జైలు నుంచే జాక్వెలిన్‌కు బాలీ ద్వీపం గిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ఊచలు లెక్కబెడుతున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లోకెక్కాడు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి చనిపోయినందుకు సంతాపం తెలుపుతూ… ఏకంగా ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో కొంత భాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడట! ఈ ప్రేమ పిచ్చోడు ఢిల్లీలోని జైలు నుంచి రాసిన లేఖలో ఈ విషయం వెల్లడించాడు. బాలీలో నీకో అందమైన లోకం! తన లేఖలో సుకేశ్… జాక్వెలిన్ తల్లి మరణం తనను తీవ్రంగా బాధించిందని,…

Read More

పాక్ రాయబార కార్యాలయంలో కేక్ కటింగ్

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు నింపుతుంటే… ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ వ్యక్తి కేక్ పట్టుకెళ్లిన అత్యంత హేయమైన ఘటన సంచలనం రేపింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. నెత్తుటి మరకలు ఆరకముందే సంబరాలా? ఏప్రిల్ 22న బైసరన్…

Read More

భారత్ కూ కావాలి…ఘోస్ట్ ఆర్మీ ‘మొసాద్’

సహనం వందే, హైదరాబాద్: ఇజ్రాయెల్… మధ్యప్రాచ్యంలో నిత్యం అగ్నిగుండంలా ఉండే ఒక చిన్న దేశం. చుట్టూ శత్రుదేశాలు… నిత్యం ఉగ్రవాద దాడుల ముప్పు. కానీ ఇజ్రాయెల్ ధైర్యంగా నిలబడుతోంది. దానికి ఒక ముఖ్య కారణం దాని శక్తివంతమైన గూఢచర్య సంస్థ మొసాద్. మొసాద్ అంటే హెబ్రీ భాషలో “నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ”. ఇది ఇజ్రాయెల్ కు కళ్లు, చెవులు మాత్రమే కాదు… దాని రహస్య ఆయుధం కూడా. మొసాద్ తన దేశ భద్రత కోసం ఎంతటి సాహసానికైనా…

Read More

మతం ముసుగులో మారణహోమం

సహనం వందే, జమ్ము కాశ్మీర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు… వారి మతం తెలుసుకొని మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు మరింత కలచి వేస్తున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు… మతోన్మాదం విషం ఎంతగా పాతుకుపోయిందో చెప్పే భయానక సత్యం. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ లౌకికవాద స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. మతాల మధ్య గొడవలు చెలరేగేలా……

Read More

‘రక్త’ సంబంధాలు

సహనం వందే, క్రైమ్ బ్యూరో, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు.. నేటి సమాజంలో పెరిగిపోతున్న దారుణాలకు మరింత ఊతమిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పును కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ.. తమ వికృత చేష్టలకు చట్టపరమైన అనుమతి లభించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా వివాహ బంధాలు తెగిపోతున్నాయి. రక్తపుటేరులు పారుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో…భారతీయ సంస్కృతిలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడమే కాదు.. రెండు కుటుంబాల కలయిక. జన్మజన్మల…

Read More

‘న్యాయమూర్తికి అంత హక్కుందా?’

సహనం వందే, ఢిల్లీదేశంలో న్యాయవ్యవస్థకు, చట్టసభలకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనూహ్యంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సంబంధించిన ఒక పాత వీడియోను తెరపైకి తెచ్చింది. ఈ వీడియోలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థ అధికార పరిధిని ప్రశ్నిస్తూ, 1975 ఎమర్జెన్సీ సమయంలో జరిగిన అత్యాచారాల విచారణ కోసం ఏర్పాటు చేసిన షా కమిషన్‌ను తప్పుబడుతున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న…

Read More

మాత్రతో బరువుకు చెక్

సహనం వందే, హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే! అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఎలి లిల్లీ ఊబకాయానికి చెక్ పెట్టే ఒక అద్భుతమైన మాత్రను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ‘ఓర్ఫోర్గ్లిప్రాన్’ మాత్ర, ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా ఉండటమే కాకుండా, వాడటానికి కూడా చాలా సులభంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని పంపిణీ మరింత సులభతరం కానుంది. సగటున 7.2 కిలోల బరువు తగ్గుదల!ఓర్ఫోర్గ్లిప్రాన్ ఫేజ్-3…

Read More

ఫ్యాషన్ రంగంలో ‘ఓలో’ విప్లవం

సహనం వందే, హైదరాబాద్: శాస్త్ర ప్రపంచంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా శాస్త్రవేత్తల బృందం మానవులు ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త రంగును కనుగొనడం సంచలనం సృష్టిస్తుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణ శాస్త్రీయ పరిశోధనల్లో ఒక గొప్ప మలుపుగా నిలుస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. మనకు తెలిసిన ఏడు రంగులతో పాటు, ఈ కొత్త రంగు చేరడంతో రంగుల ప్రపంచం మరింత విస్తృతం కానుంది. ఇది శాస్త్ర, సాంకేతిక, కళా రంగాలలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని ఆశాభావం…

Read More

పొలిటికల్ ‘జనరేషన్ Z’

సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక బలమైన శక్తిగా ఎదిగింది. మరీ ముఖ్యంగా 1997-2012 మధ్య జన్మించిన ‘జనరేషన్ జెడ్’ జీవితాల్లో ఇది ఒక అంతర్భాగమైపోయింది. ఈ తరం రాజకీయంగా అత్యంత అవగాహన కలిగినదిగా పేరు తెచ్చుకుంది. ఆన్‌లైన్ రాజకీయ చర్చల్లో వీరు మునిగిపోతున్నారని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వేదికలు జనరేషన్ జెడ్ యువతకు రాజకీయాలపై జ్ఞానాన్ని అందిస్తున్నాయని అధ్యయన నివేదిక తెలుపుతుంది. ఎక్కడ ఏం జరిగినా…

Read More

భారతీయ విద్యార్థులే బలిపశువులా?

సహనం వందే, వాషింగ్టన్: ట్రంప్ విధానాలకు మద్దతు ఇస్తున్నందుకు అమెరికా ప్రభుత్వం మాత్రం భారతీయ విద్యార్థులను గెంటేస్తుంది. అమెరికా టారిఫ్ లపై అనేక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంతవరకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. చైనా వంటి దేశాలు బహిరంగంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుంటే… మనం మాత్రం సమర్థిస్తున్నాం. కానీ అమెరికా మాత్రం చైనా విద్యార్థులకు అనుకూలంగా… మనవాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం ఆ దేశం ఎఫ్-1 వీసాలను రద్దు చేసే కార్యక్రమం…

Read More