మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

0
Read More

బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు…

0
Read More

ఆర్థికమా? అధికారమా?

సహనం వందే, హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు పితామహుడు కారల్ మార్క్స్ చెప్పింది అక్షరాలా నిజం. డబ్బు, పదవి… ఈ రెండూ కవల పిల్లలు. ఈ రెండింటి కోసం రక్త సంబంధాలన్నింటినీ ధ్వంసం చేసుకోవటానికి కూడా వెనుకాడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ తోనూ తెగతెంపులు చేసుకోవడానికి ఆ రెండే కారణం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి… ఇవన్నీ కూడా పదవి, డబ్బు ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో…

0
Read More

తెరపైకి మహేష్ కుమార్ గౌడ్

సహనం వందే, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశం అయింది. బీసీగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి అవకాశాలు సన్నగిల్లినట్లే. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి…

0
Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

0
Read More

…‌శాఖలకు ‘ముఖ్య’మంత్రులు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, మంత్రివర్గం ఏకతాటిపై నడవని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలతో జనాదరణ పొందుతున్నప్పటికీ, కొందరు మంత్రులు తమ శాఖలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, సీఎం ఆదేశాలను ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ శాఖలకు ముఖ్యమంత్రులుగా భావిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ…

+2
Read More

కవితక్క వెనుక వ్యూహకర్త!

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం బయటపడింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… ఏకంగా తన తండ్రిపైనే యుద్ధం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ‘మై డియర్ డాడీ’ అంటూ ఆరు పేజీల సంచలన లేఖ రాసి, పార్టీలోని అసంతృప్తిని, లోపాలను కవిత తీవ్ర పదజాలంతో ఎత్తి చూపారు. బీజేపీతో పొత్తు ఊహాగానాలు, సీనియర్ నేతలకు అవకాశాలు లేకపోవడం, పార్టీ వ్యవహారాల్లో స్పష్టత లోపించడం వంటి అంశాలపై కవిత…

0
Read More

ఒకే వ్యూహం… ఒకే గేమ్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అధికారం చేపట్టిన ఏడాది తర్వాత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు… మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర్ రావులపై పొలిటికల్ గేమ్ మొదలుపెట్టాయి. వారిపై అవినీతి ఆరోపణలతో దర్యాప్తు సంస్థల వేట కొనసాగుతోంది‌. కేసీఆర్, జగన్‌లను అరెస్టు చేయడానికి ఇదే సరైన సమయంగా తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు భావిస్తున్నాయని, మరింత ఆలస్యం చేస్తే రాబోయే ఎన్నికలపై వ్యతిరేక ప్రభావం పడుతుందని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో…

0
Read More