ఆయిల్ పామ్ అక్రమాలపై డీఎన్ఏ కొరడా – నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

సహనం వందే, హైదరాబాద్:కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలతో అశ్వారావుపేటలో భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన ఈ బృందం… పూర్తిస్థాయిలో ఈ మూడు రోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయమంది. ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలు… నాణ్యతా లోపాలపై ఈ బృందం లోతైన పరిశోధన చేయనుంది. అంతేకాదు అత్యంత శాస్త్రీయ పద్ధతిలో ఏకంగా డీఎన్ఏ పరీక్షలు చేయాలని…

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ నర్సరీలలో కేంద్ర బృందం

సహనం వందే, అశ్వారావుపేట: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాల మేరకు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు గురువారం అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటించారు. నర్సరీలు, జన్యు లోపం ఉన్న మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందం పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఎంవీ ప్రసాద్, రామచంద్రుడు సహా ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే అశ్వారావుపేట ఆయిల్…

Read More

ఆయిల్ ఫెడ్ నర్సరీ కుంభకోణంలో సూత్రధారి ప్రవీణ్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:నాణ్యతలేని ఆయిల్ పామ్ మొక్కలను అంటగట్టి తమ జీవితాలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మొక్కలను పంపిణీ చేయడంలో ఆయిల్ ఫెడ్ అధికారులే దోషులని వారు నిందించారు. జన్యులోపం మొక్కలను పంపిణీ చేశారని ఆరోపించారు. నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో విచారణ జరిగింది. కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అధికారులను ప్రశ్నించింది….

Read More

తెలంగాణ ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్రం ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం వేసింది. నర్సరీలు, నాణ్యతలేని మొక్కలు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రంగంలోకి దిగారు. తెలంగాణలో జరుగుతున్న ఆయిల్ పామ్ మొక్కల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ (ఐఐఓపీఆర్)లకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తల బృందం…

Read More

ఆయిల్ ఫెడ్ బోర్డుకు బురిడీ… కోట్లు దోపిడి

సహనం వందే, హైదరాబాద్: సురేందర్… గతంలో ఆయిల్ ఫెడ్ కు ఎండీగా పనిచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. ఆయిల్ పామ్ సాగు… ఫ్యాక్టరీల నిర్మాణం… ఉత్పత్తి వంటి విషయాలపై అంచనాలకు అందనంత దూరంలో లెక్కలు వేసి ఆయిల్ ఫెడ్ బోర్డును బోల్తా కొట్టించారన్న విమర్శలున్నాయి. అందుకు మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి పూర్తిస్థాయి అండదండలు ఇచ్చారు. అందుకు 2023 ఏప్రిల్ 3వ తేదీన జరిగిన బోర్డు సమావేశమే నిలువెత్తు నిదర్శనం….

Read More

ఆయిల్ ‘ఫ్రాడ్’తో కోటీశ్వరులు – కోట్లకు పడగలెత్తిన అధికారులు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ లో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థను ఫణంగా పెట్టి కోట్లకు పడగలెత్తుతున్నారని అందులోని ఉద్యోగులే మండిపడుతున్నారు. తమ అధికారాలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పామాయిల్ మొక్కల్లో అక్రమాలు, నూనెల విక్రయాల్లో అవకతవకలు, నర్మెట్ట ఫ్యాక్టరీ టెండర్లలో గోల్మాల్… ఇలా అనేక రూపాలుగా అవినీతి పేరుకుపోయినట్లు చెప్తున్నారు. అందులోని కీలక స్థానాల్లో ఉన్నవారు సిండికేట్ అయ్యి సంస్థను నట్టేట ముంచుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం…

Read More

ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ అధికారాలకు కత్తెర

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి అధికారాలకు కత్తెర పడింది. అంతేకాదు ఆయనకు ఘోర అవమానం జరిగింది. తద్వారా కార్పొరేషన్ జీఎం పోస్టును డమ్మీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకునే దానికంటే సంస్థ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జనరల్ మేనేజర్ పోస్టు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఎండీ తర్వాత కీలకమైన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి…

Read More

ఆయిల్ ఫెడ్ ఎండీపై వేటు?.. కొత్త ఎండీగా శంకరయ్య

సహనం వందే, హైదరాబాద్:ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషాను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆ సంస్థలో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూస్తుండటం… వాటిని నియంత్రించలేదన్న విమర్శలు రావడం… అనేక అదనపు బాధ్యతలు ఉండటం… తదితర కారణాలతో యాస్మిన్ బాషాను తప్పించి పూర్తిస్థాయి ఎండీగా శంకరయ్యను నియమించింది. ఆయిల్ ఫెడ్ లో కింది నుంచి పైస్థాయి వరకు అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లు…

Read More

ఆయిల్ ఫెడ్ అధికారులపై వ్యవసాయ మంత్రి తుమ్మల ఫైర్

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై ఇటీవల వరుసగా ‘సహనం వందే, ఆర్టికల్ టుడే’ (sahanamvande.com & articletoday.in) డిజిటల్ పేపర్లలో వస్తున్న కథనాలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. మంగళవారం హైదరాబాదులోని ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు. ఆయిల్ ఫెడ్ అక్రమాల్లో కొందరు అధికారుల తీరుపై మంత్రి మండిపడినట్లు సమాచారం. ఆ రెండు డిజిటల్ పేపర్లలో…

Read More

కోట్లు కొల్లగొట్టారు – కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసే కుట్ర

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరు కీలక స్థాయి వ్యక్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని పామాయిల్ రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ను నాశనం చేస్తున్నారని అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోవర్స్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేసింది. ఈ లేఖ ఆయిల్ ఫెడ్…

Read More