కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

విశాఖ రైల్వేస్టేషన్‌లో జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్‌

సహనం వందే, విశాఖపట్నం:రైలు ప్రయాణికులకు విశ్రాంతి అందించేలా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సరికొత్త క్యాప్సుల్ హోటల్‌ ప్రారంభమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో తొలిసారిగా ఈ తరహా వసతి అందుబాటులోకి వచ్చింది. స్లీపింగ్ పాడ్స్ పేరుతో ఈ హోటల్‌ను మొదలుపెట్టారు. తక్కువ ధరకు ఏసీ గదులు, ఉచిత వైఫై, వేడి నీటి స్నానాలు, స్నాక్స్ వంటి సౌకర్యాలతో ప్రయాణికులకు చక్కటి విశ్రాంతి కేంద్రంగా ఇది మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లోని మొదటి నంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న మొదటి…

Read More

చంద్రబాబుతో రేవంత్ రె’డ్ఢీ’ – వరద జలాలపై ఆంధ్రప్రదేశ్ వాదన

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వరద…

Read More

లోకేష్ రెడ్ బుక్ ఉగ్రరూపం – జగన్ కు చుక్కలు….

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మంటలు రేపుతుంది. జగన్ పరివాహరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కిందిస్థాయి కార్యకర్త మొదలు జగన్ వరకు ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతూ లోన పడేస్తున్నారు. జగన్ కు అండగా నిలబడిన ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తున్నారు. కారు కింద పడి చనిపోయినందుకు ఏకంగా జగన్ నే టార్గెట్ చేశారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అంతే…

Read More

ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

విమాన వేగంతో ఖమ్మం హైవే మీదుగా విశాఖకు ప్రయాణం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధం అవుతుంది. వచ్చే ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అంటే రాబోయే కీలకమైన సంక్రాంతి పండుగకు రయ్ రయ్ మంటూ విశాఖపట్నం దూసుకుపోవచ్చు. మధ్యలో ఉండే రాజమండ్రి ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ఏకంగా 56 కిలోమీటర్లు తగ్గటం విశేషం. ఇప్పటివరకు ఈ మార్గంలో ప్రయాణం చేయడం అత్యంత…

Read More

ఏవీ ఇన్ఫ్రాకాన్ భారీ మోసం – రూ. 500 కోట్లు స్వాహా ….

సహనం వందే, హైదరాబాద్: బై బ్యాక్ పాలసీ పేరుతో భారీ పెట్టుబడులు ఆకర్షించి, రూ. 500 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ఏవీ ఇన్ఫ్రాకాన్ సంస్థ దందా వెలుగులోకి వచ్చింది. అనతి కాలంలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము ఇస్తామని ఆశచూపి, వందలాది మంది బాధితులను నిండా ముంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ కేంద్రంగా దందా‌‌… ఏవీ ఇన్ఫ్రాకాన్ ఛైర్మన్ విజయ్ గోగుల మాదాపూర్‌ను…

Read More

బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో, దీనిని అడ్డుకోకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని…

Read More

ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ – ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి

సహనం వందే, హైదరాబాద్:పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ‘ప్రజాస్వామ్యం- పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాలు వ్యతిరేక వార్తల పట్ల కొంత అసంతృప్తి చూపేవి కానీ ఇప్పుడు అసహనం నుంచి కక్ష సాధింపు వరకు వచ్చాయని ఆరోపించారు. ప్రభుత్వాలు పూర్తిగా…

Read More

‘సాక్షి’లో కలకలం – కార్యాలయాల వద్ద ధర్నాలు

సహనం వందే, అమరావతి: సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఆ మీడియా సంస్థలో కలకలం చెలరేగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ సంస్థలోని జర్నలిస్టులు భయపడుతున్నారు. గత నెల సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు టార్గెట్ చేశారు. విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఇలా ఒకటి తర్వాత ఇంకొకటి సాక్షిలో కీలక వ్యక్తులు టార్గెట్ అవడంపై జర్నలిస్టులు కలవరపడుతున్నారు. ఏమి రాస్తే…

Read More