ఏఐ ట్రెండ్… సినిమా ఎండ్ – డీప్ ఫేక్ టెక్నాలజీతో పాత నటుల సృష్టి

సహనం వందే, హైదరాబాద్:భారతీయ సినీ పరిశ్రమలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాత్మక మార్పులు తెస్తోంది. షకున్ బత్రా లాంటి దర్శకులు తమ ‘ది గెటవే కార్’ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్, స్క్రిప్ట్ తయారీకి ఏఐని వాడి సరికొత్త పద్ధతులను పరిచయం చేశారు. ‘ఏఐ మా క్రియేటివ్ పనులు వేగవంతం చేస్తుంది. కొత్త ఆలోచనలకు ఇంధనంలా పనిచేస్తుంద’ని బత్రా గట్టిగా చెబుతున్నారు. వార్ లార్డ్ వంటి భారీ చిత్రాల్లో ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో పాత నటుల పోలికలను…

Read More

దైవిక చిత్రాలు… కనక వర్షాలు – పురాణ పాత్రలే ఇప్పుడు సూపర్‌హీరోలు

సహనం వందే, ముంబై:భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆధ్యాత్మిక తరంగం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. హిందూ పురాణాలు, దైవత్వ అంశాలను ఆధునిక సాంకేతికతతో భారీ యాక్షన్ కోణంలో తెరకెక్కించే ట్రెండ్ ఊపందుకుంది. సమాజంలో ఆధ్యాత్మిక భావనలు, సాంస్కృతిక అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. దేవతలు, రాక్షసులు, భక్తుల కథలను హాలీవుడ్ స్థాయి సూపర్‌హీరో యాక్షన్‌తో కలిపి చూపడం బాలీవుడ్‌కు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. సమకాలీన సమస్యల్లో ఒక మార్గదర్శిని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమాల…

Read More

శాటిలైట్ హ్యాకింగ్… పైరసీ షాకింగ్ – హైడెఫినిషన్ స్థాయిలో సినిమాలు డౌన్లోడ్

సహనం వందే, హైదరాబాద్:సినిమా పైరసీ అంటే ఇప్పటివరకు మనకున్న ఆలోచన వేరు. థియేటర్లకు వెళ్లి కెమెరాతో సినిమాను రికార్డు చేసి పైరసీ చేస్తుంటారని అనుకుంటాం. అయితే అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏకంగా డిజిటల్ శాటిలైట్లనే హ్యాక్ చేసి సినిమాలను పైరసీ చేస్తున్నట్లు తేలింది. అలా పైరసీ చేసిన సినిమాలు ఒరిజినల్ కాపీతో సమానంగా హైడెఫినిషన్ కంటెంట్‌ తో బయటకు వస్తున్నాయి. దీనివల్ల సినిమా టికెట్ కొనుక్కొని వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోతుంది. అటువంటి హైటెక్ పైరసీ ముఠాను…

Read More

అందరివాడు… ఎవరూ లేనివాడు – చిరంజీవికి అండగా నిలవని తమ్ముళ్లు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే, సీనియర్ హీరో బాలకృష్ణ ఏపీ అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నుంచే సరైన స్పందన కరువైంది. ముఖ్యంగా సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడంపై మెగాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి అండగా నిలవాల్సిన సొంత తమ్ముళ్లు కూడా సైలెంట్‌గా ఉండటంతో……

Read More

‘స్తోమత లేకుంటే సినిమాకు రాకండి’ – హైకోర్టులో ‘ఓజీ’ తరపు లాయర్ వింత వాదన

సహనం వందే, హైదరాబాద్:‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లపై శుక్రవారం హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సినిమా నిర్మాత తరపున వాదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ‘సినిమా టికెట్ ధరలపై మేము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే రూ.100, రూ.150 పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. రూ.150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేటు ఉన్నప్పుడే సినిమా చూడాలి. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు. కానీ ఆయనకు…

Read More

అభిమానంతో కోట్ల వ్యాపారం – ఫ్యాన్స్ టిక్కెట్లే… పవన్ కల్యాణ్ కు కోట్లు

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇప్పుడు అభిమానం, వ్యాపారం మధ్య చిక్కుకుంది. కేవలం అభిమానుల క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని భారీ మొత్తాలను జేబులో వేసుకుంటున్నారని సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు పవన్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని వస్తున్న వార్తలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. 250 కోట్ల రూపాయల బడ్జెట్‌లో దాదాపు అటు ఇటుగా సగం పవన్ రెమ్యునరేషనే…

Read More

‘ఓజీ’ బ్లాక్ టికెట్ల మాఫియా ‘కింగ్’ – అధిక ధరకు అమ్ముతున్న ఓ బడా నిర్మాత

సహనం వందే, హైదరాబాద్:మెగా అభిమానుల ఆశలకు అడ్డుపడుతూ ‘ఓజీ’ సినిమా విడుదలకు ముందే బ్లాక్ టిక్కెట్ల మాఫియా ప్రబలుతోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను, పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని అస్త్రంగా వాడుకొని కొందరు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కీలకమైన పదవిలో ఉన్న ఒక సినీ నిర్మాత ఈ దందా వెనుక ఉన్నారని, ఈయన ఒక బ్లాక్ టిక్కెట్ల నిర్మాతగా మారి వ్యవస్థను పక్కనపెట్టి కాసుల కోసం కక్కుర్తి…

Read More

పవన్ ఓజీ… ఫ్యాన్స్ క్రేజీ – 25వ తేదీన బాక్సాఫీసును బద్దలే

సహనం వందే, హైదరాబాద్:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినీ లోకం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతీ అప్డేట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఓజీలో ఓజాస్ గంభీరంగా గర్జించనున్నారని చెబుతున్న పవన్, ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి…

Read More

దీపికా ఓపిక లేదిక – దీపికా పదుకొనె వ్యవహారంపై అసహనం

సహనం వందే, హైదరాబాద్:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కెరీర్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె భారీ చిత్రాలను వదిలేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి‌. కానీ దాని వెనుక సినిమా వర్గాల అసహనం, ఆమె అతి డిమాండ్లే కారణమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కల్కి 2898 ఏడీ, స్పిరిట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత ఏడాది భారీ విజయాలతో…

Read More

ప్రేమతో మీ అనుష్క… – అభిమానులకు ప్రత్యేకంగా లేఖ

సహనం వందే, హైదరాబాద్:సినీ తార అనుష్క శెట్టి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ఘాటి విడుదలైన కొద్ది రోజులకే ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే’ అంటూ ఆమె పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసులను కదిలించింది. ఈ నిర్ణయం సినిమా వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆమె త్వరగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఘాటి…

Read More