Kalvakuntla Family Politics

ముఖ్యమంత్రి కాకుంటే పార్టీ ముక్కలే – కల్వకుంట్ల కుటుంబంలో అందరూ సీఎంలే

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ యవనికపై కల్వకుంట్ల కుటుంబం ఒకప్పుడు తిరుగులేని శక్తి. కానీ నేడు అదే కుటుంబం అధికార దాహంతో ముక్కలవుతోంది. ఒకే గూటి పక్షులు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న ఈ అంతర్యుద్ధం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితి వరకు సాగిన ప్రయాణం ఇప్పుడు విచ్ఛిన్నం దిశగా సాగుతోంది. తారాస్థాయికి వారసత్వ పోరు…భారతదేశ రాజకీయ చరిత్రలో…

Read More
Kavitha New Party

‘పార్టీ అంటే పాన్ షాప్ డబ్బా కాదు’ – కవిత పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. సొంత తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాలపై కూతురు కవిత ధిక్కార స్వరం వినిపించడం సంచలనంగా మారింది. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు. శనివారం తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతుంది. ఈ పార్టీ ఆశయం కంటే ఆవేదనతోనే ఈ అడుగు వేస్తుందన్న చర్చ నడుస్తోంది. కుటుంబ కలహాలు, కేసుల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ ప్రయాణం తెలంగాణ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో…

Read More
Kavitha

కవిత మను’గడగడ’ – ముగిసిన షర్మిల ముచ్చట… విజయశాంతి అడ్రస్ గల్లంతు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల పుట్టుక ఒక సంచలనమైతే… వాటి అదృశ్యం అంతకంటే పెద్ద మిస్టరీగా మారింది. ఉద్యమ నేతలు, సినిమా స్టార్లు, మేధావులు పెట్టిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోగా ఇప్పుడు కవిత తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో పుట్టబోయే ఈ పార్టీ రాజకీయాల్లో ఏ మేరకు నిలదొక్కుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల చరిత్రతెలంగాణ గడ్డపై పార్టీ పెట్టిన ఏ ఒక్కరూ కూడా…

Read More
Kavitha BC Bhata

బీసీ బాట… కవిత వేట – గురి పెట్టిన జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ తెరపై మరో సంచలనం మొదలైంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తూ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మూడు ప్రధాన పార్టీల కోటలను బద్దలు కొట్టే వ్యూహం. ఈ రాజకీయ చదరంగంలో కవిత వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. బలమైన సామాజిక అస్త్రంతెలంగాణ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు రాజకీయాలకు కీలకంగా మారారు….

Read More
Kavitha family

కుటుంబంలో కుట్ర… కవిత కుతకుత – కన్నీటి గీత దాటి కవితమ్మ విప్లవం!

సహనం వందే, హైదరాబాద్: కొన్నిసార్లు మనం ఎవరి కోసం యుద్ధం చేస్తామో వారే మనకు తెలియకుండా మన వెనుక గోతులు తవ్వుతుంటారు. బంధుత్వం అనేది ఒక సురక్షితమైన నీడ అనుకుంటాం కానీ ఒక్కోసారి అదే నీడ మన అస్తిత్వాన్ని కప్పేసే చీకటిగా మారుతుంది. కల్వకుంట్ల కవిత ప్రయాణం ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. తండ్రి బాటలో నడిచిన ఒక బిడ్డ… ఇప్పుడు ఆ తండ్రి నీడ నుంచి, అన్న అహంకారం నుంచి బయటకు వచ్చి.. తనకంటూ ఒక…

Read More
Kavitha New Party

కవిత కన్నీటి పోరాటం – సొంత పార్టీ పెట్టేందుకు సన్నాహం

సహనం వందే, హైదరాబాద్: అధికార దాహం ముందు రక్తసంబంధం వెలవెలబోతోంది. వారసుడిని గద్దెనెక్కించే క్రమంలో కన్నకూతుళ్లనే బలిపీఠం ఎక్కిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ గురించి గొప్పలు చెప్పే నేతలు సొంత కూతురి విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఆకాశంలో సగం అని డబ్బాలు కొట్టుకునే నేతలు వాస్తవానికి వచ్చేసరికి సొంత కూతుళ్లనే తొక్కుతున్నారు. రాజకీయ చదరంగంలో ఆడబిడ్డలు బలిపశువులవుతున్నారు. వారసుల కోసం కన్నబిడ్డలను కాదనుకుంటున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ పెట్టేందుకు…

Read More
Kavitha Party TRS

మళ్లీ ప్రాణమై లేస్తున్న టీఆర్ఎస్ – పాత పేరు కొత్త నినాదం

సహనం వందే, హైదరాబాద్: గడియారం వెనక్కి తిరుగుతోంది. కాలం గర్భంలో కలిసిన పేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది. త్యాగాల పునాదులపై లేచిన తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్ఎస్) కాలం తీరిందని పక్కన పెట్టారు. కానీ అదే పేరు ఇప్పుడు ఆయుధమైంది. కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాజకీయ తెరపై నివురు గప్పిన నిప్పును రాజేసింది. ఇది కేవలం పార్టీ పేరు మార్పు కాదు… ఒక పెద్ద యుద్ధానికి నాంది. చెత్తబుట్టలో చైతన్యంరాజకీయాల్లో జ్ఞాపకాలు చాలా…

Read More
Talk of the Sunday - KCR Press Meet

టాక్ ఆఫ్ ది సండే కేసీఆర్ – రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎం సందడి

