ఏఐని నమ్మితే నట్టేటే – సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్

సహనం వందే, అమెరికా:ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తుంటే… గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ మాత్రం దాన్ని అంతగా నమ్మొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. ‘ఏఐ అందించే సమాచారాన్ని కళ్లు మూసుకుని నమ్మొద్దు’ అని ఆయన వినియోగదారులకు సూచించడంపై టెక్నాలజీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ తప్పులు చేస్తున్నాయని… వాటిని కేవలం ఒక సమాచార వనరుగా మాత్రమే పరిగణించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐపైనే…

Read More

ల్యాబ్ పా’పాలు’… కృత్రిమ పాలు తయారు చేస్తున్న కంపెనీలు

సహనం వందే, అమెరికా:పాల పరిశ్రమను కుదిపేసే కొత్త విధానం ఒకటి అమెరికాలో మొదలైంది. ల్యాబ్లో కణాలతో పాలు తయారు చేస్తున్నారు. వీటిని నిజమైన పాలే అని శాస్త్రవేత్తలు చెబుతున్నా ఆరోగ్యం దృష్ట్యా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా ఆవు గడ్డి తిని, జీర్ణం చేసుకొని ఇచ్చే పాలలో ఉండే పోషకాలు… కృత్రిమంగా తయారైన ల్యాబ్ పాలల్లో ఉండవని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆవు పాలు తాగితే శరీరం బలపడుతుంది… కానీ ల్యాబ్ పాలు తాగితే ఏమవుతుందో ఎవరూ ఖచ్చితంగా…

Read More

బీహార్ ఫలితాలపై ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనం

సహనం వందే, అమెరికా:బీహార్ ఫలితాలపై ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్ న్యూస్ పేపర్ ‘న్యూయార్క్ టైమ్స్‘ శుక్రవారం సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీకి… ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు రావడంపై ‘న్యూయార్క్ టైమ్స్’ విమర్శనాత్మకంగా విశ్లేషించింది. ఆ కథనం సారాంశ ఏమిటో పరిశీలిద్దాం. (న్యూయార్క్ టైమ్స్ రాసిన స్టోరీ ఇక్కడున్న లింకులో  https://nyti.ms/4r7fC5J చూడొచ్చు) భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పాలక కూటమి…

Read More

ఏఐ మోజు… లైఫ్ క్లోజ్ – యూజర్ డేటా దోపిడీ!

సహనం వందే, అమెరికా:తమ కొత్త ఏఐ సాధనం జెమినిని అడ్డుపెట్టుకుని యూజర్ల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను, రహస్య సంభాషణలను గుట్టుగా దొంగిలిస్తోందంటూ అమెరికాలో గూగుల్ సంస్థపై దావా దాఖలైంది. మనం స్నేహితులతో షేర్ చేసుకునే ప్రతి చిన్న మాట… వ్యాపార రహస్యాలు దాగి ఉన్న ప్రతి ఈమెయిల్… పంపే ప్రతి ఫోటో… పత్రం… అన్నీ గూగుల్ నియంత్రణలో ఉన్న ఈ జెమిని ఏఐకి అందుబాటులోకి వెళ్లిపోవడం టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ప్రైవసీకి…

Read More

ఐదు కోట్ల వి’చిత్రం’ – అమెరికాలో ఒక ఆర్టిస్ట్ చిత్రాలకు క్రేజ్

సహనం వందే, అమెరికా:అద్భుతమైన ప్రకృతి చిత్రాలను గీసి తనదైన శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న దివంగత టీవీ హోస్ట్, చిత్రకారుడు బాబ్ రాస్ మాయాజాలం మరోసారి రుజువైంది. ఆయన చిత్రాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ చూసి కళాలోకం ఆశ్చర్యపోతోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన వేలంలో బాబ్ రాస్ వేసిన మూడు చిత్రాలు కలిపి అక్షరాలా రూ. 5.28 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఎంతో సాధారణ ప్రకృతి చిత్రాలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఈయన…

Read More

ఆకలిపై షాట్… షుగర్ ఔట్ – బరువుపై అమెరికా ఫార్మా కంపెనీ బ్రహ్మాస్తం

సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్‌లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్…

Read More

అమెరికా అల్లకల్లోలం- 70 లక్షల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా‌…

సహనం వందే, అమెరికా:అమెరికా అల్లకల్లోలంగా మారింది. 2700 పట్టణాలు, నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ విధానాలపై గళమెత్తుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ట్రంప్ రాచరిక పద్ధతులకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో ఈ ఉద్యమం జరుగుతుంది. గత జూన్‌లో 20 లక్షల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేయగా… ఇప్పుడు దాదాపు నాలుగింతల మంది…

Read More

అభిమానులతో ‘ఫుట్‌బాల్’ – ప్రపంచ కప్ ఒక్క టికెట్ రూ. 8.87 లక్షలు

సహనం వందే, అమెరికా:అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 2026 ప్రపంచ కప్ మ్యాచ్‌ల టికెట్ల ధరల రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. మొదట ధరలను గోప్యంగా ఉంచిన ఫిఫా… అతి తక్కువ ధరలు సుమారు రూ. 5,300 నుంచి మొదలవుతాయని మాత్రమే సెప్టెంబర్‌లో ప్రకటించింది. కానీ టికెట్ లాటరీలో గెలిచిన అభిమానులు ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ధరలు సామాన్య అభిమానులకు ఆకాశాన్ని తాకే విధంగా ఉండటం…

Read More

డాక్టర్లపై డాలర్ సెగ – భారతీయ వైద్యులకు హెచ్1బీ గుదిబండ

సహనం వందే, అమెరికా:అమెరికా ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న విదేశీ వైద్యులకు హెచ్1బీ వీసా ఫీజు రూపంలో అకస్మాత్తుగా పెనుభారం పడింది. అగ్రరాజ్యం తాజాగా వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అగ్గిమీద గుగ్గిలమైంది. ఈ భారీ ఫీజు వైద్య సేవలకు అడ్డంకిగా మారుతుందని, దీని ప్రభావం వల్ల దేశ ఆరోగ్య రంగం కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికన్ల ఆరోగ్య భద్రతకు అత్యవసరం అయిన వైద్యులను ఈ నిబంధన…

Read More

భారత మగాళ్లకు అమెరికాలో డిమాండ్ – ఇండియన్ భర్త కోసం ఒక మహిళ ప్రయత్నం

సహనం వందే, అమెరికా:న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అక్కడ విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన ప్రజలు కనిపిస్తుంటారు. అలాంటి చోట ఒక అమెరికన్ మహిళ ‘భారతీయ భర్త కావాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధునిక కాలంలో డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా ప్రేమ వ్యవహారాలకు వేదికగా మారుతున్నప్పుడు… ఆ మహిళ పాత పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది….

Read More