Hi-B Visa No slots

‘అమ్మో’రికా వీసా – స్లాట్లకు వెయిటింగ్ షాక్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులపై పిడుగు పడింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు ఇప్పుడు ఏకంగా ఏళ్లలోకి మారుతున్నాయి. కొత్తగా వీసా అపాయింట్‌మెంట్ కోరుకునే వారికి 2027 వరకు స్లాట్లు దొరకడం లేదు. అగ్రరాజ్యంలో నిబంధనలు కఠినతరం కావడంతో వేలాది మంది టెక్కీల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. స్లాట్లు నిల్.. అన్నీ ఫుల్దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లోని కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా…

Read More
America Visa Slots at Hyderabad

అమెరికా వీసా… హైదరాబాద్ భరోసా – నగరంలో వీసా స్లాట్లకు తక్కువ సమయం

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు వీసా ఇంటర్వ్యూల విషయంలో ఊరట లభిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కాన్సులేట్ లో వీసా స్లాట్లు త్వరగా దొరుకుతున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కొన్ని నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గింది. ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. భాగ్యనగరంలో వేగంగా స్లాట్లు…హైదరాబాదులో అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూసే సమయం గణనీయంగా తగ్గింది. పర్యాటక…

Read More
Trump Questions Electronic voting

ఈవీఎంల హ్యాకింగ్… ట్రంప్ షాకింగ్ – అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు

సహనం వందే, అమెరికా: అమెరికాలో ఎన్నికల ప్రక్రియపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కంటే పాత కాలపు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికల నిర్వహణే అత్యుత్తమమని ఆయన తేల్చి చెప్పారు. ఓటింగ్ మెషీన్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించి పారదర్శకమైన పద్ధతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రతినిధులకు…

Read More
Tourist Visa Scrutiny

విజిటింగ్ వీసా… ఊచల బాట! – పర్యాటక వీసాలపై వెళ్లి ఉద్యోగం చేస్తే జైలే

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా గడ్డపై అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో చేసే చిన్న తప్పులు జీవితాంతం శాపంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా ఎంబసీ జారీ చేసిన హెచ్చరికలు చూస్తుంటే నిబంధనల ఉచ్చు ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది. వీసా రావడం ఒక ఎత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిబంధనల ఉచ్చు బిగుస్తోందిభారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం పర్యాటక వీసాదారులకు తాజాగా ముందస్తు…

Read More
America Vs Greenland @Denmark

చంపేయండి… తర్వాత చూసుకుందాం!! – గ్రీన్ ల్యాండ్ రక్షణ కోసం డెన్మార్క్ డైనమిజం

సహనం వందే, గ్రీన్ ల్యాండ్: అగ్రరాజ్యం అమెరికాకు, డెన్మార్క్ కు మధ్య గ్రీన్ ల్యాండ్ వివాదం ముదురుతోంది. వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ తన సైన్యానికి ఇచ్చిన అత్యంత కఠినమైన ఆదేశాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. తమ భూభాగంలోకి అడుగుపెడితే శత్రువు ఎవరైనా సరే తుపాకులకు పని చెప్పాలని స్పష్టం చేసింది. మొదట కాల్పులు… ఆ…

Read More
Alternative drink by Yasmeen Santos instead of Alcohol

మత్తు మారదు… మందు ఉండదు – ఆల్కహాల్ లేకుండానే రిలాక్సేషన్ ఫార్ములా

సహనం వందే, అమెరికా: గ్లాసులో పోస్తే ఆల్కహాల్ లాగే కనిపిస్తుంది. సిప్ చేస్తే కిక్కు ఇస్తుంది. కానీ ఇది మద్యం కాదు. కాలేయాన్ని పాడు చేయదు. హ్యాంగోవర్ అస్సలే ఉండదు. మెటా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలో పనిచేసిన ఓ యువతి, సాఫ్ట్‌వేర్ కోడింగ్ వదిలేసి మూలికలతో ముడిపడిన వినూత్న వ్యాపారంలోకి దూకింది. మత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన మొక్కలతో అద్భుతాలు సృష్టిస్తోంది. సాఫ్ట్‌వేర్ వదిలి… వంటిల్లే ప్రయోగశాలయాస్మిన్ శాంతోస్ ఒకప్పుడు మెటా కంపెనీలో యాడ్ స్పెషలిస్ట్‌గా…

Read More
Trump warnings

ప్రపంచానికి మరో హిట్లర్ – దేశదేశాన అమెరికా జెండా లక్ష్యం

సహనం వందే, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నాజీ నియంత హిట్లర్ ఎలాగైతే వ్యవహరించాడో… సరిగ్గా అలాగే ట్రంప్ కూడా ప్రపంచంపై ఆధిపత్యం కోసం దూకుడుతో ముందుకు వెళ్తున్నాడు. వెనిజులా అధ్యక్షుడు మదురోను బందీగా తీసుకురావడమే ప్రపంచ దేశాలకు పరోక్షంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లైంది. వెనిజులా నుంచి ఇండియా వరకు ఆయన హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. స్నేహం…

Read More
Venezuela President Madura

ట్రంప్ హంటింగ్… గ్లోబల్ షాకింగ్ – అధునాతన టెక్నాలజీతో అధ్యక్షుడి అంతం

సహనం వందే, హైదరాబాద్: ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం అంటే అది కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకున్నారంతా. కానీ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా రాజధాని కరాకాస్‌లో జరిగిన ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాలు ఎలా జొరబడ్డాయి? వేల సంఖ్యలో ఉన్న వెనిజులా సైన్యం ఏమైంది? మదురో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అత్యంత…

Read More
Wegovy Tablets

విగోవీ స్లిమ్ ఈజీ – అమెరికాలో బరువు తగ్గే మాత్రకు గ్రీన్ సిగ్నల్

సహనం వందే, అమెరికా: అతిగా పెరిగిన బరువుతో సతమతమవుతున్న వారికి గుడ్ న్యూస్. పొట్ట తగ్గించుకోవడానికి… ఒళ్లు కరిగించుకోవడానికి రోజూ సూదులు గుచ్చుకోవాల్సిన పని లేదు. సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు.. కిలోల కొద్దీ బరువు మటాష్ అయిపోతుంది. అమెరికా ఆరోగ్య శాఖ తాజాగా ఆమోదించిన ఈ మ్యాజిక్ విగోవీ పిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. డెన్మార్క్ సంస్థ సంచలనంప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ ఈ సరికొత్త మాత్రను…

Read More

అమెరికా వీసా… విద్యార్థుల దండయాత్ర – ట్రంప్ రూల్స్ ను బ్రేక్ చేసిన భారతీయులు

సహనం వందే, న్యూఢిల్లీ:అమెరికాలో చదవడానికి మన విద్యార్థులు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ట్రంప్ కారణంగా వీసా కష్టాలు ఇబ్బంది పెడుతున్నా… నిబంధనలు మారుతున్నా మనవాళ్లు ఏమాత్రం వెనక్కి చూడడం లేదు. అమెరికాలో చదివి తీరాల్సిందేనన్న బలమైన ఆకాంక్షతో అక్కడికి వెళ్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏకంగా 3.63 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 9.5 శాతం ఎక్కువ. అమెరికాలో చదువుతున్న మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో…

Read More