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాజకీయాల్లో ఆదివారం అసలైన హీట్ పుట్టింది. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్… దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్ళీ నోరు విప్పారు. తనదైన మార్కు విమర్శలతో అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్ యుద్ధానికి సిద్ధమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సండే పొలిటికల్ మండే…కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన…

Read More
Speaker Telangana

ఫిరాయింపుల కంపు రాజకీయం – పార్టీలు మారినా దొరకని ఆధారాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ముదిరి పాకాన పడింది. పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్ష్యాల వేటలో స్పీకర్ నాటకంగులాబీ గూడు వదిలి హస్తం నీడకు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తేల్చారు. కళ్లముందే పార్టీ కండువాలు మార్చుకున్నా సాక్ష్యాలు లేవనడం హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ…

Read More
Kavitha

కవిత అక్క… పార్టీ పక్కా – రాజకీయాలపై రగిలిపోతున్న జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని…

Read More

ఆడి కారు… సుమంత్ షికారు – ఏడాది క్రితం కాంట్రాక్టు ఉద్యోగిగా జీవితం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో సుమంత్ ఎదుగుదల అధికార దుర్వినియోగానికి, ప్రభుత్వంలోని లొసుగులకు నిలువెత్తు సాక్ష్యం. కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్టు పద్ధతిపై చేరిన ఈయన… మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఏకంగా ఆమె కార్యాలయంలోనే ఓఎస్‌డీగా డిప్యూటేషన్‌పై చేరాడు. కేవలం ఒక్క సంవత్సరంలోనే ఐఏఎస్ అధికారులకు సైతం ఆదేశాలు ఇచ్చే స్థితికి రావడం ఆయన చేతిలో మంత్రి కార్యాలయం మొత్తం బందీ అయిందనడానికి నిదర్శనం. అటవీ శాఖలో బదిలీలు, పదోన్నతుల్లో భారీగా లంచాలు వసూలు చేయడం,…

Read More

మంత్రిపైనే ముఖ్యమంత్రి ‘గన్’ – ఏకంగా సొంత మంత్రి ఇంటిపైనే పోలీస్ ఎటాక్

సహనం వందే, హైదరాబాద్:సహజంగా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో హల్చల్ చేయిస్తుంది. కానీ తెలంగాణలో సొంత మంత్రిపైనే పోలీసులతో అర్ధరాత్రి ఎటాక్ చేశారు. అది కూడా మహిళా మంత్రిపై ఈ దాడి జరిగింది. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చుట్టూ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజకీయ తుఫాన్ వీస్తోంది. సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో మంత్రి ఇంటికి బుధవారం రాత్రి పొద్దుపోయాక టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది….

Read More

పటిష్ట వ్యూహంతో పదేళ్లు పాగా – మరో రెండు మార్లు సీఎం కుర్చీలో కర్చీఫ్

సహనం వందే, హైదరాబాద్:‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. హైదరాబాదును న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు ఆ సిటీలకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామ’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ… రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా మారాయి. తనకు మరో పదేళ్లు…

Read More

రాజకీయ ఎజెండాగా కుటుంబ తగాదాలు – కవిత రాజీనామా… భవిష్యత్తుపై గందరగోళం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. కవిత తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, ప్రజా సమస్యలపై మాట్లాడితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు. పార్టీ పెద్దలు ఈ విషయాలపై పునరాలోచించాలని ఆమె కోరారు. తన తండ్రి కేసీఆర్, సోదరుడు…

Read More

అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

‘పదవులు మీకే… పైసలు మీకేనా’ – రేవంత్‌ రెడ్డి పై రగులుతున్న కోమటిరెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని లక్ష్యంగా చేసుకుని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తారనే హామీని విస్మరించడం, నియోజకవర్గానికి నిధులు రాకపోవడంపై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా సంఘం ఆయనతో మాట్లాడాలని నిర్ణయించినప్పటికీ, రాజగోపాల్‌రెడ్డి తన దండయాత్రను ఆపడం లేదు. మంత్రి పదవి వివాదం.. విభేదాలకు కారణంరాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరే…

Read More

రేవంత్ వర్సెస్ రాజ’కోపాల్’ – ‘నేనే సీఎం’ రగడ

సహనం వందే, హైదరాబాద్: ‘రాబోయే పదేళ్లు నేనే సీఎం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లను కలవర పెడుతున్నాయి. ఈ ప్రకటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించడంతో పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ సామ్రాజ్యం నడుస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘పదేళ్ల సీఎం’ ప్రకటన దుమారంజటప్రోలులో…

Read More

కవిత ‘ఢీ’ఆర్ఎస్ – తండ్రి పార్టీతో కవిత బంధానికి ముగింపు?

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చ ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అవుననే సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆమె అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కదలికలు, చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో పార్టీ వైఖరిని ఉద్దేశించి ఆమె…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు…

Read More

ఆర్థికమా? అధికారమా?

సహనం వందే, హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో…

Read More

తెరపైకి మహేష్ కుమార్ గౌడ్

సహనం వందే, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశం అయింది. బీసీగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి అవకాశాలు సన్నగిల్లినట్లే. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి…

Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

Read More

…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ…

Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

Read More

ఒకే వ్యూహం… ఒకే గేమ్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు… మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులపై పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. వారిపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది‌. కేసీఆర్, జగన్‌లను అరెస్టు చేయడానికి ఇదే సరైన సమయంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భావిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తే రాబోయే ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో…

Read More