భార్య హిందువని అమెరికా ఉపాధ్యక్షుడిపైనే మత దాడి

సహనం వందే, వాషింగ్టన్: అమెరికాలో జాతి వివక్షతతోపాటు మత విద్వేషాలు రగిలిపోతున్నాయి. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌ను టార్గెట్ చేస్తూ మత, జాతి వివక్షా పూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ తెలుగు హిందూ కుటుంబం కావడం… జేడీ వాన్స్ అమెరికన్ క్రిస్టియన్ కావడంతో వారిపై మతపూరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుడ్ ఫ్రైడే సందర్భంగా రోమ్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్…

Read More

‘ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్’

యుద్ధం మిగిల్చిన విషాదం! సహనం వందే, గాజా సిటీ: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో రెండు చేతులు కోల్పోయిన 9 ఏళ్ల పాలస్తీనియన్ బాలుడు మహమూద్ అజ్జౌర్ చిత్రం 2025 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గాజా ఫోటోగ్రాఫర్ సమర్ అబూ ఎలౌఫ్ తీసిన ఈ చిత్రం యుద్ధం భయానక పరిణామాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. యుద్ధం మిగిల్చిన విషాదం! గత ఏడాది గాజాపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మహమూద్ తీవ్రంగా గాయపడ్డాడు….

Read More

ప్యాలెస్ పాలిటిక్స్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి: రాజకీయ నాయకులు పేదల సేవకులమని గొప్పలు చెప్పుకుంటూ, సామాన్య దుస్తులు, చెప్పులు ధరించి అత్యంత సాధారణ జీవన శైలితో కనిపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరించే దుస్తులు అత్యంత సామాన్యుడిని గుర్తుచేస్తాయి. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సాధారణమైన బట్టలు, చెప్పులతో కనిపిస్తారు. ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటినుంచి ఒకే స్టయిల్ సాధారణ దుస్తులు ధరిస్తారు. వందల కోట్లు ఉన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగిలేటి…

Read More

ద్విజాతి సిద్ధాంతం వల్లే పాకిస్థాన్ ఏర్పాటు

సహనం వందే, ఇస్లామాబాద్: హిందువులకు, ముస్లింలకు జీవన విధానంలో ప్రతి విషయంలోనూ వైరుధ్యం ఉందని, అనేక తేడాలు ఉన్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఏర్పడటానికి ఈ ద్విజాతి సిద్ధాంతమే ముఖ్య కారణమని ఆయన మరోసారి చెప్పారు. ఇస్లామాబాద్‌లో జరిగిన విదేశీ పాకిస్థానీయుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ మూలాలను గుర్తుంచుకోండి… దేశ గుర్తింపును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ద్విజాతి సిద్ధాంతం గురించి తప్పకుండా…

Read More

హంతకుడి చర్మంతో పుస్తకం

సహనం వందే, లండన్: బ్రిటన్ చరిత్రలో ఒక భయంకరమైన నేరానికి గుర్తుగా నిలిచిన పుస్తకం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హంతకుడు విలియం కోర్డర్ చర్మంతో చేసిన అరుదైన పుస్తకం సఫోల్క్‌లోని మోయిసెస్ హాల్ మ్యూజియంలో త్వరలో సందర్శకులకు అందుబాటులో రానుంది. ఈ పుస్తకం ఊహించని విధంగా బయటపడటంతో దీని చుట్టూ చరిత్ర, నైతికతకు సంబంధించిన ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. 19వ శతాబ్దంలో సంచలనం సృష్టించిన “రెడ్ బార్న్ మర్డర్” కేసుతో ఈ పుస్తకానికి సంబంధం ఉంది. ఆనాటి…

Read More

అందాల వేదికపై ఎర్రజెండా

సహనం వందే, హైదరాబాద్: చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ప్రోత్సహిస్తుంటే… క్యూబా, ఉత్తర కొరియా కమ్యూనిస్టు దేశాలు మాత్రం వాటిని పాశ్చాత్య సంస్కృతిగా దూరంగా ఉంచుతున్నాయి. ఇండియా కమ్యూనిస్టులు సైతం ఇదే బాటలో నడుస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉనికికోసం చైనా తహతహ… చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు అందాల పోటీలను ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయంగా తమ…

Read More

కరెన్సీ వెనుక క్యాస్టిజం

(విజయ్ పుట్టపాగ, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి మహనీయుడి చిత్రం మన కరెన్సీ నోట్లపై లేకపోవడం కేవలం పొరపాటు కాదు, ఆధిపత్య వర్గాల కుట్ర. భారత రాజ్యాంగ శిల్పి, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక సూత్రధారి, కుల నిర్మూలన యోధుడైన అంబేద్కర్‌ను గౌరవించకపోవడం సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను సూచిస్తుంది. మహాత్మా గాంధీ జాతిపిత కాగా… అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన యోధుడు. దేశంలో అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరాధ్య…

Read More

దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ

సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…

Read More

యుద్ధానికి సిద్ధంగా ఉండండి!

సహనం వందే, యూరప్:రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తమ కొంప ముంచుతుందని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి. తూర్పు యూరప్‌లో రష్యా సైనిక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర యూరోపియన్ దేశాలపైనా దాడి చేసే అవకాశం ఉందని పలువురు నాయకులు భయపడుతున్నారు. దీంతో యూరప్ లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పౌరుల భద్రత కోసం పలు యూరప్ దేశాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. యుద్ధం…

Read More

అగ్రకులాల గుప్పిట్లో బహుజన ఉద్యమం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో రెడ్డి రిపబ్లిక్‌ రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కమ్మ, కాపు వర్గాలే రాజ్యమేలుతున్నాయి. కేవలం 15% గా ఉన్న అగ్రకులాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తున్నాయి. రాజకీయ అధికారం మొదలు… సమస్త సంపద వారి చేతుల్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను తమ గుప్పెట్లో పెట్టుకుని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజ్యాధికారం చలాయిస్తున్నారు. రాజ్యాధికారం కోసం పోరాడాలని అంబేద్కర్, కాన్షీరాం, జ్యోతిరావు పూలే వంటి…

Read More