…

Read More

వక్ఫ్ భూముల కుంభకోణం!

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది. తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!తెలంగాణలో వక్ఫ్ బోర్డు…

Read More

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు

సహనం వందే, అమరావతి:మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. మహిళల పట్ల ఇలాంటి తప్పుగా మాట్లాడే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. దీనిలో భాగంగా పార్టీ అధిష్టానం వెంటనే చేబ్రోలు కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ…

Read More

జగన్ టెన్షన్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తత రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వరుస కేసులతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వంటి కీలక నేతలు ఇప్పటికే జైలు పాలవగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఇప్పటికే నమోదైన క్విడ్ ప్రోకో వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులను ఆధారంగా చేసుకుని ఆయన బెయిల్‌ను రద్దు…

Read More

డార్క్ వెబ్‌తో డ్రగ్స్ దందా

   తెలుగు రాష్ట్రాల్లో యువతను ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మహమ్మారి – హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, ఖమ్మంలలో విక్రయాలు – క్రిప్టో కరెన్సీతో మాదకద్రవ్యాల లావాదేవీలు… డిజిటల్ పద్ధతిలో దందా – డ్రగ్స్ కేసుల్లో సినిమా తారలున్నట్లు నిర్ధారణ… అయినా శిక్ష పడలేదు – ప్రముఖులు తప్పించుకుంటే సామాన్యులు బలవుతున్నారన్న విమర్శలు సహనం వందే, హైదరాబాద్/విజయవాడ/విశాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డార్క్ వెబ్, బిట్‌కాయిన్‌లతో మాదకద్రవ్యాల వ్యాపారం యువతను కబళించే విషసర్పంలా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం…

Read More

పేదరికం లేని రాష్ట్రమే నా లక్ష్యం

– ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రకటన సహనం వందే, విజయవాడ: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందించే…

Read More