Tag: #News
రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?
సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…
తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు
సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….
దళిత ఐఏఎస్ బ్రాహ్మణులకు సవాల్ – పెళ్లి పీటలెక్కేవరకు రిజర్వేషన్లు మస్ట్
సహనం వందే, భోపాల్: రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన…
ఐ బొమ్మ అప్పారావు ‘మెగా’ వార్నింగ్ – సినిమా పరిశ్రమను ఉతికి ఆరేసిన రవి తండ్రి
సహనం వందే, హైదరాబాద్: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి అప్పారావు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి. కల్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదని… నిజంగా ఎన్‌కౌంటర్ చేయాలంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్న కల్యాణ్‌ను,…
బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా
సహనం వందే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న…