రేవంత్ మార్క్… అదిరిపోయే స్ట్రోక్ – ఆయిల్ పామ్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా
సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు పెంచకుండా కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. ఇలాంటి సంస్థల పట్ల ఉదాసీనత పనికిరాదని భావించిన సర్కారు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. సాగులో పురోగతి చూపని కంపెనీల జోన్లను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…