
టైటానిక్ మునిగిపోయే వరకూ లైట్లు
సహనం వందే, లండన్:చరిత్ర పుటల్లో విషాద గాథగా నిలిచిన టైటానిక్ షిప్ ప్రమాదం గురించి తాజాగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాధునిక స్కానింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన పరిశీలనలో… టైటానిక్ మునిగిపోతున్న భయానక క్షణాల్లో సైతం ఓడలోని విద్యుత్ దీపాలు చివరి వరకు వెలుగుతూనే ఉన్నాయని తేలింది. దీనికి కారణం ఓడ ఇంజనీర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన అసాధారణమైన ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు.1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మంచుకొండను ఢీకొట్టిన తర్వాత టైటానిక్ మునిగిపోవడంతో…