
రైతన్న నోట్లో మార్క్ ఫెడ్ మట్టి – పరిశ్రమలకు తరలుతున్న యూరియా
సహనం వందే, హైదరాబాద్:యూరియా కొరతతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంటలకు ఎరువు వేయలేని పరిస్థితి నెలకొంది. కొరతను ఆసరాగా చేసుకుని కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలకు కేటాయించిన యూరియాను కొందరు అక్రమార్కులు పరిశ్రమలకు మళ్లించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూరియాను పైవుడ్, రెసిన్, పెయింట్స్, వార్నిష్ పరిశ్రమలు, జంతు, పౌల్ట్రీ, ఫీడ్ యూనిట్లలో, సారాయి తయారీలో వినియోగిస్తారు. కేంద్ర…