500 కోట్ల సైబర్ మోసగాడు – బెజవాడ యువకుడు శ్రవణ్ గ్యాంగ్ నిర్వాకం

సహనం వందే, విజయవాడ:విజయవాడకు చెందిన యువకుడు శ్రవణ్ కుమార్ రెండు నెలల్లోనే 500 కోట్ల రూపాయల సైబర్ క్రైంకు పాల్పడడం సంచలనం అయ్యింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీలు చేసిన విషయం తెలిసింది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన మోసపూరిత డబ్బును ఈ అకౌంట్లలోకి మార్చి, తర్వాత ఫేక్ కంపెనీలకు పంపేవాడు. ఈ వ్యవస్థలో ఆరు కంపెనీలకు ప్రత్యేక…

Read More

డబ్బుల్లో బాబు… కేసుల్లో రేవంత్ – దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్

సహనం వందే, హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలో మొదటి స్థానాల్లో ఉన్నారు. ఒకరు డబ్బుల్లో, మరొకరు కేసుల్లో ముందున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిలియనీర్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లు. అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తి కేవలం రూ. 15 లక్షలు. భారతదేశంలోని 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాలను…

Read More

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపీ కలిశెట్టి అభినందన

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వారు రాధాకృష్ణన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకం మాత్రమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తమ మద్దతును తెలియజేసేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు…

Read More

ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

నాడు సుందరయ్య… నేడు అప్పలనాయుడు – సైకిల్ పై పార్లమెంటుకు ఎంపీ

సహనం వందే, ఢిల్లీ:కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది….

Read More

పాత వివాదాలు… కొత్త అనుమానాలు! చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సందేహాలు

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించాలనే నినాదంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనకు బయలుదేరుతుండగా, గతంలో ఈ దేశంతో జరిగిన వివాదాస్పద ఒప్పందాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు సహా ఎనిమిది మంది బృందం పాల్గొననుంది. మళ్లీ అదే బాటలో పయనమా?సింగపూర్‌లో ముఖ్యమంత్రి…

Read More

అన్నయ్య వర్సెస్ తమ్ముడు-నాగబాబుకు మంత్రి పదవిపై సందిగ్ధత

సహనం వందే, అమరావతి:నాగబాబుకు మంత్రి పదవిపై సాగుతున్న ఊహాగానాలు, చర్చలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా ఇచ్చిన వివరణ కొత్త మలుపునిచ్చింది. సోదరుడు నాగబాబు మంత్రి అవుతారా? రాజ్యసభ సభ్యుడవుతారా? కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కుతుందా? అనే ప్రశ్నలకు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సమాధానాలు ఇవ్వకపోయినా, ఈ వ్యవహారం వెనుక పవన్ వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ చేతిలోనే నాగబాబు మంత్రి పదవి!నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read More

ప్రముఖులు జైళ్లలో అతిథులు – డబ్బుంటే జైళ్లు గెస్ట్ హౌస్ లే

సహనం వందే, రాజమండ్రి:‘జైలుకు పంపిస్తే విశ్రాంతి తీసుకుంటా’… ఈ వ్యాఖ్య చేసింది ఎవరో కాదు… తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. ధనికులకు చట్టం చుట్టం అవుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. తప్పుచేసి జైలుకు వెళ్లినప్పటికీ వారికి రాచ మర్యాదలు కల్పిస్తారు. ఒకప్పుడు జగన్… తర్వాత రేవంత్ రెడ్డి..‌. చంద్రబాబు నాయుడు… కవిత.‌.‌. ఇప్పుడు మిధున్ రెడ్డి. వీళ్ళందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. జైళ్లు ఒకరకంగా ధనికులకు విశ్రాంతి కేంద్రాలుగా మారిపోవడం దురదృష్టకరం. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని…

Read More

జగన్ పై ట్రిగ్గర్ – ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ తో షాక్

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడిని టచ్ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డిపైనే తుపాకీ గురిపెట్టినట్లు అయింది. ఈ పరిణామంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జగన్ పరివారం అందరూ టార్గెట్టే…జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో…

Read More

నారా భువనేశ్వరికి ఒక్కరోజే రూ. 78 కోట్లు లాభం

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఊహించని లాభం చేకూరింది. శుక్రవారం ఒక్కరోజే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ ధర 7 శాతం పైగా పెరగడంతో ఆమె వ్యక్తిగతంగా రూ. 78.80 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసినప్పటికీ, హెరిటేజ్ స్టాక్ మాత్రం దూసుకుపోవడం విశేషం. హెరిటేజ్‌ ఎండీగా భువనేశ్వరి…నారా భువనేశ్వరి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు…

Read More