రణబీర్, కత్రినా రహస్యాల రచ్చ – కత్రినా ‘కైఫ్’చ్చే ఫోటోలు బట్టబయలు

సహనం వందే, ముంబై:బాలీవుడ్‌లో సెలబ్రిటీల జీవితాలు ఎప్పటికీ ఓ బహిరంగ పుస్తకమే. వారి వ్యక్తిగత జీవితంపై మీడియా, అభిమానుల ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఆసక్తి కొన్నిసార్లు హద్దులు దాటి సెలబ్రిటీల ప్రైవసీని ఉల్లంఘిస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం బాలీవుడ్‌ను కుదిపేసిన రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఫొటోల లీక్ సంఘటన వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. ఆ ఫోటోలను టూరిస్టులో, పాపరాజీలో తీయలేదని… వారికి అత్యంత దగ్గరి వ్యక్తి లీక్ చేశాడని…

Read More

‘చిరు’ చొరవ – టాలీవుడ్ కార్మికుల సమస్యపై చర్చ

సహనం వందే, హైదరాబాద్:టాలీవుడ్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. 15 రోజులుగా జరుగుతున్న సమ్మెను నిలుపుదల చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు నిర్మాతలతో ఆయన చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటు నిర్మాతల మధ్య, అటు కార్మికుల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారు. 15 రోజుల పోరాటం…వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు గత 15…

Read More

‘వార్’లో గెలిచిన ‘కూలీ’ – బాక్సాఫీస్ యుద్ధంలో బాషా విజయం

సహనం వందే, సినీ బ్యూరో హైదరాబాద్:భారతీయ సినీ చరిత్రలో ఇండిపెండెన్స్ డే వీక్‌లో జరిగిన బాక్సాఫీస్ యుద్ధం అభిమానులకు పండగలా మారింది. ఒకవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ చిత్రం కూలీ, మరోవైపు యువ సంచలనం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన స్పై థ్రిల్లర్ వార్ 2… ఈ రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో హైప్ మధ్య విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలలో కూలీదే పై చేయిగా కనిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్… లోకేశ్…

Read More

ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో

(రేటింగ్: 2.5/5) సహనం వందే, హైదరాబాద్:వార్-2 సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు…

Read More

150 కోట్ల ‘కూలీ’… ఒక రోజు సెలవు

సహనం వందే, హైదరాబాద్:సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలుసాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ…

Read More

రజినీ – శ్రీదేవి ప్రేమకు పవర్ ‘కట్’ – ఇంటికి వెళ్లి వెనక్కు వచ్చిన స్టార్

సహనం వందే, హైదరాబాద్:దశాబ్దాల సినీ ప్రయాణంలో రజినీకాంత్, శ్రీదేవి కలిసి 15 కి పైగా చిత్రాలలో నటించారు. మూండ్రు ముడిచ్చు నుంచి చాల్‌బాజ్ వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన ఈ జోడీ, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడ్డారని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని ఏనాడూ బయటపెట్టలేదు. శ్రీదేవి మరణం తర్వాత ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరెంటు పోయిందని వెనక్కు వచ్చేశాడు…శ్రీదేవిపై రజినీకాంత్‌కు చాలాకాలంగా అభిమానం ఉంది. ఒకానొక సందర్భంలో శ్రీదేవి…

Read More

చంద్రబాబు… వైయస్సార్ ల ‘మయసభ’

సహనం వందే, హైదరాబాద్:ఎలాంటి ప్రచారం లేకుండా ఆసక్తికరమైన రాజకీయ చిత్రం రాబోతుంది. పేర్లు చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ కథతో తెరకెక్కిన చిత్రం ‘మయసభ’. ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సోనీలివ్ ఒరిజినల్ గా ఇది సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి…

Read More

బాక్సాఫీసు బద్దలు కొడుతున్న స్మర్ఫ్స్ సినిమా

సహనం వందే, హైదరాబాద్: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చూసినప్పుడు ఊహించని ఆనందాన్ని పంచుతాయి. స్మర్ఫ్స్ సినిమా అలాంటి అనుభవమే అందిస్తుంది. ఈ రంగురంగుల చిన్న నీలి జీవుల కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం చిన్నారులను అమితంగా ఆకర్షించేలా తీర్చిదిద్దారు. సినిమా హాలులో పిల్లలు ఉత్సాహంగా కేకలు వేస్తూ, నవ్వుతూ ఉండటం సినిమా చూసే అనుభవాన్ని మరింత హాస్యమయం, ఉల్లాసభరితం చేసింది. ఈ చిత్రం కేవలం పిల్లల కోసమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించే…

Read More

రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ – రాష్ట్రంలో అంతర్జాతీయ స్టూడియో

సహనం వందే, ఢిల్లీ:ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో సినీ నిర్మాణానికి కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సదుపాయాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. నైపుణ్య…

Read More

‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

సహనం వందే, ముంబై:బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు. ‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని…

Read More